Top
logo

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్మార్ట్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్‌

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్మార్ట్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్‌
X
Amazon Prime Day sale to begin tomorrow
Highlights

Amazon Prime Day Sale: అన్‌లైన్ షాపింగ్ ప్రియుల‌కు మ‌రో డిస్కౌంట్ల పండగ వ‌చ్చేసింది. అమెజాన్ త‌న యూజ‌ర్ల‌కోసం ఈ 6,7 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరిట భారీ డిస్కౌంట్‌పై అమ్మ‌కాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ది.

Amazon Prime Day Sale: అన్‌లైన్ షాపింగ్ ప్రియుల‌కు మ‌రో డిస్కౌంట్ల పండగ వ‌చ్చేసింది. అమెజాన్ త‌న యూజ‌ర్ల‌కోసం ఈ 6,7 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరిట భారీ డిస్కౌంట్‌పై అమ్మ‌కాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ది. ఇప్ప‌టికే కౌన్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రైమ్ డే సేల్ ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫర్నీచర్, హోమ్ అప్లయెన్సెస్‌తో పాటు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.

కరోనా వైరస్ అవుట్‌బ్రేక్‌ తర్వాత తొలిసారి అమెజాన్ 'ప్రైమ్ డే'ను నిర్వహించ‌డం ఈ సేల్స్ ప్ర‌త్యేక‌త‌. అంతకుముందు లాగా కాకుండా వర్చ్యువల్‌గా అమెజాన్ ఆపరేషన్స్‌ను చేపట్టనుంది. ఈ సేల్స్‌లో దాదాపు అన్ని టాప్‌ బ్రాండ్ మొబైల్స్‌పై దాదాపు 40శాతం ఆఫ్‌ ఉంది. ఎలక్ట్రానిక్‌ అండ్‌ యాక్ససరీస్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించారు. కెమోరాలు అండ్‌ యాక్సిసరీస్‌, హెడ్‌ ఫోన్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్‌ ఇచ్చారు. ల్యాప్‌టాప్స్‌, ఫిటన్‌నెస్‌ ట్రాకర్స్‌పైన కూడా డిస్కౌంట్‌ ఇచ్చారు.

స్మార్ట్ ఫోన్స్‌పై ఉన్న కొన్ని ఆఫర్స్ మీకోసం..

- ఈ ప్రైమ్ డే సేల్ లో వివో వీ17 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.22,491 ఉండ‌గా.. ఆఫర్‌లో రూ.21990 ధరకే ల‌భించే అవ‌కాశముంది.

- వన్‌ప్లస్ 7టీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్ అసలు ధర రూ.37,999 ఉండ‌గా.. ఆఫర్‌లో రూ.35999 ధరకే ల‌భించే అవ‌కాశముంది.

- ఒప్పో ఎఫ్15 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.18990. ఆఫర్‌లో రూ.16990 ధరకే ల‌భించే అవ‌కాశముంది.

- సాంసంగ్ గెలాక్సీ ఎస్10 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.49,990. ఆఫర్‌లో రూ.44999 ధరకే కొనొచ్చు.

- సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.11,899 ఉండ‌గా.. ఆఫర్‌లో రూ.10999 ధరకే ల‌భించే అవ‌కాశముంది.

- పానాసోనిక్ ఎల్యూగా ఐ7 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.7490ఉండ‌గా. ఆఫర్‌లో రూ.6499 ధరకే ల‌భించే అవ‌కాశముంది.

- రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.24999 ఉండ‌గా. ఆఫర్‌లో రూ.22999 ధరకే పొంపే అవ‌కాశముంది.

- హువావే వై9ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,990. ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.1,500 లభిస్తుంది.

ఇవే కాక బడ్జెట్, మిడ్ రేంజ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో కొనేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్, ఎక్స్‌టెండెడ్ వారెంటీ, నో కాస్ట్ ఈఎంఐ లాంటి అనేక ఆఫ‌ర్స్‌ను పొంద‌వ‌చ్చు.

Web TitleAmazon Prime Day sale to begin tomorrow
Next Story