బాత్రూం సింకులకు 18 లక్షలు!

బాత్రూం సింకులకు 18 లక్షలు!
x
Highlights

మామూలుగా మధ్యతరగతి కుటుంబం ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవాలంటే ఓ పదిహేను ఇరవై లక్షలు అవుతుంది. కానీ, సెలబ్రిటీ తలుచుకుంటే తన ఇంట్లో బాత్రూం...

మామూలుగా మధ్యతరగతి కుటుంబం ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవాలంటే ఓ పదిహేను ఇరవై లక్షలు అవుతుంది. కానీ, సెలబ్రిటీ తలుచుకుంటే తన ఇంట్లో బాత్రూం సైనికులకు 18 లక్షలు ఖర్చు చేస్తుంది. పైగా దానిని గొప్పగా ప్రపంచానికి చూపిస్తుంది. నెట్టింట్లో ఇప్పుడు ఏదైనా ప్రచారానికి తేలికగా దారులు ఉన్నాయి కదా.

సంగతేంటంటే.. రియాలిటీ టీవీ నటి, అమెరికా నటి కిమ్‌ కర్దాషియాన్‌ తన ఇంట్లోని బాత్‌రూం సింకులకు ఏకంగా రూ.18 లక్షలు చెల్లించందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది.

పూర్తి ఆర్కిటెక్ట్‌ డిజైన్స్‌తో కూడిన ఈ బాత్‌రూం బెసిన్స్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఈ టీవీ మొఘల్‌ షేర్‌ చేసిన వీడియోలో.. వాష్‌ బేసిన్స్‌కు బేసిన్స్‌ లేకుండా టాప్స్‌ మాత్రమే ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయని నెటిజన్లు ప్రశ్నలు సంధించడంతో ఆమె ట్యాప్‌లు ఆన్‌ చేసి మరి వాటి పనితీరును చూపించింది. ఈ సింక్‌పై చిన్న చీలక ఉందని, దానిలో నుంచి నీళ్లు వెళ్తాయని, ట్యాప్‌ను ఎంత ప్రెజర్‌తో పెట్టినా నీరు పక్కకు వెళ్లవని, అదే దీని ప్రత్యేకతని చెప్పుకొచ్చింది. తన భర్త, ప్రముఖ రాపర్‌ కన్యే వెస్ట్‌, డిజైనర్‌ ఆక్సెల్‌ వర్‌వోడోర్ట్‌, ఆర్కిటెక్ట్‌ క్లాడియో సిల్వర్పిన్‌లు కలిసి సంయుక్తంగా ఈ సింక్స్‌ను రూపొందించారని పేర్కొంది.

ఆమె తన గొప్ప చూపించింది అనుకుందాం.. దానిని మళ్లీ ఇదెలా.. ఇదేంటి ఇలా అంటూ జనాలు అడగడం.. ఆమె జవాబులివ్వడం.. పిచ్చి పరి పరి విధాలు అంటే ఇదే కదా..


View this post on Instagram

bathroom tour!

A post shared by Kim Kardashian Snapchat 🍑 (@kimkardashiansnap) on


Show Full Article
Print Article
More On
Next Story
More Stories