Viral Video: డ్రోన్‌ను చూసి బుడ్డోడు పరుగో పరుగు.. వైరల్ అవుతున్న వీడియో

Childrens Ran After Seeing The Drone
x

డ్రోన్‌ను చూసి బుడ్డోడు పరుగో పరుగు.. వైరల్ అవుతున్న వీడియో

Highlights

డ్రోన్‌ను గతంలో వితంగా చూసేవారు. రాను రాను దాని గురించి అందరికీ తెలిసింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వీడియోలు తీయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే టెక్నాలజీ వేగంగా ప్రజలకు అందుబాటులోకి రావడంతో వీటి వాడకం కూడా పెరిగింది.

Viral Video: డ్రోన్‌ను గతంలో వితంగా చూసేవారు. రాను రాను దాని గురించి అందరికీ తెలిసింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వీడియోలు తీయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే టెక్నాలజీ వేగంగా ప్రజలకు అందుబాటులోకి రావడంతో వీటి వాడకం కూడా పెరిగింది. పొలాల్లో మందుల పిచికారితో పాటు పలు రకాల పనుల కోసం డ్రోన్లు వినియోగిస్తున్నారు. అయితే ఓ బుడ్డోడు ఈ డ్రోన్‌ను మొదటి సారి చూశాడేమో తనపైకి దూసుకొస్తుందన్నట్టుగా పరుగు లంకించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాని చూసిన నెటిజన్లు మరో ఉస్సేన్ బోల్ట్ అంటూ ఈ బుడ్డోడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఓ గ్రామంలో ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రోన్ వారి వద్దకు దూసుకువచ్చింది. దీంతో పరుగు మొదలుపెట్టారు. ఇద్దరు పిల్లలు ఒకవైపు పరుగెత్తగా.. మరో పిల్లవాడు భయంతో వేగంగా పరుగుతీశాడు. అయితే ఆ డ్రోన్ ఆపరేటర్ ఆ పిల్లవాడి పరుగును చూసి అతని వెంటే పోనిచ్చాడు. భయంతో పరుగులో వేగం పెంచిన పిల్లాడు.. వెనక్కి తిరిగి చూడకుండా జెట్ స్పీడులో పరుగు తీశాడు. ఈ వీడియోలో పిల్లవాడి ప్రవర్తన నవ్వు తెప్పిస్తున్నప్పటికీ అతడి పరుగులో వేగం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ పిల్లవాడు మరో ఉసేన్ బోల్ట్ అవుతాడు అంటూ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ అతడు భయపడ్డాడు అంటూ పేర్కొన్నాడు. బ్రదర్ అంత వేగంగా పరుగెత్తేది పిల్లాడా లేక జెట్ విమానామా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే అందరూ ఆ పిల్లవాడు పరుగుకు ఫిదా అవుతున్నారు. ఫన్ ఫ్యాక్ట్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియో షేర్ చేశారు. అయితే ఇది పాత వీడియోనే అయినా ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం చెప్పలేదు. పల్లెటూరి పిల్లలు మొదటిసారి డ్రోన్ చూశారు అంటూ రాశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories