Viral Video : ఇదేం మాయ సామీ.. ఇంజిన్ లేకపోయినా పరుగులు తీస్తున్న ఆల్టో కారు

Viral Video : ఇదేం మాయ సామీ.. ఇంజిన్ లేకపోయినా పరుగులు తీస్తున్న ఆల్టో కారు
x

 Viral Video : ఇదేం మాయ సామీ.. ఇంజిన్ లేకపోయినా పరుగులు తీస్తున్న ఆల్టో కారు

Highlights

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వింత వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి.

Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వింత వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ తాజాగా ఒక మారుతి ఆల్టో 800 కారుకు సంబంధించిన వీడియో చూస్తే మాత్రం మీ కళ్లను మీరే నమ్మలేరు. ఇంజిన్ లేకుండానే కారు రోడ్డుపై పరుగులు తీయడం ఇప్పుడు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

సాధారణంగా ఏ వాహనానికైనా ఇంజిన్ అనేది గుండెకాయ వంటిది. అది లేకపోతే బండి అంగుళం కూడా కదలదు. కానీ, ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. ఒక ఆల్టో 800 కారు రోడ్డుపై వేగంగా వెళ్తోంది. కెమెరా కారు ముందు భాగానికి వెళ్లగా, అక్కడ బోనెట్ కింద ఇంజిన్ ఉండాల్సిన చోట ఖాళీగా ఉంది. అసలు ఇంజిన్ లేకుండా ఈ కారు ఎలా నడుస్తోంది? ఇది ఏదైనా సినిమా మాయా? లేక అద్భుతమా? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరు దీన్ని రీల్ లైఫ్ టార్జాన్ ది వండర్ కార్ తో పోలుస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

చూడ్డానికి ఇది ఏదో వింతలా అనిపించినా, ఈ వీడియోలో ఒక భయంకరమైన నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. కారు రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా దాని బోనెట్ పైకి లేచి డ్రైవర్ ముఖానికి అడ్డంగా నిలిచింది. దీంతో డ్రైవర్‌కు ముందు ఏముందో కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. అతను కిటికీలోంచి బయటకు తల పెట్టి బండిని నడపడం వీడియోలో చూడవచ్చు. ఇలాంటి విన్యాసాలు డ్రైవర్‌కే కాకుండా రోడ్డుపై వెళ్లే మిగతా వాహనదారులకు కూడా ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంది.



ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. "ఇది ఇండియా అంటే.. ఇక్కడ ఏదైనా సాధ్యమే" అని కొందరు జోకులు పేలుస్తుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలను రోడ్లపై చేయడం నేరమని మండిపడుతున్నారు. కారును వెనుక నుంచి ఎవరైనా నెడుతున్నారా? లేదా ఇది ఏదైనా ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ఉపయోగించి చేసిన ప్రయోగమా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా, ఇంజిన్ లేని కారు రోడ్డుపై పరుగెత్తడం మాత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories