ప్రపోజ్ చేసిన నాలుగు గంటల్లోనే పెళ్లి చేసుకున్నాడు

ప్రపోజ్ చేసిన నాలుగు గంటల్లోనే పెళ్లి చేసుకున్నాడు
x
Highlights

చూసిన వెంటనే ఒకరిపై మరొకరికి ప్రేమ పుట్టడం అనేది వింతేమి కాదు అలా అని కొత్తేమి కాదు కూడా.. ఇది వరకు ఇలాంటివి చాలానే చూసాం. కానీ ఇది మాత్రం వింతే అని...

చూసిన వెంటనే ఒకరిపై మరొకరికి ప్రేమ పుట్టడం అనేది వింతేమి కాదు అలా అని కొత్తేమి కాదు కూడా.. ఇది వరకు ఇలాంటివి చాలానే చూసాం. కానీ ఇది మాత్రం వింతే అని చెప్పాలి.. అమ్మాయికి ప్రపోజ్ చేసిన నాలుగు గంటల్లోనే పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు.. ఈ ఘటన పచ్చిమ బెంగాల్ లోని కోలకత్తాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని హింద్‌ మోటార్ కి చెందినా సుదీప్ ఘోషల్ కి, షియోరాఫూలికి చెందిన ప్రతమా బెనర్జీకి సోషల్ మీడియా వేదికగా మూడు నెలల నుండి పరిచయం ఉంది.

అయితే దుర్గాష్టమి సందర్భంగా సంతోష్ మిత్రా స్క్వేర్ పూజా మండపం దగ్గర వీళ్లిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. అక్కడే సుదీప్, ప్రతమా బెనర్జీకి మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేశాడు.అతడి ప్రేమకి ప్రతమా బెనర్జీ కూడా ఫిదా అయిపోయి ఒకే చెప్పేసింది. ఇక పక్కన ఉన్న స్నేహితులు వారిని ప్రోత్సహించడంతో అదే రాత్రి 10:30కి వీరిద్దరూ ఒకటయ్యారు. వీరి ప్రేమ పెళ్ళికి వారి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఒకే చెప్పడం విశేషం ఇక్కడ..

ఇటువంటి మరిన్ని ప్రత్యేక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories