Railway Facts: ప్యాసింజర్‌ రైలులో 24, గూడ్స్‌ లో 50 కంటే ఎక్కువ కోచ్‌లు ఉంటాయి.. కారణం తెలుసా..?

A Passenger Train Has 24 Coaches And A Goods Train Has More Than 50 Coaches Know The Reason
x

Railway Facts: ప్యాసింజర్‌ రైలులో 24, గూడ్స్‌ లో 50 కంటే ఎక్కువ కోచ్‌లు ఉంటాయి.. కారణం తెలుసా..?

Highlights

Railway Facts: భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ.

Railway Facts: భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. అంతేకాకుండా ప్రయాణికులు చౌకైన ధరలో అధిక దూరం ప్రయాణం చేయవచ్చు. అందుకే చాలామంది రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతారు. అయితే చాలామందికి రైల్వే గురించిన కొన్నివిషయాలు తెలియవు. వీటి గురించి తెలిసనప్పుడు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ప్యాసింజర్‌ రైలుకు 24 కోచ్‌లు ఉంటాయి. అదే గూడ్స్‌ రైలుకు 50 కంటే ఎక్కువ కోచ్‌లు ఉంటాయి. ఈ రోజు వీటి మధ్య వ్యత్యాసం గురించి తెలుసుకుందాం.

ప్యాసింజర్ రైలులో 24 కోచ్‌లు?

నిజానికి రైల్వే ట్రాక్‌లో లూప్ లైన్‌లు అంటే చిన్న సైడ్ లైన్‌లు ఉంటాయి. వీటిని రైళ్లను ఓవర్‌టేక్ చేయడానికి లేదా ఆపడానికి ఉపయోగిస్తారు. ఈ లైన్ల పొడవు సాధారణంగా 650 మీటర్లు మాత్రమే ఉంటుంది. అందుకే ప్యాసింజర్ రైలు 650 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు. ఇది సులభంగా లూప్ లైన్‌లోకి సరిపోయేలా ఉండాలి. ప్యాసింజర్ రైలులో ఒక కంపార్ట్‌మెంట్ 25 మీటర్ల పొడవు ఉంటుంది. 650 మీటర్ల రైలును ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు 25 మీటర్లుగా విభజిస్తే 26 కంపార్ట్‌మెంట్‌లకు వస్తుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా 24 కంపార్ట్‌మెంట్లను మాత్రమే ఆపరేట్ చేయాలి. 26 కోచ్‌లు ఉన్న రైలు కంటే ఇది సురక్షితమైనది. అంతే కాకుండా ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 24 కోచ్‌లతో కూడిన రైలులో అన్ని సౌకర్యాలు కల్పించడం సులభమవుతుంది.

గూడ్స్ రైలులో 50కి పైగా కోచ్‌లు

సరుకులను రవాణా చేయడానికి గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తారు. గూడ్స్ రైలు క్యారేజీలు (పెట్టెలు/వ్యాగన్లు) ప్యాసింజర్ రైలు క్యారేజీల కంటే చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా 11 నుంచి 15 మీటర్ల పొడవు మాత్రతమే ఉంటాయి. అదే సమయంలో గూడ్స్ రైళ్లు లూప్ లైన్‌లోకి సరిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి ప్రధానంగా ఎక్కువ దూరం ప్రయాణించి స్టేషన్‌లలో ఆగుతాయి. గూడ్స్ రైలు ఇంజిన్ భారీ లోడ్లను లాగడానికి వీలుగా రూపొందిస్తారు. ఒక గూడ్స్ రైలులో 50 కంటే ఎక్కువ కోచ్‌లు అమర్చబడి ఉంటాయి. ఎందుకంటే వీటివల్ల రైల్వేకు మరింత ఆదాయాం వస్తుంది కాబట్టి.

Show Full Article
Print Article
Next Story
More Stories