చనిపోయిన బిడ్డను పూడ్చడానికి వెళ్తే సీత దొరికింది.

చనిపోయిన బిడ్డను పూడ్చడానికి వెళ్తే సీత దొరికింది.
x
Highlights

దశరధుడుకి పోలం దున్నుతుంటే నాగలికి ఓ పెట్ట తాకడంతో అందులో నుండి సీత బయటకు వస్తుంది. దాదాపుగా ఇది కూడా అలాంటిదే.. అప్పుడే పుట్టిన బిడ్డకు నూరేళ్ళు...

దశరధుడుకి పోలం దున్నుతుంటే నాగలికి ఓ పెట్ట తాకడంతో అందులో నుండి సీత బయటకు వస్తుంది. దాదాపుగా ఇది కూడా అలాంటిదే.. అప్పుడే పుట్టిన బిడ్డకు నూరేళ్ళు నిండిపోయాయి. పుట్టెడు దుఃఖంలో ఆ తండ్రి ఆ పసిగుడ్డును పూడ్చడానికి స్మశానానికి వెళ్ళాడు. గోతి తవ్వుతుండగా అక్కడ మూడు అడుగుల లోతులో ఓ కుండ కనిపించింది. ఏంటి అని తీసి చూస్తే అందులో ఓ పసిపాప ఉంది. దీనితో ఏమి చేయాలో తెలియక వెంటనే పోలీసులను ఆశ్రయించాడు .

ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ లో హితేష్ కుమార్ , వైశాలి దంపతులు నివసిస్తూ ఉన్నారు. గురువారం రాత్రి వైశాలికి పురిటినొప్పులు రావడంతో ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ క్షణంలోనే చనిపోయింది. దీనితో ఆమెను పుడ్చేందుకు వెళ్ళగా అక్కడ కుండలో పసికందు దొరికింది. దీనితో ఆ పాపకు పాలు పట్టించి పోలీసులకు అప్పగించాడు. అప్పటికే శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఆ పసికందును ఆసుపత్రిలో చేర్చారు. ఆ పాప వైద్యానికి అయ్యే ఖర్చును భరించడానికి స్థానిక ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా ముందుకు రావడం విశేషం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories