సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ చాలెంజ్‌

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ చాలెంజ్‌
x
Highlights

సోష‌ల్ మీడియాలో ఓ ఛాలెంజ్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. గతంలతో ఎన్నో ఛాలెంజ్‌లు చూసిన జనం ఇప్పుడు సరికొత్తగా ట్రెండ్‌ అవుతున్న ఛాలెంజ్‌ని అంతే కొత్తగా...

సోష‌ల్ మీడియాలో ఓ ఛాలెంజ్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. గతంలతో ఎన్నో ఛాలెంజ్‌లు చూసిన జనం ఇప్పుడు సరికొత్తగా ట్రెండ్‌ అవుతున్న ఛాలెంజ్‌ని అంతే కొత్తగా చూస్తున్నారు. కాదు... కాదు... దాన్ని ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు కూడా. అదే బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌. ఇంతకుముందు రైస్ బ‌కెట్ చాలెంజ్‌, ఐస్ బ‌కెట్ చాలెంజ్‌, కికి వీడియో చాలెంజ్‌ ఇలా ఎంతో మంది ఎన్నో ర‌కాల చాలెంజ్‌ల‌ను ఎదుర్కొన్న జనం బాటిల్ క్యాప్ చాలెంజ్‌‌పై క్రేజ్‌ పెంచేసుకుంటున్నారు. ఇంత‌కీ అస‌లు ఈ బాటిల్ క్యాప్ చాలెంజ్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది?

ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సమయంలో ఒక్కో ఛాలెంజ్‌ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇప్పుడు బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ హవా నడుస్తోంది. బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌కుమార్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో అభిమానులంతా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే, ఇప్పుడు మన మధ్యన లేని హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో బ్రూస్‌లీ ఇప్పుడు కాదు ఎప్పుడో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. అదీ కాలితోనో లేదా చేతితోనో కాదండోయ్‌ ఏకంగా నాన్‌చాక్‌తో! దాన్ని తిప్పుతూ మూడు బాటిళ్ల మూతలను తీసేశాడు.

బాటిల్ మీద ఒక మూతను వదులుగా పెట్టాలి. దానిని తీయటానికి మీ చేయి కానీ, పాదం కానీ కావాలి. మీరు ఆ పనిచేస్తున్నపుడు రికార్డు చేయటానికి ఒక ఫోన్ కావాలి. రౌండ్‌హౌస్ అనే మార్షల్ ఆర్ట్ కిక్‌ను ఉపయోగించి బాటిల్ మీద మూతను ఒక్క కిక్‌తో విప్పేయటం ఈ చాలెంజ్ లక్ష్యం. ఇది చాలా ఈజీగా కనిపించొచ్చు. కానీ ఈ పని చేయాలంటే చాలా స్కిల్ అవసరం మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories