కలలు కని వాటిని నిజం చేసుకున్న, హాలీవుడ్ హీరో పుట్టినరోజు ఈ రోజు.

కలలు కని వాటిని నిజం చేసుకున్న, హాలీవుడ్ హీరో పుట్టినరోజు ఈ రోజు.
x
Highlights

ది టెర్మినేటర్ గా సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిన ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగర్ పుట్టిన రోజు ఈ రోజు. ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగర్ 1947, జూలై...

ది టెర్మినేటర్ గా సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిన ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగర్ పుట్టిన రోజు ఈ రోజు. ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగర్ 1947, జూలై 30న జన్మించిన ఒక ఆస్ట్రియన్-అమెరికన్. ఈయన ఒక బాడీబిల్డర్, నటుడు, మోడల్, వ్యాపారవేత్త మరియు రాజకీయనాయకుడు. ఈయన కాలిఫోర్నియా యొక్క 38వ గవర్నరుగా కూడా సేవలందించారు. స్క్వార్జెనెగర్కి చిన్నప్పటి నుండి బాడీ బిల్డర్ కావాలనే కోరికవుండేది. అందుకే 15వ సంవత్సరాన బరువు శిక్షణ మొదలుపెట్టారు. 20వ సంవత్సరములో ఆయనకు మిస్టర్.యూనివర్స్ టైటిల్ అందించబడింది.

దీని తరువాత ఆయన మిస్టర్. ఒలింపియా పోటీని వరుసగా ఏడుసార్లు గెలుచుకొన్నారు. స్క్వార్జెనెగర్ దేహదారుడ్య క్రీడలో ప్రముఖ స్థానమును సంపాదించుకున్నారు మరియు ఆ క్రీడపై ఎన్నో పుస్తకాలు మరియు అనేకమైన వ్యాసాలు రచించారు. అలాగే సినిమాల్లో కూడా కొనాన్ ది బార్బేరియన్, ది టెర్మినేటర్ మరియు కమాండో మొదలగు చిత్రాలలో తన పాత్రలకు గుర్తింపు పొందిన స్క్వార్జెనెగర్. హాలివుడ్ యాక్షన్ ఫిలిమ్స్ లో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories