గొర్రెను క్లోజ్ షాట్ తీద్దామనుకున్నాడు..కొమ్ములతో కుమ్మేసింది!

గొర్రెను క్లోజ్ షాట్ తీద్దామనుకున్నాడు..కొమ్ములతో కుమ్మేసింది!
x
Highlights

మన శరీరం భాగాలలో కొన్ని అత్యంత సున్నితంగా ఉంటాయి. ఇగ వాటికి ఏ మాత్రం దెబ్బ తగిలితే తట్టుకోలేం. గిల్ల గిల్ల కొట్టుకుంటాం. అలాంటి పరిస్థితి బీబీసీ కెమెరామేన్‌కి ఎదురైంది.

మన శరీరం భాగాలలో కొన్ని అత్యంత సున్నితంగా ఉంటాయి. ఇగ వాటికి ఏ మాత్రం దెబ్బ తగిలితే తట్టుకోలేం. గిల్ల గిల్ల కొట్టుకుంటాం. అలాంటి పరిస్థితి బీబీసీ కెమెరామేన్‌కి ఎదురైంది. దినికి సంబంధించిన వీడియోని బీబీసీ యూట్యూబ్‌లో పెట్టింది. ఆ వీడియో ఇద్దరు మహిళలు దగ్గరికి వచ్చిన గొర్రెకు మొతపెడుతుంటారు. ఆ తరువాత పక్కనే ఉన్న కెమెరామేన్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో అతడు కింద కూర్చొని ఉన్నాడు. ఆ గొర్రెను క్లోజ్ షాట్ తీద్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇంతలోనే ఆ గొర్రె అతనికి గట్టి షాట్ ఇచ్చింది. కరెక్టుగా సెన్సిటివ్ పార్ట్స్‌ను ఢీకొట్టడంతో కెమెరామేన్ ఒక్కసారిగా కంగుతిని బొర్ల బొక్కల పడ్డాడు.

లాంగ్లెస్ ఎస్టేట్ అండ్ సఫారీ పార్క్‌లో పరిశోధనలు చేస్తున్న సమయంలో... ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 2న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 8 లక్షల మందికి పైగా చూశారు. చాలా మంది ఈ వీడియో చూసిన తరువాత కామెంట్స్ పెడుతున్నారు. మీ దగ్గర కెమెరా ఉంటే.. ఆ గొర్రెకు పదునైన కొమ్ములు ఉన్నాయి. ఎంత కోపం వచ్చిందో అందుకే అలా కుమ్ముడు కుమ్మింది' అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు ఇదో దురదృష్టకర సంఘటనగా వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories