International Literacy Day : అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

International Literacy Day : అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
x
Highlights

International Literacy Day : అక్షరాస్యత అంటే సాంప్రదాయకంగా భాషను ఉపయోగించేందుకు అవసరమైన చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు...

International Literacy Day : అక్షరాస్యత అంటే సాంప్రదాయకంగా భాషను ఉపయోగించేందుకు అవసరమైన చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు తెలుసుకోవటాన్నే అక్షరాస్యత అనవచ్చు. అయితే మనిషి దైనందిన జీవితంలో ఈ రాయడం, చదవటం మాత్రమే అక్షరాస్యత అనేది కాదనీ, అక్షరాస్యత అంటే మనిషి గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత అని కొంతమంది పెద్దలు చెబుతుంటారు. ఉన్నతమైన జీవనానికి ప్రపంచం అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉండడానికి నిరక్షరాస్యత ముఖ్యకారణం. అలా వెనకబడిన దేశాలను ముందుకు తీసుకురావడానికే అక్షరాస్యతను శాతాన్ని పెంచాలి. ఇది పిల్లల్లోనే కాకుండా వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడింది.

ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం అగాధంలో వున్నట్లే చెప్పవచ్చు. ఈ మాత్రమైనా మనదేశ అక్షరాస్యత ఉందంటే దానిక్కారణం కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం తప్ప మరోటి కాదు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది . స్వాతంత్య్రం వచ్చిన 53 ఏళ్లు గడుస్తున్నా 65 శాతం అక్షరాస్యతనే సాధించగలిగాము .ఈ సందర్భంగా విద్య యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు . అందరూ చదివినప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుంది .

ప్రతి ఏడాది సెప్టెంబర్ 8వ తేదీని "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం"గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నవంబర్ 17, 1965 సంవత్సరంలో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించగా 1966 నుండి జరుపుకుంటున్నాము. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు వివిధ దేశాలలో అందరికీ విద్య అనే నినాదంగా లక్ష్యాలను చేర్చి కృషి చేస్తున్నాయి. ఇతర యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాలు యునైటెడ్ నేషన్స్ అక్షరాస్యత డికేడ్ నిర్వహిస్తున్నవి.

యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఇక ఐక్యరాజ్య సమితి అయితే 2003-2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. "లిటరసీ ఫర్ ఆల్, వాయిస్ ఫర్ ఆల్, లెర్నింగ్ ఫర్ ఆల్" అనే అంశాల్ని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది.

ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో), ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. దీన్ని 1945లో స్థాపించారు. ఈ సంస్థ తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణలకు తోడ్పాటునందించటమే కాకుండా అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కోసం పాటుపడుతుంది. 193మంది సభ్యులు, ఆరుగురు అసోసియేట్ సభ్యులు కలిగిన యునెస్కో ప్రధాన కేంద్రం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఉంది. ఇవి మూడు ప్రధాన విభాగాలుగా ఉన్నాయి. వాటిలో మొదటిది తన పాలసీ తయారీ కోసం, రెండవది అధికార చెలామణి కోసం, మూడవది దైనందిన కార్యక్రమాల కోసం పాటుపడుతాయి.

యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవేంటంటే... విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక, మానవ శాస్త్రాలు, సంస్కృతి, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్. యునెస్కో, విద్య ద్వారా "అంతర్జాతీయ నాయకత్వం" కోసం అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్‌లు చేపట్టడం. సాంస్కృతిక, శాస్త్రీయ ఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది. భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం. వివిధ ఈవెంట్‌లను ప్రోత్సహించడం లాంటివి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories