Mayday Call: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా.. అసలు మేడే కాల్ అంటే ఏంటి?

Ahmedabad Air India Plane Crash Mayday Call Details
x

Mayday Call: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా.. అసలు మేడే కాల్ అంటే ఏంటి?

Highlights

Mayday Call: అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కుప్పకూలిపోయింది.

Mayday Call: అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది చనిపోగా...ఒకరు బయటపడ్డారు. విమానం కూలిన ప్రాంతంలో మెడికో హాస్టల్ ఉండడంతో పలువురు మెడికోలు చనిపోయినట్టు తెలుస్తోంది.

విమానం టేకాఫ్ అయిన తర్వాత 625 అడుగులు ఎత్తులోకి వెళ్లింది. అక్కడ నుంచే పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి మేడే కాల్ జారీ చేసాడని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. అయితే పైలెట్ మేడే కాల్ చేసిన కొద్ది సేపటికే విమానం కూలిపోయింది.

అసలు మేడే కాల్ అంటే ఏంటి?

మేడే కాల్ అనే ఇంటర్నేషనల్‌గా గుర్తింపు పొందిన ఒక డిస్ట్రస్ సిగ్నల్. ముఖ్యంగా విమానయానం, సముద్రయానం కమ్యూనికేషన్లలో ప్రణాంతకమైనప్పుడు అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తారు. తాము ప్రమాదంలో ఉన్నామని మేడే కాల్ చేసి చెబుతారు.

మేడే అనేది మైడర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీని అర్ధం.. హెల్ప్ మి. నన్ను రక్షించండి. మేడే కాల్‌ని పైలెట్ మాత్రమే చేస్తారు.

ఎప్పుడు మేడే కాల్ ప్రారంభించారు?

మొట్టమొదటిసారి 1920లో మేడే కాల్‌ని ప్రవేశ పెట్టారు. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇటు విమాన సంస్థ, అటు నావీ సంస్థలలో ప్రామాణిక ప్రోటోకాల్ అయింది. ఈ కాల్ వచ్చినప్పడు ‘ మేడే మేడే మేడే’ అని మూడుసార్లు వస్తుంది. ఇలా వచ్చింది అంటే ఆ విమానం లేదా ఆ నావ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు భావిస్తారు.

ఏ సమయంలో జారీ చేస్తారు?

సాధారణంగా వాహనానికి సంబంధించి ఏదైనా ఇంజిన్ విఫలమైనప్పుడు, ఆన్ బోర్డ్‌లో మంటలు చెలరేగినప్పుడు, వాహనం అదుపు తప్పినప్పుడు వంటి సమయాల్లో మేడే కాల్‌ను రేడియో ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి పైలెట్ తెలియజేస్తాడు. ఒకవేళ కాలర్ కమ్యూనికేషన్ కోల్పోయినట్లయితే సమీపంలో ఉన్న విమానం లేదా ఓడ ద్వారా కూడా మేడే కాల్ ను ప్రసారం చేస్తారు.

మేడే కాల్ జారీ అయిన తర్వాత ఏం జరుగుతుంది?

మేడే కాల్ వచ్చిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీలోని అన్ని రేడియో ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఆపదలో ఉన్న వ్యక్తి తనుకు ఏర్పడ్డ అత్యవసర వివరాలను తెలియజేస్తాడు. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్వయంగా లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్ తో కలిసి రెస్క్యూ చేస్తుంది.

అయితే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పైలెట్ మేడే కాల్ జారీ చేసిన కొన్ని క్షణాల్లోనే విమానం కూలిపోయింది. ఇప్పుడు మేడ్ కాల్ అలాగే రేడియో ప్రసారంలో ఇంకా ఏమైనా మెసేజెస్ ఉన్నాయా? అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories