Viral Video: పైకి చూస్తే నోట్‌ బుక్స్‌.. తెరిచి చూస్తే అసలు విషయం బయటపడింది

A smuggler caught with illegal transferring alcohol video goes viral
x

Viral Video: పైకి చూస్తే నోట్‌ బుక్స్‌.. తెరిచి చూస్తే అసలు విషయం బయటపడింది 

Highlights

Viral Video: బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి పుస్కాల మాటు మద్యాన్నిఅక్రమ రవాణా చేశాడు. నోట్‌బుక్స్‌ మధ్యలో అనుమానం రాకుండా మందు బాటిల్స్‌ను సరఫరా చేస్తున్నాడు.

Viral Video: పోలీసులు, అధికారులు ఎన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు మాత్రం తగ్గడం లేదు. డ్రగ్స్‌, గంజాయి, అక్రమ మద్యం ఇలా అక్రమాలకు అడ్డకట్ట పడడం లేదు. రకరకాల మార్గాల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే అడపాదడపా ఇలాంటి అక్రమ రవాణాలకు సంబంధించి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వీడియో అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి పుస్కాల మాటు మద్యాన్నిఅక్రమ రవాణా చేశాడు. నోట్‌బుక్స్‌ మధ్యలో అనుమానం రాకుండా మందు బాటిల్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ఆటోలో కూర్చొని దజ్జాగా వెళ్తున్నాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు, వెంటనే ఆటోను ఆపి సదరు వ్యక్తిని పుస్తకాల కట్టను విప్పాలని ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పుస్తకాల మధ్య నుంచి మద్యం బాటిళ్లు బయటపడటంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అస్సలు అనుమానం రాకుండా పైన, కింద పుస్తకాలను పెట్టి మధ్యలో మద్యం సీసాలను పేర్చాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి బీహార్‌కు మద్యం బాటిళ్లను అక్రమంగా సరఫరా చేస్తూ ఇలా దొరికిపోయాడు. దీనతంటినీ పోలీసులు ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేశారు. దీంతో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మనోడి ట్యాలెంట్‌కు తిట్టాలో, పొగడాలో అర్థం కావట్లేదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. బీహార్‌లో మద్యంపై నిషేధం విధించడంతో కొందరు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories