Vicks Effect: దారుణం.. విక్స్ ముక్కుకు పూయడంతో.. మృతి చెందిన 8 నెలల చిన్నారి

Chennai Tragedy Infant Dies After Vicks and Camphor Applied on Nose Doctors Issue Warning
x

Vicks Effect: దారుణం.. విక్స్ ముక్కుకు పూయడంతో.. మృతి చెందిన 8 నెలల చిన్నారి

Highlights

Vicks Effect: చెన్నైలోని అభిరామపురంలో దారుణం చోటుచేసుకుంది. విక్స్‌ని ముక్కుకు పూయడం వల్ల ఒక 8 నెలల చిన్నారి చనిపోయింది.

Vicks Effect: చెన్నైలోని అభిరామపురంలో దారుణం చోటుచేసుకుంది. విక్స్‌ని ముక్కుకు పూయడం వల్ల ఒక 8 నెలల చిన్నారి చనిపోయింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న చిన్నారికి తల్లిదండ్రులు విక్స్, దాంతో పాటు కర్పూరం రాసారు. అయితే కాసేపటికి చిన్నారికి శ్వాస తీసుకోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత ఆ చిన్నారి చనిపోయింది.

హోమ్ రెమిడీస్ మంచివే. కానీ చిన్నారులకు , పెద్దవాళ్లకు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఇంట్లో ఏదైనా వైద్యం చేస్తున్నప్పుడు డాక్టర్ సలహా తప్పనిసరి. ఈ మధ్యకాలంలో ఏం చేస్తే ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. జలుబు వచ్చిన వారికి విక్స్ రాసుకోవడం అనేది సర్వసాధారణం. అదేవిధంగా కొంతమంది కర్పూరం కూడా పొడి చేసి అద్దుతుంటారు. అయితే ఈ రెండు ఒకేసారి చేయడం వలనో, మరే ఇతర కారణం వల్లనో కానీ.. ఎనిమిది నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. వివరాలు చూద్దాం..

8 నెలల చిన్నారి మరణం చెన్నైలోని అభిరామపురం ప్రాంతంలో కలకలం రేపింది. అభిరామపురంలో రాథాకృష్ణన్ కు ఎనిమిది నెల పాప ఉంది. అయితే ఈ చిన్నారి కొన్ని రోజులు జలుబు, దగ్గుతో బాధపడుతుంది. మందులు వేసినా తగ్గడం లేదని, విక్స్ అలాగే కర్పూరాన్ని కలిపి పాప ముక్కు దగ్గర రాసారు. దీని తర్వాత కొద్ది సేపటికి ఆ చిన్నారికి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటనే ఆ చిన్నారిని ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రి చికిత్స పొందుతున్న కాసేపటికే చిన్నారి చనిపోయింది.

పోలీసులు కేసును నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. అసలు పాప చనిపోడానికి కారణాలేంటన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటి వద్ద ఇలాంటి వైద్యం చేయొద్దని, ఏది చేయాలనుకున్నా డాక్టర్ సలహాతో చేయాలని కొంతమంది డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, పిల్లలకు, పెద్దవాళ్లకు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి వైద్యాలను చేయొద్దని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories