Viral Video: దోమలను చంపే ఐరన్ డోమ్.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు బాగా ఎక్కువుతున్నాయి. దీంతో డెంగీ, మలేరియా వంటి కేసులు ఎక్కువుతున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఆనంద్ మహీంద్ర పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికగా నిత్యం ఆసక్తికరమైన విషయాల గురించి పంచుకుంటారు ఆనంద్ మహీంద్ర. ఎవరికీ తెలియని, అబ్బుర పరిచే వీడియోలను షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు బాగా ఎక్కువుతున్నాయి. దీంతో డెంగీ, మలేరియా వంటి కేసులు ఎక్కువుతున్నాయి. దీంతో మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటివల్ల దోమల అంతం ఏమో కానీ కొన్ని రకాల శ్వాస సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా చాలా మంది దోమల బ్యాట్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటివి ఏం లేకుండా దోమలను చంపే ఓ పరికారన్ని రూపొందించారు. ఓ చైనీస్ ఇంజనీర్ డెవలప్ చేసిన ఈ మిషన్‌కు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్ర ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఐరన్ డోమ్‌గా పిలుకునే ఈ పరికరాన్ని చైనాకు చెందిన ఇంజీర్ అభివృద్ధి చేశారు. గత కొన్ని నెలలుగా దీని వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. 'ముంబయిలో డెంగీ కేసులు పెరుగుతున్న వేళ.. ఈ క్యానన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. చైనీస్ వ్యక్తి తయారు చేసిన ఈ పరికరం దోమలను వెతికి పట్టుకుని చంపేస్తుంది. మీ ఇంటికి ఐరన్‌డోమ్ లాంటిది’’ అని క్యాప్షన్‌ను రాసుకొచ్చారు.
ఈ పరికం అచ్చంగా యాంటీ-మిసైజ్ డిఫెన్స్ సిస్టమ్‌ను పోలి ఉంది. ఇందులో రాడార్ వ్యవస్థను అమర్చారు. ఇది చుట్టుపక్కల ఉన్న దోమలను గుర్తించి, లేజర్ పాయింటర్ దోమలను చంపేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిజంగా ఇలాంటి ఓ మిషన్ అందుబాటులోకి వస్తే భలే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మిషన్ దోమలను ఎగలా గుర్తు పడుతుందని నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
With dengue on the rise in Mumbai, I’m trying to figure out how to acquire this miniature cannon, invented by a Chinese man, which can seek out & destroy mosquitoes!
— anand mahindra (@anandmahindra) August 24, 2024
An Iron Dome for your Home…
pic.twitter.com/js8sOdmDsd
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire