Video Viral: పులి భయం కాదు.. అమ్మ భయం.. పాపం బుడ్డోడు.. వీడియో వైరల్

Child Get caught to Tiger Video viral
x

పులి భయం కాదు.. అమ్మ భయం.. పాపం బుడ్డోడు.. వీడియో వైరల్

Highlights

హానికర జంతువులంటే ఎవరికైనా భయమే.. ముఖ్యంగా పులి, సింహాలు కన్పిస్తే చాలు భయంతో వణికిపోతుంటారు. అందుకే జూలో కూడా దూరం నుంచే చూస్తారు.

Video viral: హానికర జంతువులంటే ఎవరికైనా భయమే.. ముఖ్యంగా పులి, సింహాలు కన్పిస్తే చాలు భయంతో వణికిపోతుంటారు. అందుకే జూలో కూడా దూరం నుంచే చూస్తారు. అవి బోనులో ఉన్నా.. సరే వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేయరు. కానీ ఇక్కడ మాత్రం ఓ బుడ్డోడు పులి నోటికి చిక్కినా ఏ మాత్రం భయపడడం లేదు. పెద్ద పులిని చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం అలాంటిది పులి నోటికి చిక్కినా భయపడకపోవడం ఏంటా అని ఆశ్చర్య పోతున్నారా..? అయితే మీరూ ఈ వీడియో చూసేయండి.

ఓ పిల్లోడు కుటుంబంతో కలిసి జూకి వెళ్లాడు. జూ అంతా సరదాగా తిరిగి వచ్చిన ఆ బాబు.. చివరికి పెద్ద పులి ఉన్న బోను వద్ద ఆగాడు. అయితే లోపల ఉన్న పులి ఆ పిల్లోడి టీ షర్ట్ నోటితో పట్టుకుంది. దీంతో ఆ బాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆ బాబు అంత హంగామా చేసింది పులి వల్ల భయంతో కాదు. వాళ్ల అమ్మ తిడుతుందంటూ. సాధారణంగా ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే పులికి భయపడతారు. పులి నుంచి తనను కాపాడండి అంటూ కేకలు వేస్తారు. ఈ పిల్లోడు మాత్రం విచిత్రంగా అమ్మ తిడుతుంది అంటూ పులిని బతిమాలుతున్నాడు.

అసలు అది పెద్ద పులి అనే భయం ఏ మాత్రం లేదు. అది ఏమైనా చేస్తుందనే భయం అసలే లేదు. కానీ టీ షర్ట్ చినిగితే అమ్మ తిడుతుందనే భయమే ఆ బాబులో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే పులిని తన టీ షర్ట్ వదులమంటూ బతిమాలుతూ కేకలు వేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పాపం పిల్లోడికి పెద్ద పులి కంటే అమ్మ భయమే ఎక్కువగా ఉన్నట్టుంది అని కొందరు. పిల్లికి, పులికి పిల్లలు భయపడరు.. తల్లులకే భయపడతారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పులితో ఆ పిల్లోడి వాగ్వాదం ఫన్నీగా ఉంది.



Show Full Article
Print Article
Next Story
More Stories