Road Accident Compensation: యాక్సిడెంట్‌లో చనిపోయినా గాయపడినా ఎంత పరిహారం లభిస్తుంది.. ఈ నిబంధనలు మీకు తెలుసా..?

How Much Compensation Is Available In Case Of Death Or Injury In An Accident Do You Know These Rules
x

Road Accident Compensation: యాక్సిడెంట్‌లో చనిపోయినా గాయపడినా ఎంత పరిహారం లభిస్తుంది.. ఈ నిబంధనలు మీకు తెలుసా..?

Highlights

Road Accident Compensation: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. చాలామంది చిన్న వయసులోనే చనిపోతున్నారు.

Road Accident Compensation: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. చాలామంది చిన్న వయసులోనే చనిపోతున్నారు. క్రైమ్‌ లెక్కల ప్రకారం ఇందులో ఎక్కువ శాతం యవతే ఉంటున్నారు. చాలా యాక్సిడెంట్లకు డ్రంకెన్‌ డ్రైవ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణమవుతున్నాయి. హిట్ అండ్ రన్ కేసులు చాలా పెండింగ్‌లో ఉంటున్నాయి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయినా, గాయపడినా పరిహారం చెల్లించాలని చెప్పింది. దీనికి సంబంధించిన నియమ నిబంధనల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఏటా లక్షల మంది చనిపోతున్నారు

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో గంటకు 19 మంది చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు ఏటా 10 నుంచి 12 శాతం పెరుగుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో చాలా మంది కుటుంబాన్ని పోషించే వ్యక్తులే. వారి మరణానంతరం కుటుంబం రోడ్డున పడుతుంది. కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆదాయ వనరులు లేకుండా ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కుటుంబానికి ఆర్థిక సాయం కావాలి. ప్రమాదం జరిగిన తర్వాత మీరు ట్రిబ్యునల్‌లో పరిహారం కోసం అప్పీల్ చేయవచ్చు. ప్రమాదానికి కారణమైన వాహనానిది తప్పు అని తేలితే వాహన యజమాని, బీమా కంపెనీ నుంచి పరిహారం పొందవచ్చు.

హిట్ అండ్ రన్ కేసు అయితే ఎవరైనా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల వరకు పరిహారం అందుతుంది. తీవ్ర గాయం అయితే రూ.50,000 వరకు పరిహారం అందజేస్తారు. రోడ్డు ప్రమాదంలో మరణించినా లేదా గాయపడినా మోటారు వాహన చట్టం కింద పరిహారం పొందే నిబంధన ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాదం జరిగిన 6 నెలలలోపు మీరు క్లెయిమ్ కోసం అప్లై చేసుకోవాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories