Bangkok Pilla: యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న బ్యాంకాక్ పిల్ల

Bangkok Pilla Earning Income On Youtube
x

Bangkok Pilla: యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న బ్యాంకాక్ పిల్ల 

Highlights

Bangkok Pilla: అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే క్రియేటివిటీ ఉండి, అందరినీ ఆకట్టుకునే నైపుణ్యం ఉండాలేగానీ యూ ట్యూబ్ లో ఊహించని డబ్బు సంపాదించవచ్చు.

Bangkok Pilla: డబ్బు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు..అందుకు చాలా కష్టపడాలి..ఎంతో శ్రమించాలి...బాగా చదువుకొని ఉండాలి..తెలివితేటలు ఉండాలి..పెద్ద ఉద్యోగాలు చేయాలి..విదేశాలకు వెళ్లాలి..అప్పుడే డబ్బు సంపాదించగలం..ఇది చాలామందిలో ఉన్న అభిప్రాయం..అయితే ఇది నిన్నటి మాట..ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది..డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు..కాస్త టాలెంట్, కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు..డబ్బు దానంతట అదే వస్తుంది. యూట్యూబ్ పుణ్యమా అని కొందరు తమ టాలెంట్, క్రియేటివిటీతో రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు.

అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే క్రియేటివిటీ ఉండి, అందరినీ ఆకట్టుకునే నైపుణ్యం ఉండాలేగానీ యూ ట్యూబ్ లో ఊహించని డబ్బు సంపాదించవచ్చు. కొంతమంది వీటిని నిజం చేసి చూపిస్తున్నారు కూడా. అలాంటి కొంతమంది వ్యక్తుల్లో ఒకరు శ్రావణి సామంతపూడి. అందరికీ బ్యాంకాక్ పిల్లగా సుపరిచితం..భర్త ఉద్యోగరీత్యా థాయ్ లాండ్ కు వెళ్లారు. శ్రావణి డిపెండెంట్ వీసా మీద థాయ్ లాండ్ కి వెళ్లడంతో..అమె అక్కడ ఉద్యోగం చేయడానికి వీలు లేదు. దీంతో రోజు మొత్తంలో చాలా ఖాళీ సమయం దొరికేది. ఈ సమయంలో పిల్లలతో గడిపే ప్రతి సందర్భాన్నీ వీడియో తీయడం ప్రారంభించారు. వీడియోలు, ఎడిటింగ్ అంటే అభిరుచి ఉండడంతో శ్రావణి దృష్టి యూ ట్యూబ్ ఛానల్ పై పడింది.

శ్రావణి మొదట్లో తన పాప వీడియోలు, తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్ అంటూ వరుసగా నాలుగు ఛానళ్లు ప్రారంభించారు. కానీ సబ్ స్క్రైబర్లు, వ్యూస్ పెరగకపోవడంతో ఆమె ఆలోచనలో పడిపోయింది. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఇప్పుడు మనందరికీ తెలిసిన బ్యాంకాక్ పిల్ల. థాయ్ లాండ్ లో తన అనుభవాలు, ఆ దేశంలో తన కళ్లకు కనిపించిన చిత్రవిచిత్ర అనుభూతులు, విదేశంలో భారతీయుల జీవనశైలి..ఇలా అన్నింటినీ వీడియోల్లో చూపించడం ప్రారంభించారు. ఆటోల గురించి చేసిన షార్ట్ వీడియో వన్ మిలియన్ కి చేరుకోవడంతో ఆమెకు బోల్డంత ప్రచారం లభించింది. అలా 2022 ఆగస్ట్ లో ప్రారంభించిన బ్యాంకాక్ పిల్ల ఛానల్ ఏడాది తిరగకుండానే సబ్ స్క్రైబర్ల సంఖ్య 8లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఛానల్ కు 18లక్షల70వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

బ్యాంకాక్ పిల్ల వీడియోలకు మినియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఛానల్ ప్రారంభించిన రెండో నెలలోనే బ్యాంకాక్ పిల్ల దాదాపు 2వేల డాలర్లకు పైగా సంపాదించారు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 2 లక్షలు. శ్రావణి వ్లాగ్స్ చేస్తూ నెలకు రూ. 2లక్షలు సంపాదిస్తున్నారంటే నిజంగానే అభినందించదగ్గ విషయం..ఇది రెండవ నెల సంపాదన మాత్రమే..ప్రతి నెల ఆమె సంపాదన ఊహించని రీతిలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె సంపాదన నెలకు రూ.10 లక్షల వరకు ఉంది. మొత్తంగా కొద్దిపాటి కష్టం అంతకుమించి క్రియేటివిటీతో యూట్యూబ్ ద్వారా బ్యాంకాక్ పిల్ల రెండు చేతులా సంపాదిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ యూ ట్యూబ్ చానెల్ ప్రారంభించండి..మీలోని ప్రతిభను ప్రపంచానికి చూపండి..డబ్బు సంపాదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories