Chanakya Ethics: చాణక్య నీతి.. తెలివైన స్త్రీకి ఉండాల్సిన 3 లక్షణాలు ఇవే..

Chanakya Ethics
x

Chanakya Ethics: చాణక్య నీతి.. తెలివైన స్త్రీకి ఉండాల్సిన 3 లక్షణాలు ఇవే

Highlights

Chanakya Ethics: చాణక్యుడి ప్రకారం తెలివైన స్త్రీకి 3 ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ మూడు లక్షణాలు ఒక మహిళలో ఉంటే ఆమె కుటుంబానికి ఆధారంగా, సమాజానికి మార్గదర్శకురాలిగా నిలుస్తుంది.

Chanakya Ethics: చాణక్యుడి ప్రకారం తెలివైన స్త్రీకి 3 ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ మూడు లక్షణాలు ఒక మహిళలో ఉంటే ఆమె కుటుంబానికి ఆధారంగా, సమాజానికి మార్గదర్శకురాలిగా నిలుస్తుంది. ఆమె జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించగలదు. కుటుంబంలో, సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతుంది. చాణక్యుడు చెప్పిన తెలివైన స్త్రీకి ఉండాల్సిన ఆ మూడు ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సహనం

ఒక స్త్రీకి సహనం ఉండటం ఎంతో ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. ఎలాంటి పరిస్థితులైనా ప్రశాంతంగా ఎదుర్కొనగలగే గుణం ఉండాలి. కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే ఓర్పు ఉండాలి. ఇలాంటి స్త్రీకి ఇంట్లోనూ, బయటా అందరి నుంచి గౌరవం లభిస్తుంది.

మాట్లాడే నైపుణ్యం

స్త్రీకి మంచిగా మాట్లాడే నైపుణ్యం ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. సున్నితంగా మాట్లాడగలగడం ఒక గొప్ప కళ. చాణక్యుని అభిప్రాయం ప్రకారం, ఒక మహిళ తన మాటల్ని అదుపులో ఉంచుకుని, ఎవరి మనసునీ గాయపర్చకుండా మాట్లాడగలగాలి. కోపంలోనూ సున్నితంగా స్పందించగల స్త్రీ ఇంట్లో శాంతి చేకూర్చుతుంది.

జ్ఞానం

ఒక తెలివైన స్త్రీకు పాఠశాలల విద్య మాత్రమే కాకుండా, జీవితాన్ని అర్థం చేసుకునే బుద్ధి ఉండాలి. ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఆచితూచి ఆలోచించగలగాలి. ఆమె నిర్ణయాలు కుటుంబానికి మేలు చేకూర్చాలి. ఇలాంటి జ్ఞానంతో ఆమెకు సమాజంలో గౌరవం, అభినందనలు తప్పక లభిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories