Cooler Cleaning Tips: కూలర్‌లోని నీటిని ఎన్ని రోజుల తర్వాత మార్చాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Cooler Cleaning Tips
x

Cooler Cleaning Tips: కూలర్‌లోని నీటిని ఎన్ని రోజుల తర్వాత మార్చాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Highlights

Cooler Cleaning Tips: వేసవి కాలంలో ప్రజలు కూలర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉపశమనం పొందుతారు. అయితే, అదే పనిగా కూలర్లను వాడటం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు.

Cooler Cleaning Tips: వేసవి కాలంలో ప్రజలు కూలర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉపశమనం పొందుతారు. అయితే, అదే పనిగా కూలర్లను వాడటం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. దానిని వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.అయితే, కూలర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కూలర్‌లోని నీటిని ఎన్ని రోజుల తర్వాత మార్చాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్ని రోజులకు ఒకసారి నీటిని మార్చాలి?

కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి మార్చాలి. అయితే, మీరు అదే పనిగా కూలర్ వాడుతున్నట్లయితే దాని నీటిని ప్రతిరోజూ మార్చాలి.

నీటిను ఎప్పటికప్పుడు మార్చకపోతే అందులో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయి. దీనివల్ల అలెర్జీలు, శ్వాస సమస్యలు కూడా సంభవించవచ్చు.

కూలర్‌లోని నీటిని చాలా రోజులు మార్చకపోతే, దుర్వాసన ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా, దోమలు అందులో గుడ్లు పెడుతాయి. ఇది డెంగ్యూ, మలేరియా ప్రమాదాన్ని పెంచుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి:

కూలర్ శుభ్రం చేసిన తర్వాత, అందులో యాంటీ బాక్టీరియల్ లిక్విడ్‌ను కలపండి. లేదా మీరు వేప ఆకులు, పటికను ఉపయోగించవచ్చు. గాలి సరైన వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో కూలర్‌ను ఉంచండి. కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల సరైన గాలి ప్రసరణ జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories