ఓటు మన బాధ్యత.. కొన్ని దేశాల్లో ఓటు వేయకపోవడం తీవ్ర నేరం..ఎక్కడో తెలుసా?

ఓటు మన బాధ్యత.. కొన్ని దేశాల్లో ఓటు వేయకపోవడం తీవ్ర నేరం..ఎక్కడో తెలుసా?
x
Highlights

ఓటు వేయడం నా యిష్టం.. నేను వేస్తె వేస్తాను.. లేకపోతె లేదు అనుకునే వారికి కొన్ని దేశాల్లో చాలా కఠిన శిక్షలు ఉన్నాయి.. ఆదేశాలు ఏమిటో తెలుసా?

ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత. మన తల రాతల్ని మార్చేసే నాయకుల రాతలను ఒక్క సిరా చుక్కతో.. వేలికోనలతో మార్చేసే అవకాశం ఓటుతో వస్తుంది. చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి శ్రద్ధ చూపించరు. ఇది మన దేశంలో చాలా ఎక్కువ. ఎప్పుడూ 60 శాతం కంటె ఎక్కువ ఓట్లు నమోదు కావడం జరగదు. ఇక ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయడానికి బద్ధకంగా కదులుతున్న సూచనలు కనపడుతున్నాయి. మొదటి రెండు గంటల్లోనూ కేవలం మూడు శాతం మాత్రమె ఓటింగ్ జరిగింది. అదేవిధంగా జీ హెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎప్పుడూ 50 శాతానికి కొద్దిగా అటూ ఇటూ గా మాత్రమె పోలింగ్ జరుగుతూ వస్తోంది. నగరజీవులు ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోవడం.. ఓటింగ్ రోజు ఒక శెలవు రోజనే భ్రమలో ఉండిపోవడంతో ఇలా జరుగుతుంది. అందరూ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మన దేశంలో ఓటు హక్కు మన ఇష్టం అన్నట్టు ఉంది కానీ, కొన్ని దేశాల్లో ఓటు కచ్చితంగా వేయాల్సిందే. ఒకవేళ ఓటు వేయకపోతే సదరు ఓటరు విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాయి అక్కడి చట్టాలు. సరైన కారణం లేకుండా ఓటు వేయడానికి గైర్హాజరు అయితే కొన్ని దేశాలు ఎం చేస్తాయో తెలుసా?

* బెల్జియంలో ఓటు వేయకపోతే కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది. అంతే కాదు ఒకవేళ నాలుగేళ్ళు వరుసగా ఓటు వేయకపోతే ఇక పదేళ్ళ పాటు ఓటు హక్కు పూర్తిగా రద్దుచేస్తారు. ఓటు వేయని వారు ప్రభుత్వ ఉద్యోగార్హత కోల్పోతారు.

* అర్జెంటీనాలో ఓటు వేయనివారికి భిన్నమైన శిక్ష ఉంటుంది. ఓటు వేయనివారికి ఏడాది పాటు ప్రభుత్వ పథకాలు కట్ అయిపోతాయి.

* పెరూలో ఓటు వేయనివారికి సరికొత్త శిక్ష ఉంటుంది. వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.

* గ్రీస్ ఈజిప్ట్ దేశాల్లో ఓటు వేయకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్టులో సరైన కారణం చెబితే వదిలేస్తారు. అయితే ఎలాంటి కారణం లేకుండా ఓటు వేయకపోతే మాత్రం జైలు శిక్ష తప్పదు.

* బ్రెజిల్‌లో ఓటు వేయకపోతే జరిమానా విధిస్తారు.

* బొలీవియాలో ఓటు వేయని వారికి జీతాలు కూడా ఇవ్వరు.

* ఆస్ట్రేలియాలో ఓటు వేయకపోతే.. అందుకు తగ్గ కారణం చూపించాల్సి ఉంటుంది.

ఇలా చాలా దేశాల్లో ఓటు వేయని వారిపట్ల కఠినంగా వ్యవహరించే చట్టాలు ఉన్నాయి. మన దేశంలో ఉన్న స్వేచ్చ ఎక్కడా లేదు. ఆ స్వేచ్చను చక్కగా ఉపయోగించుకుని.. ఓటు వేయడం అందరి బాధ్యత. రాజకీయనాయకులు చేసే ఓటు వేయనివాడికి అడిగే హక్కు లేదు అనే ప్రసంగాలకు చెక్ పెట్టాలంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories