
Automatic Roti Maker: మీ ఇంట్లో ఎప్పుడైనా రోటీలు చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అనే మాటను ఎప్పుడైనా విన్నారా. కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీ అర్థాంగి, లేదంటే మీ అమ్మగారు, మీ సోదరీ, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో బాబోయ్ రోటీలు చేయాలంటే పెద్ద టాస్క్ రా బాబు అని అనడం వినే ఉంటారు.
Automatic Roti Maker: మీ ఇంట్లో ఎప్పుడైనా రోటీలు చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అనే మాటను ఎప్పుడైనా విన్నారా. కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీ అర్థాంగి, లేదంటే మీ అమ్మగారు, మీ సోదరీ, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో బాబోయ్ రోటీలు చేయాలంటే పెద్ద టాస్క్ రా బాబు అని అనడం వినే ఉంటారు. ఎందుకంటే పిండి కలపడం దగ్గర నుంచి, రుద్దడం, కాల్చడం వరకు ఎంతో సమయం, ఓపిక కావాలి ఈ పనికి. ఈ కష్టాలను తీరుస్తూ మార్కెట్లోకి ప్రముఖ కంపెనీ 'వండర్‌చెఫ్' (Wonderchef) సరికొత్త 'రోటీ-మ్యాజిక్' మెషిన్‌ను మార్కెట్‌లో పరిచయం చేసింది. ఇది కేవలం రోటీలు చేయడమే కాదు, పిండి కలపడం నుంచి కాల్చడం వరకు అన్నీ తానై చూసుకుంటుంది. ఈ స్టోరీలో ఆటోమేటిక్ రోటీ మేకర్ ధర ఎంత, దాని ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుసుకుందాం.
ఈ రోటీ మేకర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మీరు పిండిని కలిపి ఉండలు చేయాల్సిన పని లేదు. మెషిన్ పైన ఉండే ప్రత్యేక బాక్సుల్లో పొడి పిండి, నీరు, కొద్దిగా నూనె పోస్తే చాలు. లోపల ఉన్న అత్యాధునిక సెన్సార్లు, రోలర్లు పిండిని సరైన పరిమాణంలో కలిపి, గుండ్రని రోటీలను తయారు చేసి, దోరగా కాల్చి బయటకు పంపిస్తాయి. ఈ యంత్రంలో అత్యాధునిక టచ్ ప్యానెల్ ఉంటుంది. దీని ద్వారా మీకు రోటీ ఎలా కావాలో సెట్ చేసుకోవచ్చు. ఇందులో సన్నని, మీడియం లేదా మందపాటి రోటీలను తయారు చేసుకోడానికి ఎంపిక చేసుకోవచ్చు. ఈ యంత్రంలో మీకు కావలసిన సైజులో రోటీలను సెట్ చేసే సదుపాయం కూడా ఉంది. దీంతో తక్కువ టైంలోనే ఎక్కువ రోటీలను రెడీ చేసుకోవచ్చు.
పరిశుభ్రత విషయంలో ఈ మెషిన్ అగ్రస్థానంలో ఉంటుంది. మనుషుల చేతులు తగలకుండానే రోటీలు సిద్ధమవుతాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా భయం ఉండదు. ఇది 1900 వాట్ల విద్యుత్ సామర్థ్యంతో పనిచేస్తుంది. కేవలం ఇళ్లకే కాకుండా చిన్న చిన్న రెస్టారెంట్లు, హాస్టళ్లకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ధర విషయానికి వస్తే..
అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న ఈ వండర్‌చెఫ్ రోటీ-మ్యాజిక్ ధర రూ.59,990 గా ఉంది. దీనికి కంపెనీ వారంటీ కూడా అందిస్తోంది. ప్రారంభంలో ధర కొంచెం ఎక్కువ అనిపించినా, ఇది ఇచ్చే సౌలభ్యం, సమయాన్ని ఆదా చేసే విధానం చూస్తే ఇది ఒక గొప్ప పెట్టుబడి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గంటల తరబడి కిచెన్‌లో నుంచునే పని లేకుండా, స్మార్ట్‌గా వంట పని పూర్తి చేయాలనుకునే వారికి ఈ రోటీ మేకర్ ఒక అద్భుత వరం. ఇక నుంచి ఈ రోటీ మేకర్ మీ ఇంట్లో ఉంటే పండగలు వచ్చినా, అతిథులు వచ్చినా రోటీల తయారీలో కంగారు పడాల్సిన అవసరమే లేదు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




