Chanakya Ethics: ఇలా చేస్తే డబ్బుకు లోటే ఉండదు

Chanakya Ethics
x

Chanakya Ethics: ఇలా చేస్తే డబ్బుకు లోటే ఉండదు

Highlights

Chanakya Ethics: ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు. జీవితానికి సంబంధించిన అనేక విధానాలు రూపొందించాడు. అవి నేటి ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

Chanakya Ethics: ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు. జీవితానికి సంబంధించిన అనేక విధానాలు రూపొందించాడు. అవి నేటి ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లి గౌరవ మర్యాదలు పొందాలంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చాణక్య నీతిలో పేర్కొన్నారు. ముఖ్యంగా డబ్బు ఉంటేనే విలువ ఉంటుందని అంటున్నారు. అందుకే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇక కొంత మంది ఎంత సంపాదించినా సరే డబ్బు నిలవడం లేదు అంటూ చాలా బాధపడి పోతుంటారు. అయితే, అలాంటి వారికి ఆచార్య చాణక్యుడు పొదుపుకు సంబంధించిన కొన్ని సూత్రాలను తన చాణక్య నీతిలో ప్రస్తావించారు. వాటిని పాటించిన వారు ఆర్థిక సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండటమే కాకుండా సమాజంలో కూడా ఉన్నతంగా బతుకుతారని అంటున్నారు. ఇంతకీ ఆయన చెప్పిన పొదుపు సూత్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదాయానికి మించిన ఖర్చులు

ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఖర్చులు అనేవి వారి ఆదాయానికి మించి ఉండకూడదు. ఆదాయానికి మించి ఖర్చులు ఉన్న వ్యక్తి ఎప్పుడూ తన జీవితంలో సంతోషంగా ఉండలేరు. అందుకే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. అంతే కాకుండా ఖర్చు విషయంలో అచీ తూచి అడుగు వేయాలంట.

షో ఆఫ్ చేయకండి.

ఇక కొంత మంది గొప్పలకు పోయి డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అయితే, షో ఆఫ్ సంపద అనేది సంపద విలువను నాశనం చేస్తుందని చాణక్యుడు అంటున్నాడు. అందుకే ఇతరుల ముందు గొప్పగా బతకడానికి ఎప్పుడూ డబ్బు ఖర్చు పెట్టకూడదని సూచిస్తున్నాడు. డబ్బు అనేది ఎప్పటికీ అవసరమైనదేనని, దానిని అనవసరంగా ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.

పొదుపుపై అవగాహన

కొంత మంది డబ్బు సంపాదిస్తారు కానీ ఆ డబ్బును ఎలా పొదుపు చేయాలి అనే విషయంపై ఏ మాత్రం అవగాహన ఉండదు. ఇది కూడా ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందని చాణక్యుడు అంటున్నాడు. అందుకే కేవలం సంపాదిస్తే సరిపోదని దాన్ని పొదుపు చేయడం కూడా చాలా ముఖ్యమని చాణక్యుడు అంటున్నాడు. దీని పై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories