ఆ మహిళా ఎంపీల దుస్తులపై గొడవెందుకు?

ఆ మహిళా ఎంపీల దుస్తులపై గొడవెందుకు?
x
Highlights

ప్రపంచంతో పోటీ పడుతున్నాం. క్షణాల్లో లోకంలోని సమాచారాన్ని ఒడిసి పట్టుకున్తున్నాం. కానీ, సంకుచత్వాన్ని వీదలేకపోతున్నాం. మహిళా వివక్షను...

ప్రపంచంతో పోటీ పడుతున్నాం. క్షణాల్లో లోకంలోని సమాచారాన్ని ఒడిసి పట్టుకున్తున్నాం. కానీ, సంకుచత్వాన్ని వీదలేకపోతున్నాం. మహిళా వివక్షను వదిలిపెట్టలేకపోతున్నాం. పల్లెల్లోనూ ఇంటర్నెట్ లో గేములు ఆడుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకుని చుట్టేస్తున్నారు. అయినా స్త్రీ విషయంలో ఇప్పటికీ పస లేని విమర్శలు చేసి.. అజ్ఞానులుగానే ఉంటున్నాం.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి లోక్ సభకు ఇద్దరు సినీ నటీమణులు ఎంపికయ్యారు. వాళ్లు అక్కడ సినిమాల్లో పేరున్న హీరోయిన్ లు. వారి గెలుపు కూడా ఆషామాషీ గెలుపు కాదు. ఏకంగా లక్షల ఓట్ల మెజార్టీ తో గెలిచారు. టీఎంసీ ఎంపీలుగా ఎన్నికైన సినీ నటులు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ లు తొలిసారి పార్లమెంట్ గడప తోక్కబోతున్నారు. ఈ ఆనందంలో వారు పార్లమెంట్ ముందు నిలబడి ఫోటోలు తీసుకున్నారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే సోషల్ మీడియాలో వారిపై విమర్శల బాణాలు వరుసగా వచ్చిపడుతున్నాయి. ఇంతకీ ఎందుకో తెలుసా? వారు వేసుకున్న దుస్తులు సాంప్రదాయబద్ధంగా లేవట. చట్.. ఇదేమన్నా సినిమానా? అటువంటి బట్టలతో పార్లమెంట్ కు వెళ్లి మా పర్వు తీస్తారా అంటూ విరుచుకు పడుతున్నారు.


ఇంతకీ వీరు సినిమా నటులు కదా ఏ బికినీలో వేసుకుని వచ్చేశారేమో.. పాడు.. అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు చక్కగా ఆ సమయంలో వాళ్లు జీన్స్, టీ షర్టులు వేసుకుని వున్నారు. అయినా ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారో మాకు అర్థం కాలేదంటున్నారు వారిద్దరూ.

''వీళ్లంతా మేం వేసుకున్న బట్టల్ని చూసి చాలా బాధపడిపోతున్నారు. కానీ క్రిమినల్ కేసులు, అవినీతి మరకలు ఉండి పవిత్రమైన వ్యక్తుల్లాగా దుస్తులు ధరించే పార్లమెంటు సభ్యుల్ని మాత్రం వీళ్లు పట్టించుకోరు'' అని బీబీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిమీ చక్రవర్తి ఘాటుగా స్పందించారు. ఇక నుస్రత్ జహాన్ అయితే, ''నా బట్టలు కాదు ముఖ్యం. నేను పోటీ చేసినప్పుడు ఇలాగే విమర్శలు చేశారు. వారికి నా గెలుపుతోనే సరైన సమాధానం ఇచ్చాను. అలాగే, ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారికి కూడా నా పనితోనే సమాధానం ఇస్తాను. ఇది చాలా కష్టమైన పోరు, కానీ.. నేను దీనికి సిద్ధపడే వచ్చాను'' అంటూ చెప్పుకొచ్చారు.

వారలా అనటం లో తప్పేమీలేదు. ఎక్కడన్నా సరే పురుషులు వేసుకునే దుస్తుల పట్ల ఎటువంటి మాటా మాట్లాడరు, కానీ మహిళల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తుంటారు. నిజానికి పార్లమెంట్ కు ఇలాంటి డ్రస్సు మాత్రమే వేసుకురావాలనే నిబంధన ఏమీ లేదు. ఇంకో విషయం ఏమిటంటే వీరివురూ పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళలేదు. కేవలం పార్లమెంట్ ముందు నిలబడి ఫోటోలు తీసుకున్నారంతే.

ఏది ఏమైనా మహిళల డ్రస్సుల విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం సరైనది కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

''మార్పును స్వీకరించేందుకు ప్రజలకు కొంత సమయం పడుతుంది. యవ్వనంలో ఉన్న ఒక పురుష ఎంపీ జీన్స్, టీ షర్టు ధరిస్తే ఎవ్వరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ, మహిళలు అదే పని చేస్తే మాత్రం వాళ్లకు సమస్య'' అని మిమి చక్రవర్తి అన్న మాటలు ఆలోచించ తగినవే.. ఏమంటారు?

Show Full Article
Print Article
Next Story
More Stories