Ganesh Chaturthi 2020: పీపీఈ కిట్లతో వినాయకుని నిమజ్జనం..పోలే..అవిడియా అదిరిపోలె..!

Ganesh Chaturthi 2020: పీపీఈ కిట్లతో వినాయకుని నిమజ్జనం..పోలే..అవిడియా అదిరిపోలె..!
x

Unique Ganesh nimajjanam

Highlights

Ganesh Chaturthi 2020: కరోనా మహమ్మారి అన్ని ఆనందాలనూ దూరం చేసింది. శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు.. వినాయక నిమజ్జనానికి కరోనా కె షాకిస్తూ వాళ్ళెం చేశారో చూడండి!!

రా.. ఇప్పుడెలా వస్తావో మేమూ చూస్తాం. హమ్మా.. మా వినాయకుడి పండగే చేయడానికి లేకుండా చేస్తావా? నీ సంగతి మేం చెబుతాం ఉండు.. అంటూ వారంతా కరోనాకి ఛాలెంజ్ చేశారు. కరోనా మహమ్మారి సందు దొరికితే చాలు వేటు వేసేస్తోంది. దాని దెబ్బకి అబ్బా అనడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి. పండగ అందులోనూ వినాయకచవితి అంటే ఊగిపోయే కుర్రకారు కూడా ఈ సంవత్సరం చప్పుడు చేయకుండా నాలుగు గోడల మధ్యే గణేశా అంటూ పొరలు దండాలు పెట్టేసి సరిపెట్టేశారు. అక్కడక్కడ కొందరు లంబోదరుడి విగ్రహాలు పెట్టినా ఇది ప్రయివేట్.. ఎవరూ రావొద్దు అన్నట్టు చెప్పేశారు. ఇక దేవునికి పూజలు..పునస్కారాలు ఎవరికీ వారు దేవుని గదిలోనే కానిచ్చేశారు.

ఇటువంటి పరిస్థితిలో కొందరు కరోనా అయితే ఏంటి.. దానికి చావు తెలివితేటలూ ఉంటె..మేం మనుషులం కష్టంలోనూ బతకడం తెలిసినోల్లం.. మాదేవుడికి పండగ చేసి తీరతాం..కరోనా కాదు కదా ఎవ్వరూ మమ్మల్ని ఆపలేరు. అంటూ వినాయకునికి ఉత్సవాలు జరిపించారు. ఇక అంగరంగ వైభవంగా జరిగే వినాయకుని వీడుకోలు ఉత్సవం ఎటూ గట్టిగ చేసుకునే వీలు లేని పరిస్థితి. అయినా సరే మా దేవునికి మేం చేసుకునే సంబరానికి కరోనా ఎలా అడ్డువస్తుందో చూస్తామంటూ ఘనంగా జరిపించేశారు. ఎలానో తెలుసా?

ఇలా.. పీపీఈ కిట్లు వేసుకుని గణపతి పప్పా మోరియా అంటూ వినాయకుని నిమజ్జనోత్సవం ఘనంగా చేసేశారు. వట్టిగా దేవుడిని ఊరేగించి నిమజ్జనం చేస్తే మజా ఏముంటుంది? అందుకే నిమజ్జనోత్సవంలో భాగంగా అందరూ కలిసి ఉట్టికొట్టే కార్యక్రమమూ పెట్టుకున్నారు. వాళ్ళంతా పీపీఈ కిట్లతో ఒళ్లంతా కప్పేసుకుని.. ఉట్టి కొట్టేందుకు గెంతులు వేస్తుంటే.. దూరే సందు లేక కరోనా చుప్ చాప్ గా చూస్తూ ఉండిపోయింది. ఇదండీ శతకోటి అడ్డంకులకు అనంతకోటి ఉపాయాలు అంటే..ఇంతకీ ఇది వినాయకుడికి ఇంత ఘనంగా వీడ్కోలు ఎక్కడ పలికారో తెలుసా.. మేడ్చల్ జిల్లా..కీసర మండలం రాంపల్లి గ్రామంలో. యూనిక్ 9 యూనిఫామ్స్ అనే సంస్థ ఉద్యోగుల సందడి ఇది. ప్రతి ఏటా ఇక్కడ వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం పరిపాటి. అయితే, ఈసారి కరోనా దెబ్బకు ఆ అవకాశం కుదరలేదు. దీంతో నిమజ్జనమైనా ఘనంగా చేయాలని భావించారు. అందుకే.. ఇలా పీపీఈ కిట్లతో ఉట్టి సంబరం అనే ఆలోచన చేసినట్టు సంస్థ ప్రతినిధి ఉమా భువనేశ్వరి చెప్పారు.

ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది. మొత్తమ్మీద ఈ వేడుక ఇలా చేసుకోవడం ఊరిలో అందరినీ అలరించింది. ఏ వేడుక వీడియో చూసిన వారందరూ వాటేన్ ఐడియా సర్ జీ.. అంటున్నారు!

Show Full Article
Print Article
Next Story
More Stories