Honor 9s: అదిరే ఫీచ‌ర్ల‌తో .. హ‌న‌ర్ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌..!

Honor 9s: అదిరే ఫీచ‌ర్ల‌తో ..  హ‌న‌ర్ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌..!
x

honor 9s smart phones

Highlights

Honor 9s: హానర్ స్మార్ట్‌ ఫోన్ వ‌ర్డ‌ల్ నుండి మ‌రో స్మార్ట్‌ ఫోన్ భార‌త్ లోకి లాంచ్ కానున్న‌ది. అంద‌రికీ అందుబాటులో ఉండేలా బ‌డ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తుంది. అదే హానర్ 9ఎస్ స్మార్ట్ ఫోన్లు.

Honor 9s: హానర్ స్మార్ట్‌ ఫోన్ వ‌ర్డ‌ల్ నుండి మ‌రో స్మార్ట్‌ ఫోన్ భార‌త్ లోకి లాంచ్ కానున్న‌ది. అంద‌రికీ అందుబాటులో ఉండేలా బ‌డ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తుంది. అదే హానర్ 9ఎస్ స్మార్ట్ ఫోన్లు. వీటి మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే.. ఇందులో గూగుల్ ప్లే స్టోర్ బదులు హువావే యాప్ గ్యాలరీని అందించారు. అంటే మీరు యాప్స్ ను ఈ యాప్ గ్యాలరీలో నుంచే డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఫుల్ వ్యూ డిస్ ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్లు అందుబాటులోకి రానున్న‌ది. ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ తో రానున్న దీని ధరను రూ.6,499గా నిర్ణయించారు.

ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ రంగుల్లో లాంచ్ అయింది. దీనిపై ఆరు నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందించారు. హానర్ ఈమధ్యే మనదేశంలో హానర్ 9ఎస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ సేల్ ఈరోజు(ఆగస్టు 28వ తేదీ) జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో ఈ సేల్ ప్రారంభం కానుంది.

హానర్ 9ఎస్ స్పెసిఫికేషన్లు

హానర్ 9ఎస్ లో 5.45 అంగుళాల హెచ్ డీ+ ఫుల్ వ్యూ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 18:9గా ఉంది. మీడియాటెక్ ఎంటీ6762ఆర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 2 జీబీ ర్యామ్ అందించారు. ఇందులో వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత మ్యాజిక్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. 3020 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్ బీ పోర్టులు

* 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్

* 32జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు

* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0,

* 3020 ఎంఏహెచ్ బ్యాట‌రీ


Show Full Article
Print Article
Next Story
More Stories