స్టార్ హీరోయిన్స్ వల్లే కాలేదు..! ఓ దీవినే సొంతం చేసుకున్న ఈ భామ ఎవరో తెలుసా?

స్టార్ హీరోయిన్స్ వల్లే కాలేదు..! ఓ దీవినే సొంతం చేసుకున్న ఈ భామ ఎవరో తెలుసా?
x

స్టార్ హీరోయిన్స్ వల్లే కాలేదు..! ఓ దీవినే సొంతం చేసుకున్న ఈ భామ ఎవరో తెలుసా?

Highlights

హీరోయిన్స్ ఇప్పుడు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ కోట్లలో సంపాదిస్తున్నారు. సినిమాలతో పాటు ప్రకటనలు, వ్యాపారాలు కూడా భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ సంపాదనతో ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనడం సాధారణం. కానీ ఓ అందాల భామ మాత్రం అంతకుమించిన కల సాకారం చేసుకుంది – ఏకంగా ఓ దీవినే కొనుగోలు చేసింది.

అది కూడా దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్, కత్రినా, ఆలియా లేదా ప్రియాంక చోప్రా కాదు. ఆమె ఎవరో తెలుసా? జాక్వెలిన్ ఫెర్నాండెజ్! శ్రీలంకలో జన్మించిన ఈ బాలీవుడ్ నటి, 2012లో దక్షిణ శ్రీలంక తీరంలో రూ.3.5 కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్‌ను సొంతం చేసుకుంది. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవి, శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ కుమార సంగక్కర ప్రైవేట్ దీవికి సమీపంలో ఉంది. ఇక్కడ విల్లా నిర్మించుకోవాలనే ఆలోచన జాక్వెలిన్‌కి ఉందని సమాచారం.

ముంబైలో జాక్వెలిన్‌కు 5 బిహెచ్‌కె లగ్జరీ అపార్ట్‌మెంట్ కూడా ఉంది. 2009లో "అల్లాదీన్" సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, హౌస్‌ఫుల్, మర్డర్ 2, కిక్, రేస్ 2 వంటి 30కి పైగా చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా నిలిచింది.

ఇంతటి విలాసవంతమైన జీవనశైలి జాక్వెలిన్‌ను బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన హీరోయిన్లలో ఒకరిగా నిలబెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories