Viral Video: భూమ్మీద మనకు తెలియని అద్భుతం.. వైరల్‌ అవుతోన్న ఎవరెస్ట్‌ వీడియో

A chinese drone company captured mount everest video in drone, video goes viral
x

Viral Video: భూమ్మీద మనకు తెలియని అద్భుతం.. వైరల్‌ అవుతోన్న ఎవరెస్ట్‌ వీడియో 

Highlights

Viral Video: భూమ్మీద మనకు తెలియని అద్భుతం.. వైరల్‌ అవుతోన్న ఎవరెస్ట్‌ వీడియో

Viral Video: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఏది అనగానే వచ్చే సమాధానం మౌంట్‌ ఎవరెస్ట్‌. భూమ్మీద ఉండే మరో ప్రపంచం ఈ ప్రదేశం. మౌంట్ ఎవరెస్ట్ పైకి చేరుకోవడం ఎంతో కష్టంగా కూడుకున్న విషయం. కేవలం కొందరు సాహసయాత్రికులు మాత్రమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంటారు. అయితే ఎవరెస్ట్ పైన పరిస్థితులు ఎలా ఉంటాయి.? అక్కడ దృశ్యాలు చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.

అలాంటి వారి కోసమే చైనాకు చెందిన ఓ డ్రోన్‌ కంపెనీ ఓ వీడియోను రూపొందించింది. మౌంట్ ఎవరెస్ట్ పైకి డ్రోన్‌ను పంపించి అక్కడి దృశ్యాలను చిత్రీకరించింది. ఎవరెస్ట్‌ పైన ఉన్న దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు వావ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరెస్ట్‌పై ఉన్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి.

చైనాకి చెందిన డ్రోన్‌ కంపెనీ డీజేఐ గ్లోబల్‌ తన ప్రీమియం `డీజేఐ మావిక్ 3 ప్రో` డ్రోన్ సహాయంతో ఈ అందాలను చిత్రీకరించింది. సముద్రమట్టానికి 5,300 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ నుంచి డ్రోన్‌ను ఉపయోగించారు. 3500 మీటర్లపైకి ఎగిరిన డ్రోన్‌ ఎవరెస్ట్‌పై ఉన్న దృశ్యాలను అద్భుతంగా షూట్ చేశారు. ఖుంబూ ఐస్‌ఫాల్, చుట్టుపక్కల హిమానీనదాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. భూమి మీద ఉన్న అద్భుతాన్ని చూసిన నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories