సీఎం, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శేఖర్ చౌదరి అరెస్ట్

సీఎం, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శేఖర్ చౌదరి అరెస్ట్
x
Highlights

ఇటీవల వచ్చిన వరద సహాయకచర్యల్లో ప్రభుత్వం విఫలమైందని.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ కులంపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని...

ఇటీవల వచ్చిన వరద సహాయకచర్యల్లో ప్రభుత్వం విఫలమైందని.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ కులంపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడు. శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంగా గుర్తించారు పోలీసులు. వరద సమయంలో రైతు వేషం కట్టిన జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి.. సీఎం, మంత్రులపై దారుణంగా విమర్శలు చేశాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories