Viral Video: గాల్లో ఎగిరే వింత పాము.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

A Flying Snake Found in Jharkhand Video Goes Viral in Social Media
x

Viral Video: గాల్లో ఎగిరే వింత పాము.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Highlights

Snake Video Viral: పాము అనగానే భయంతో పాటు ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. అందుకే సోషల్‌ మీడియాలో సైతం పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి.

Snake Video Viral: పాము అనగానే భయంతో పాటు ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. అందుకే సోషల్‌ మీడియాలో సైతం పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. ఇక ఈ విశ్వంలో రకరకాల పాములు ఉన్నాయని తెలిసిందే. మనకు తెలియని ఎన్నో వింత పాములకు ఈ విశ్వం పెట్టింది పేరు. అడపాదడపా అలాంటి వీడియోలు మన కంటపడుతుండడం చూసే ఉంటాం. తాజాగా ఇలాంటి ఓ వింత పాముకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.

మహాభారతంలో ప్రస్తావన ఉన్న తక్షక అనే నాగు పాము ఝార్ఖండ్‌లో ప్రత్యక్షమైంది. రాంచీలోనూ ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చిన ఈ పాముకు సంబంధించిన వీడియోను ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా తెగ వైరల్‌ అవుతోంది. పామును గమనించిన ఉద్యోగులు వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించగా ఆయన వచ్చి పామును క్షేమంగా బయటకు తీశాడు.

అయితే ఈ తక్షక నాగుపాముకు పెద్ద చరిత్రే ఉంది. ఈ అరుదైన పాము పెద్దగా విషపూరితం కాదని చెబుతున్నారు. అత్యంత అరుదుగా కనిపించే ఈ పామును బిర్సా జూలాజికల్ పార్క్‌లోని స్నేక్ హౌస్‌కు తరలించారు. ఇక పాము చరిత్ర విషయానికొస్తే.. ద్వాపర యుగం చివరలో భారతదేశాన్ని పరీక్షిత్తు అనే రాజు పరిపాలించాడు. ఆయన తక్షకుడనే పాము కాటు కారణంగా మరణించినట్లు మహాభారతంలో ఉంటుంది.

తక్షకుడు నాగ వంశస్థుడని చెబుతారు. ఈ పాము వందల ఏళ్లు జీవిస్తుందట. తక్షక నాగుపాము ఎక్కువగా చెట్లపై నివసిస్తుంది. ఒక చెట్టు పై నుంచి మరో చెట్టు పైకి ఎగరగలదు అని చెబుతారు. అందుకే ఈ పామును ఫ్లయింగ్‌ స్నేక్‌ అని పిలుస్తుంటారు. దట్టమైన అడువులు ఉండే చోట ఈ పాము ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో బయటకి రావడంతో చర్చ నడుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories