Viral Video: ఈ ఆవు విశ్వాసానికి మారు పేరు.. హార్ట్ ట‌చింగ్ వీడియో

Viral Video: ఈ ఆవు విశ్వాసానికి మారు పేరు.. హార్ట్ ట‌చింగ్ వీడియో
x

Viral Video: ఈ ఆవు విశ్వాసానికి మారు పేరు.. హార్ట్ ట‌చింగ్ వీడియో

Highlights

సాధార‌ణంగా విశ్వాసం అన‌గానే అంద‌రికీ ముందుగా గుర్తొచ్చేది కుక్క‌. కానీ తాజాగా ఓ వీడియోలో కుక్కలకంటే ఏమాత్రం తక్కువ కాకుండా ఆవు తన యజమానిపై చూపిన ప్రేమ, విశ్వాసం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

సాధార‌ణంగా విశ్వాసం అన‌గానే అంద‌రికీ ముందుగా గుర్తొచ్చేది కుక్క‌. కానీ తాజాగా ఓ వీడియోలో కుక్కలకంటే ఏమాత్రం తక్కువ కాకుండా ఆవు తన యజమానిపై చూపిన ప్రేమ, విశ్వాసం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఒక వ్యక్తి తన ఆవుతో కలిసి ఓ మైదానంలో ఉన్న సమయంలో, అతడి స్నేహితులు సరదాగా ఓ నటన ప్రదర్శించారు. వారు ఆ యజమానిపై దాడి చేస్తున్నట్టు న‌టించారు. చేతుల్లో కర్రలు పట్టుకుని అతడిని కొడుతున్నట్లు నటించారు. ఇది గమనించిన ఆవు క్షణం ఆలస్యం చేయకుండా జాగిలంలా పరిగెత్తింది. దాడి చేస్తున్న‌ట్లు న‌టిస్తున్న వారిపై దాడి చేసేందుకు దూసుకొచ్చింది.

వారు పారిపోయిన తరువాత, ఆవు తన యజమానిని ఆత్మీయంగా చూస్తూ దగ్గర్లో నిలబడింది. దీనంత‌టినీ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా తెగ వైర‌ల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో 14 లక్షల మందికు పైగా వీక్షించగా, 45 వేల మందికి పైగా లైక్ చేశారు. జంతువులు తమ యజమానులపై చూపే ప్రేమను చూసి నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది కామెంట్లలో, “మనుషుల కన్నా జంతువుల్లో ప్రేమ ఎక్కువగా ఉంటుంది” అంటుండగా, మరికొందరు “ఇంత ప్రేమ ఆవుల్లో కూడా ఉంటుందా?” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories