ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సెలబ్రిటీలు!

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సెలబ్రిటీలు!
x
Highlights

ఈరోజు మే 27 తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు. వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో వారి గురించి పరిచయం..

పుట్టినరోజు అందరికీ ప్రత్యేకమినదే. అయితే, వివిధ రంగాల్లో ప్రతిభతో పైకొచ్చి.. ఎందరినో తమ అభిమానులుగా మార్చుకున్న వారి పుట్టినరోజు వారికే కాదు.. వారిని అభిమానించే వారందరికీ పండగరోజే. అందుకే.. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖుల విశేషాలు మీకోసం సంక్షిప్తంగా..

భారత జట్టు దిగ్గజ క్రికెటర్ టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి జన్మదినం కూడా నేడే..

రవిశాస్త్రి 1962 మే 27వ తేదీన ముంబైలో జన్మించారు . కుడి చేతి వాటం బ్యాట్స్మన్ ఎడమచేతితో స్పిన్ బౌలింగ్ వేయగల ఆల్ రౌండర్ రవి శాస్త్రి. భారత జట్టు తరఫున ఎన్నో సంవత్సరాల పాటు తన ఆటతో సేవలందించారు. ఆల్ రౌండర్ గా ఏకంగా 18 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన 12 సంవత్సరాల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు రవిశాస్త్రి . కెరీర్ ప్రారంభంలో కేవలం బౌలర్ గానే క్రీడాజీవితం ప్రారంభించినా రావిశాస్త్రి ఆ తర్వాత బ్యాట్స్ మెన్ గా.. క్రమ క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. 19v85లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ క్రికెట్ లో తన క్రీడా జీవితంలోనే అత్యంత ప్రతిభను కనబరిచారు... చాంపియన్ గా ఎన్నికయ్యారు. అదే సీజన్ లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి... ఇలా ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు రావిశాస్త్రి. ఇక దేశవాళీ క్రికెట్లో కూడా ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించాడు రావిశాస్త్రి. ఇక ప్రస్తుతం టీమిండియా జట్టు ప్రధాన కోచ్గా కొనసాగుతున్నారు రవిశాస్త్రి. రవిశాస్త్రి కోచింగ్ లో టీమిండియా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

అంకిత పుట్టినరోజు :

రస్నా బేబీ గా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు పొందిన సినీ కథానాయిక అంకిత. ఈమె 1982 మే 27వ జన్మించారు. చిన్నతనంలో రస్నా లాంటి ఉత్పత్తులు ప్రకటనలలో నటించిన అంకిత ఎంతగానో గుర్తింపు సంపాదించాడు. ఇక కథానాయికగా ఈమె మొదటి చిత్రం వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో. ఆ తర్వాత సింహాద్రి వంటి పలు విజయవంతమైన సినిమాల్లో కూడా నటించింది. ఇక ఆ తర్వాత కొత్త కథానాయకల నుంచి పోటీ పెరగడంతో.... చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది అంకితం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories