ఆ భర్త చేసిన పనికి ముక్కున వేలేసుకున్న జనం.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

ఆ భర్త చేసిన పనికి ముక్కున వేలేసుకున్న జనం.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?
x
Highlights

Viral video of a Husband: ఉత్తర ప్రదేశ్‌‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద...

Viral video of a Husband: ఉత్తర ప్రదేశ్‌‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరు గాంచిన ఈ మహా కుంభమేళ.. భక్తుల పుణ్యస్థానాలకే కాక, పలు వింతలు, విడ్డూరాలకు నెలవైంది. తాజాగా కుంభమేళాలో ఓ భర్త చేసిన పనికి అక్కడ ఉన్న వారంతా ముక్కునవేలేసుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సాధారణంగా మహిళలకు అలంకరణపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొందరు ఎటు వెళ్లినా తమతో పాటు మేకప్ కిట్ తీసుకెళ్తుంటారు. అయితే కుంభమేళాకు వెళ్లిన ఓ మహిళ కూడా తనతో పాటు లిప్ స్టిక్, క్రీమ్స్, పౌడర్‌ తో పాటు చిన్న అద్దం కూడా తీసుకెళ్లింది. అసలే ఇసుకేస్తే రాలనంత జనం.. భగవన్నామ స్మరణతో మారుమోగుతున్న ప్రాంతమది. అంతమంది జనం మధ్య అతి ముఖ్యమైన పని చేస్తున్నట్లు మేకప్ వేసుకుంది. ఆ మహిళ మేకప్ వేసుకుంటుండగా ఆమె భర్త ఓ చేతిలో అద్దం, మరో చేతిలో మేకప్ సామాగ్రిని పట్టుకున్నాడు.

అది చూసిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది తెగ వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు ఆ భర్తకు మొగుడు ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇవ్వాలంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఆ భార్య తన భర్తను ఏ రేంజ్‌లో వాడేస్తోందో చూడండి.. వాడకం మామూలుగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు కుంభమేళాకు అసలు మేకప్ ఎందుకని విమర్శిస్తుంటే.. ఇంకొందరు ఆ భర్త చాలా అమాయకుడిలా ఉన్నాడంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories