Snake Bite: పాము కాటు వేస్తే భయపడవద్దు.. వెంటనే ఈ పని చేసి ప్రాణాలు కాపాడుకోండి..!

Dont Panic If You Are Bitten By A Snake Save Your Life With These First Aid Measures
x

Snake Bite: పాము కాటు వేస్తే భయపడవద్దు.. వెంటనే ఈ పని చేసి ప్రాణాలు కాపాడుకోండి..!(Representative Image)

Highlights

Snake Bite:ఈ భూమిపై సకల జీవరాశులు ఉన్నాయి. అందులో పాములు కూడా ఒక జాతి.

Snake Bite: ఈ భూమిపై సకల జీవరాశులు ఉన్నాయి. అందులో పాములు కూడా ఒక జాతి. వీటివల్ల తరచుగా మానవులకి ప్రమాదం పొంచి ఉంటుంది. వాస్తవానికి పాములు వాటంతట అవి కాటువేయవు. కానీ మనుషుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి కరుస్తాయి. పాము కాటు వల్ల ప్రతి ఏటా చాలామంది మరణిస్తున్నారు. ఈ పరిస్థితిలో పాము కాటుకి గురైనప్పుడు ఏం చేయాలి.. ఎలాంటి పద్దతులని అనుసరించి ప్రాణాలు కాపాడుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

ప్రపంచంలో 3 వేలకు పైగా పాము జాతులు ఉన్నాయి. వీటిలో 10 నుంచి 15 శాతం పాములు మాత్రమే విషపూరితమైనవి. ఇవి మానవులని చంపే శక్తిని కలిగి ఉంటాయి. విషం లేని పాముల కాటు వల్ల కూడా ప్రజలు ప్రాణాలను కోల్పోతారు. ఎందుకంటే భయం వల్ల ఇలా జరుగుతుంది. పాము కాటుకు గురైతే భయం వదిలి చికిత్స గురించి ఆలోచించాలి.

పాము కాటేస్తే ఏమవుతుంది?

పాము కరిచినప్పుడు శరీరంలో వాంతులు, వికారం, కడుపునొప్పి, తల తిరగడం, తలనొప్పి, లో బీపీ, అతిదాహం, జ్వరం మొదలైన మార్పులు జరుగుతాయి. చాలా పాముల విషం చాలా వేగంగా పనిచేస్తుంది. కానీ కొన్ని పాముల విషం 3 నుంచి 4 గంటల్లో ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో సరైన చర్యలు తీసుకోకుంటే ప్రాణాలను పోతాయి. ఈ పద్దతులు పాటించండి.

వెల్లుల్లి తినిపించండి

ఆహారం రుచిని పెంచడానికి వెల్లుల్లిని ఉపయోగిస్తారు. కానీ దీని సహాయంతో పాము విషం ప్రభావాన్ని తగ్గించవచ్చు. వెల్లుల్లిని గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి అందులో తేనె మిక్స్ చేసి తినిపించాలి.

నెయ్యి తినిపించండి

పాము కాటేస్తే ఆ వ్యక్తికి సుమారు 100 గ్రాముల నెయ్యి తినిపించి వాంతి అయ్యేలా చేయాలి. ఇది విషం ప్రభావాన్ని తగ్గిస్తుంది.

నిజమైన చికిత్స

పాము కాటుకు నిజమైన చికిత్స వైద్యునితో మాత్రమే సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి. పైన పేర్కొన్న చర్యలు వైద్యుడు లేనప్పుడు చేయాలి. పాము కరిచినప్పుడు తప్పనిసరిగా దాని ఫోటో తీయాలి. ఎందుకంటే ఫొటోలో ఉన్న పాముని చూసి అది ఏ జాతికి సంబంధించిందో తెలుసుకొని చికిత్స చేయవచ్చు. దీనివల్ల సరైన మందు ఇవ్వడం సులభం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories