Savings Schemes for Women: మహిళల కోసం ప్రత్యేకమైన ఈ స్కీమ్స్‌ గురించి మీకు తెలుసా..?

Savings Schemes for Women
x

Savings Schemes for Women: మహిళల కోసం ప్రత్యేకమైన ఈ స్కీమ్స్‌ గురించి మీకు తెలుసా..?

Highlights

Best Savings Schemes for Women: మహిళలు ఆర్థికంగా ఎదగడానికి భారత ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి, PPF, NSC వంటి ఉత్తమ పొదుపు పథకాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Best Savings Schemes for Women: ఒకప్పుడు మహిళలు పొదుపు అంటే ఇంట్లో పోపుల డబ్బాలో దాచుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. రూపాయిని రూపాయి చేసే మార్గాలపై అవగాహన పెరిగింది. భారత ప్రభుత్వం మరియు బ్యాంకులు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా, మహిళలు తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని ఉత్తమ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం.

సురక్షితమైన లాభం.. బ్యాంక్ ఎఫ్‌డీలు

చాలా బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను నడుపుతున్నాయి. సాధారణ డిపాజిట్ల కంటే వీరికి 0.25 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లయితే మరో 0.50 శాతం అదనపు లాభం పొందవచ్చు. రిస్క్ లేకుండా డబ్బు దాచుకోవాలనుకునే వారికి ఇది ప్రాథమిక మార్గం.

కుమార్తెల భవిష్యత్తుకు సుకన్య సమృద్ధి

మీ ఇంట్లో 10 ఏళ్లలోపు ఆడపిల్ల ఉంటే, ఆమె చదువు, వివాహం కోసం సుకన్య సమృద్ధి యోజన కంటే మించిన పథకం లేదు. ప్రస్తుతం దీనిపై 8.2 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఇది దాదాపు అన్ని ప్రభుత్వ పథకాల కంటే ఎక్కువ. ఇందులో చేసే పెట్టుబడికి పన్ను మినహాయింపు ఉండటం మరో విశేషం.

పన్ను ఆదా & భద్రత

దీర్ఘకాలిక పెట్టుబడి కోరుకునే వారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ , పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉత్తమ ఎంపికలు. NSC ద్వారా 7.7 శాతం వడ్డీ పొందవచ్చు. అలాగే PPFలో పెట్టుబడి పెడితే 15 ఏళ్ల తర్వాత భారీ మొత్తాన్ని అందుకోవచ్చు. వీటి ద్వారా సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

ఆధునిక మహిళకు ఆధునిక పెట్టుబడి

బంగారం అంటే మహిళలకు ప్రాణం. అయితే ఇప్పుడు నగలు కొనే పాత పద్ధతికి బదులుగా సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) లేదా డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో తరుగుదల (Melting charges) ఉండదు, పైగా భద్రత ఎక్కువ. ఇక మార్కెట్ లాభాలను అందుకోవాలనుకునే వారు మ్యూచువల్ ఫండ్ SIPల ద్వారా ప్రతి నెలా చిన్న మొత్తంతో ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద సంపదను సృష్టించవచ్చు.

రిటైర్మెంట్ ప్లానింగ్

వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) సరైన మార్గం. ఇది పదవీ విరమణ తర్వాత క్రమబద్ధమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, పెట్టుబడి సమయంలో పన్ను రాయితీలను కూడా ఇస్తుంది. డబ్బును పొదుపు చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం మరొక ఎత్తు. పైన పేర్కొన్న పథకాల్లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని, నేటి నుండే మీ ఆర్థిక స్వతంత్రత వైపు ప్రయాణాన్ని ప్రారంభించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories