Alert: ఉద్యోగులు, పెన్షనర్లకి అలర్ట్‌.. ఈ డబ్బులు అస్సలు కోల్పోకండి..!

Employees and Pensioners Alert 7th Pay Commission Govt Employees do Children Education Allowance Claim before 31 March
x

Alert: ఉద్యోగులు, పెన్షనర్లకి అలర్ట్‌.. ఈ డబ్బులు అస్సలు కోల్పోకండి..!

Highlights

Alert: ఉద్యోగులు, పెన్షనర్లకి అలర్ట్.. ఈ ముఖ్య సమాచారం తెలుసుకోండి...

Alert: ఉద్యోగులు, పెన్షనర్లకి అలర్ట్.. ఈ ముఖ్య సమాచారం తెలుసుకోండి. పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) పొందిన తర్వాత ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు మరో అలవెన్స్‌ను పొందే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ (CEA)ని క్లెయిమ్ చేసుకోలేకపోయిన ఉద్యోగులందరూ 31 మార్చి 2022లోపు క్లెయిమ్ చేసుకోగలరు. దీని కోసం మీకు అధికారిక పత్రాలు కూడా అవసరం లేదని గుర్తుంచుకోండి.

7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ఉద్యోగులు తమ పిల్లల చదువు కోసం నెలకు రూ.2,250 భత్యం పొందుతారు. అయితే గతేడాది నుంచి కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు సీఈఏను క్లెయిమ్ చేయలేకపోయారు. అందుకే దాని చివరి తేదీని పొడిగించారు. ఇప్పుడు గడువుకు ముందే CEA క్లెయిమ్ చేయండి.

పిల్లల విద్యా భత్యాన్ని క్లెయిమ్ చేయడానికి కేంద్ర ఉద్యోగులు పాఠశాల సర్టిఫికేట్, క్లెయిమ్ పత్రాలను సమర్పించాలి. పాఠశాల నుంచి వచ్చిన డిక్లరేషన్‌లో పిల్లవాడు తమ సంస్థలో చదువుతున్నట్లు ఉండాలి. దీంతో పాటు అకడమిక్ క్యాలెండర్ కూడా ప్రస్తావించాలి. సీ క్లెయిమ్ కోసం పిల్లల రిపోర్ట్ కార్డ్, స్వీయ-ధృవీకరించిన కాపీ, ఫీజు రసీదు జతచేయాలి.

జూలైలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఆఫీస్.. ఆఫ్ మెమోరాండం (OM)ని జారీ చేసింది. ఇందులో కరోనా కారణంగా పిల్లల విద్యా భత్యం క్లెయిమ్ చేయడంలో కేంద్ర సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఎందుకంటే ఫీజులను ఆన్‌లైన్‌లో జమ చేసిన తర్వాత కూడా పాఠశాల నుంచి ఫలితాలు/రిపోర్ట్ కార్డ్‌లు SMS/ఈ-మెయిల్ ద్వారా అందలేదు. ఈ కారణంగా క్లెయిమ్‌ చేసుకోలేకపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories