Top
logo

సాధారణ బస్ కండక్టర్: కలలను గెలిచాడు.. కలెక్టర్ కాబోతున్నాడు!

సాధారణ బస్ కండక్టర్: కలలను గెలిచాడు.. కలెక్టర్ కాబోతున్నాడు!
X
Highlights

ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ పరీక్షల్లో ఎన్ సీ మధు విజయం సాధించాడు. ఇది చాలా...

ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ పరీక్షల్లో ఎన్ సీ మధు విజయం సాధించాడు. ఇది చాలా మామూలు విషయంలా కనిపిస్తుంది. కానీ, మధు గురించి తెలుసుకుంటే.. అతని ప్రయత్నాన్నీ, ఈ విజయాలన్నీ ఎప్పటికీ మర్చిపోలేం. జీవితంలో ఎత్తుకు ఎదగాలనే యువతకు మధు సాధించిన ఈ విజయం దిక్సూచి గా చెప్పుకోవచ్చు. ఎందుకో తెలియాలంటే మధు గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే!

సాధారణ బస్ కండక్టర్ గా..

మధు కుటుంబంలో ఎవరికీ చదువు లేదు. అతని అన్నయ్య, వదిన, తండ్రి ఎవరూ చదువుకోలేదు. మధు మాత్రమే పెద్ద చదువుల వరకూ వెళ్ళాడు. బీఎంటీసీ లో బస్సు కండక్టర్ గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఒక బస్ కండక్టర్ గా రోజుకు ఎనిమిది గంటలు తన విధులు నిర్వర్తిస్తూనే, తన కలల సాకారం దిశలో అడుగులు వేశాడు.

రోజుకు ఐదు గంటలు చదువు..

ప్రతి రోజూ ఎనిమిది గంటలు కండక్టర్గా విధులు నిర్వహిస్తూ.. కలెక్టర్ కావాలనే తన కోరిక తీర్చుకోవడం కోసం ఐదు గంటల పాటు చదువుకునే వాడు. కన్నడ భాషలోనే ప్రిలిమినరీ పరీక్షలు రాశాడు. మెయిన్స్ మాత్రం ఇంగ్లీష్ లో రాశాడు.

19 ఏళ్లకే కండెక్టర్..

కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన చిన్న పట్టణం మలవల్లి లో జీవించే మధు కుటుంబంలో అందరూ చదువులకు దూరంగానే ఉండిపోయారు. అయితే, మధు ఇంటర్ వరకూ చదువుకుని తన 19 ఎళ్ల వయసులో కుటుంబ ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడం కోసం బాస్ కండక్టర్ గా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. తరువాత కరెస్పాండెన్స్ విధానంలో డిగ్రీ, పీజీ విద్యలను పూర్తి చేసుకున్నాడు మధు. అదేవిధంగా కండక్టర్ గా తన విధులను నిర్వర్తిస్తూనే సివిల్స్ కు సిద్ధమయ్యాడు.

కోచింగ్.. ట్యూషన్ వంటివి లేవు.. సివిల్స్ సిద్ధం కావడం అంటే గంటల తరబడి చదువూ.. ట్యూషన్ లు.. కోచింగ్ లు ఎన్నో ఉంటాయి. కానీ, మధు మాత్రం అటువంటి వాటి జోలికే పోలేదు. కేవలం రోజుకు ఐదు గంటలపాటు చదివాడు. సవంతంగా స్టడీ మెటీరియల్ సమకూర్చుకున్నాడు. అందుకు తన సంస్థలో సీనియర్ల దగ్గర సలహాలు తీసుకున్నాడు. యూట్యూబ్ వీడియోలు వందల కొలదీ చూశాడు. అంతా స్వతంత్రంగా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. ''నేను యు ట్యూబ్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. పరీక్షలకు ప్రిపేరయ్యను.. ఇప్పుడు ఇంటర్వ్యూ కు కూడా అదేవిధంగా సిద్ధం అవుతున్నాను.'' అంటూ చెబుతున్నాడు మధు.

తన బాసే తనకు స్ఫూర్తి!

సి.శిఖ.. ఆమె బెంగళూర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీ. ఆమె కూడా కష్టపడి చదువుకుని సివిల్స్ పాసయి ఆ స్థాయికి చేరుకున్నారు. ఆమెను స్ఫూర్తి గా తీసుకునే మధు సివిల్స్ రాయాలని అనుకున్నాడట. ఇక సివిల్స్ కు సిద్ధం కావడంలో శిఖా అతనికి ఎంతగానో సహకరించారు. ప్రతివారం రెండు గంటల పాటు అతనికి సివిల్స్ పరీక్షలు ఎదుర్కోవడం కోసం సూచనలు అందించే వారు. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్వ్యూను ఎదుర్కోవడానికి కూడా ఆమె సహకారాన్ని అందిస్తున్నారు.

అంత సులువు కాదు..

రోజుకు ఎనిమిది గంటల పాటు బస్సులో వేలాడుతూ తిరుగుతూ టికెట్లు ఇచ్చే పని చేసి.. బస్సులో ఎదురయ్యే రకరకాల మనుషులకు సమాధానం చెప్పి.. తిరిగి ఐదు గంటల పాటు చదవడం అంత తేలికేం కాలేదని చెబుతాడు మధు. ముందు కర్ణాటక ఎడ్మినిస్టేటివ్ సర్వీసెస్ లో ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు. కానీ విజయం సాధించలేకపోయారు. అయినా క్రుంగి పోకుకండా సివిల్స్ పరీక్షలకు సిద్ధం అయ్యారు. నాజీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలనేది నా కల. అవసరం కోసం కండెక్టర్ ఉద్యోగం లో చేరినా.. నేనెప్పుడూ నా కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈదారిలో నాకు ఇబ్బందులు ఎదురైనా దానిలో ముందుకు సాగాను. ఎథిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, సైన్స్ నా సబీజెక్టులు. వాటిని ఎప్పుడూ చదువుతూనే వచ్చాను. రోజుకు ఐదుగంటలు.. తెల్లవారుజాము 4 గంటలకు నిద్ర లేచి చదివే వాడినిని చెబుతున్న మధు ఈ మార్చి 25 న ఇంటర్వ్యూ కి హాజరు కాబోతున్నాడు. ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుందాం.

Web Titlea normal bus conductor passed UPSC exams and preparing for final interview is an inspirable story from Bangalore Karnataka
Next Story