మరింత స్మార్ట్ గా గూగుల్ సేవలు

మరింత స్మార్ట్ గా గూగుల్ సేవలు
x
Highlights

ఆఫీసుకు వెళ్ళాలి.. ట్రాఫిక్ ఎలా ఉందో.. అసలే ఆలస్యం అయిపొయింది.. ఎందుకన్నా మంచిది కొద్దిగా ఆలస్యం అవుతుందని బాస్ కి చెబుదాం.. ఎంత లేటవుతుందో అంటూ...

ఫీసుకు వెళ్ళాలి.. ట్రాఫిక్ ఎలా ఉందో.. అసలే ఆలస్యం అయిపొయింది.. ఎందుకన్నా మంచిది కొద్దిగా ఆలస్యం అవుతుందని బాస్ కి చెబుదాం.. ఎంత లేటవుతుందో అంటూ మనం లెక్కలేసుకునే పని ఇక ఉండబోదు..

ఇంటికి బంధువులు వస్తున్నారు.. వంటలు చేయడం ఇప్పటికీ సరిగా రాదు. బయట నుంచి తెప్పిద్దామా అంటే ఏం బావుంటుంది చెప్పండి? ఎదో మన తిప్పలు మనమే పది వంట చేద్దాం. ఆన్లైన్లో వంటకాల రెసిపీలు దొరుకుతాయి కదా.. అయినా వాటిని చదివి వంట చేయగలమా? ఇటువంటి సందేహాలకు ఇక అవకాశం లేదు..

న్లైన్ లో ఎలక్ట్రిక్ వస్తువు కొందామని చూస్తున్నారు. వస్తువు ఫోటో చుస్తే చాలా బావుంది. కానీ, సరిగ్గా వస్తువు ఎలా ఉందొ అలానే ఉందా లేకపోతె, ఫోటో లో కనిపిస్తున్నవైపు చక్కగా ఉండి రెండోవైపు ఎలా ఉందొ.. లోపలి భాగాలు ఎలా ఉన్నాయో.. ఇవన్నీ తెలీకుండా ఏం కొంటాం అనే సందేహాలకు సెలవిచ్చేయండిక..

రదాగా ఇంటిల్లిపాదీ రెస్టారెంట్ కి వెళ్లారు. మెనూ తీసుకున్నారు. అందులో ఏది ఆర్డర్ ఇవ్వాలో తేలిక తికమక పడుతున్నారు. కొన్నిటి పేర్లే మీకు అర్థం కాలేదు. ఎం చేస్తాం ఏదోటి చెప్పేసి.. తెచ్చింది తినేసి వెళ్ళిపోదామని అనుకోవద్దు..

ఇదంతా ఏమిటనుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో గూగుల్ మనకి అందించబోతున్న సరికొత్త ఫీచర్స్! గూగుల్ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే సదస్సు ఈ సంవత్సరమూ నిర్వ్హయించింది. ఆ సదస్సులో గూగుల్ వెల్లడించిన రాబోయే కొన్ని..

మీరు వెళ్లాల్సిన ప్రదేశానికి ఎంత సేపట్లో వెళ్లగలరో కచ్చితంగా వివరించి చెప్పే యాప్.. మీరు ఆన్లైన్ లో కొనాలనుకుంటున్న వస్తువుని 360 డిగ్రీల్లో మీకు చుపించే కెమెరా.. మీరు వంటకాల రెసిపీ కోసం వెతికితే మీకు దానిని వీడియోలో చూపించే యాప్.. రెస్టారెంట్ కి వెళ్లి మెనూను మీ స్మార్ట్ ఫోన్కు చూపిస్తే చాలు ఆ మెనూ వివరాలతో పాటు ఆ రెస్టారెంట్లో ఏ పదార్ధం బావుంటుందో మీకు చూపించే వెసులుబాటు.. ఇలా ఎన్నో కొత్త ఆవిష్కరణలను త్వరలో గూగుల్ మనకి అందించబోతోంది. మరి మన జీవితాల్ని మరింత స్మార్ట్ గా మార్చేసుకోవడానికి మనమూ సిద్ధమైపోదామా?

అన్నట్టు మెయిల్ తో పాటు మరికొన్ని సేవల్ని ఆఫ్ లైన్ లో అందించేందుకూ గూగుల్ ఏర్పాట్లు చేస్తోంది. ఇది నిజంగా శుభవార్తే కదా!

Show Full Article
Print Article
Next Story
More Stories