73 ఏళ్ల వయసులో గర్భం: మంగా'యమ్మ' కోరిక తీరుతోంది బామ్మయ్యకా!

73 ఏళ్ల వయసులో గర్భం: మంగాయమ్మ కోరిక తీరుతోంది బామ్మయ్యకా!
x
Highlights

గుంటూరు.. ఈరోజు అరుదైన ఘటనకు వేదిక కానుంది. 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన బామ్మకు గురువారం వైద్యులు సిజేరియన్‌ చేసి పురుడుపోయనున్నారు. ఇక వివరాల్లోకి వెళితే... ఆమె పేరు మంగాయమ్మ.. వయసు 73.. పిల్లలు కావాలనే తపనతో ఎన్నో ప్రయత్నాల అనంతరం అంది వచ్చిన టెక్నాలజీ సహాయం తో గర్భం దాల్చిన ఈ బామ్మ గారు ఇప్పుడు రికార్డు సృష్టించారు.

ఒక వయసు దాటాకా పిల్లలు కనేందుకు సాధారణంగా మహిళలు ఆసక్తి చూపించారు. వారికి పిల్లలు కలగలేడనే బాధ ఎంతగా వున్నా.. పిల్లలుంటే బావుండుననే తపన వారిని దాహించేస్తున్నా.. సమాజంలో ఎదురయ్యే సవాళ్లు.. శారీరకంగా వచ్చే కష్టాలు వంటివి ఆ అమ్మ మనసును చంపేస్తాయి. అయితే, 73 ఏళ్ల ముదిమిలో ఓ బామ్మగారు గర్భం దాల్చారు. పెళ్ళైన నాటి నుంచి పిల్లలు కావాలనుకున్న తన కోరిక నేరవేరకపోవడంతో ఎన్నో ప్రయత్నాలు చేశారీ బామ్మ. ఆ ప్రయత్నాలు ఇప్పటికి ఆమెకు అనుకూలించాయి. వైద్యులిచ్చిన సహకారం.. పిల్లలపై ఆ ముదుసలికి ఉన్న బలమైన కోరికా.. ఇప్పుడు ఫలించబోతున్నాయి. అరుదైన.. ఇప్పటివరకూ మనదేశంలో ఎక్కడా చోటు చేసుకొని ఈ సంఘటనకు వేదికగా గుంటూరు నిలిచింది. ఆ బామ్మగారి గర్భం కథ ఏమిటో తెలుసుకుందామా?

తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన మంగాయమ్మకు గుంటూరుకు చెందినా యర్రమట్టి రామరాజారావుతో చాలా ఏళ్ల క్రితం వివాహం అయింది. ఆమెకు పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. కానీ, దురదృష్టం ఆమెను వెంటాడింది. పెళ్లి ఎన్నేళ్ళైనా ఆమె గర్భవతి కాలేకపోయింది. పిల్లల కోసం ఆమె తిరుగని ఆసుపత్రి.. మొక్కని దేవుడూ లేదు. అదేవిధంగా ఆమె పిల్లల్ని కనాలనే కోరికనూ చంపుకోలేదు. అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఆఖరుకు తన 73 ఏళ్ల వయసులో మంగాయమ్మ కోరిక తీరింది. చివరిసారిగా గతేడాది చెన్నై లో ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) ద్వారా సంతానం పొందాలని ఆమె చేసిన ప్రయత్నమూ విఫలం అయింది. అయితే, ఈ సంవత్సరం గుంటూరులోని అహల్యా ఆసుపత్రి వైద్యుల కృషితో ఆమె కోరిక నెరవేరింది. .

2018 నవంబర్‌లో మంగాయమ్మ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా.. ఐవీఎఫ్‌ పద్ధతిలో భార్య గర్భం దాల్చింది.ఈ వయసులోనూ ఈ బామ్మగారికి ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేవు. ముఖ్యంగా బీపీ, షుగర్‌ వంటి వ్యాధులు లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది. ప్రస్తుతం ఈమె బిడ్డకు జన్మని ఇవ్వబోతోంది. ఈరోజు(గురువారం) ఉదయం 10.30 గంటలకు మంగాయమ్మకు ఆపరేషన్‌చేసి పురుడుపోయనున్నట్లు డాక్టర్‌ ఉమాశంకర్‌ చెప్పారు. ఈ సందర్భంగా డా.ఉమాశంకర్ మాట్లాడుతూ 73 ఏండ్ల వయసులో ఓ వృద్దురాలు గర్భం దాల్చడం అనేది దేశంలోనే మొట్టమొదటిసారి చెప్పారు. ప్రస్తుతం బామ్మ ఆరోగ్యం బాగుందని ఆపరేషన్ కి అన్ని సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం అయి 70 ఏండ్ల వయసులో గర్భం దాల్చి.. జన్మనిచ్చిన తల్లిగా మంగాయమ్మ రికార్డు సృష్టించాలని అందరూ కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories