Black leapord: తమిళనాడులో జంగల్ బుక్‌లోని ‘భగీరా’లాంటి అరుదైన నల్లచిరుత..

Black leapord: తమిళనాడులో జంగల్ బుక్‌లోని ‘భగీరా’లాంటి అరుదైన నల్లచిరుత..
x

Black leapord: తమిళనాడులో జంగల్ బుక్‌లోని ‘భగీరా’లాంటి అరుదైన నల్లచిరుత..

Highlights

చాలామంది జంగల్ బుక్ చూసే ఉంటారు కదా. అందులో మోగ్లీ ఎక్కువగా పిలిచే పేరు భగీరా. ఇదొక నల్ల చిరుత. కానీ మోగ్లీకి అన్ని విద్యలు నేర్పిస్తూ.. నిత్యం కాపాలగా ఉంటుంది. అచ్చం ఈ బగీరాలాంటి నల్లచిరుత తాజాగా తమిళనాడులో ప్రత్యక్షమైంది. ఇంకేంముందు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని నీలగిరి కొండల్లో రోడ్లపైకి అరుదైన నల్లని చిరుత పులి తన స్నేహితులతో కలిసి దర్జాగా తిరుగుతుంది. రెండు సాధారణ చిరుతుపులులతో పాటు ఈ బగీరా కూడా చక్కగా కలిసి తిరుగుతున్నాడు. చూస్తుంటే ఏదో నల్ల చిరుతకు రెండు సాధారణ చిరుతలు బాడీ గార్డులుగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన నల్ల చిరుత కనిపించడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇదిలాఉంటే నల్ల చిరుతలు సాధారణ చిరుతలతో కలవవని వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. వీటిమధ్య తీవ్రమైన వైరం ఉంటుందట. కనిపించాయంటే చాలు తీవ్రంగా కొట్టుకుంటాయంట. అటువంటి రోడ్డుపైన ఇంత తాపీగా సాధారణ చిరుతలతో ఈ నల్ల చిరుత ఎలా తిరుగుతుందబ్బా.. అంటూ వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోని చూసిన చిన్నారులైతే అదిగో.. భగీరా వచ్చేసింది.. అంటూ తెగ సంబరపడిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories