నీ నమ్మకమే, నీకు నిజమైన రక్షా!

నీ నమ్మకమే, నీకు నిజమైన రక్షా!
x
Highlights

ఫ్రెండ్స్ మనం ఈ రోజు చర్చించే అంశం.. నీ నమ్మకమే, నీకు నిజమైన రక్షా! ఒక పక్షి, ఒక చెట్టు కొమ్మపై ప్రశాంతంగా కూర్చున్నది అంటే, అది ఆ కొమ్మ...

ఫ్రెండ్స్ మనం ఈ రోజు చర్చించే అంశం.. నీ నమ్మకమే, నీకు నిజమైన రక్షా!

ఒక పక్షి, ఒక చెట్టు కొమ్మపై ప్రశాంతంగా కూర్చున్నది అంటే, అది ఆ కొమ్మ యొక్క బలాన్ని నమ్మటం వలన కాదు! అలా ప్రశాంతంగా కూర్చోడానికి వెనక వున్న దైర్యం, తన రెక్కల మీద ఉన్న నమ్మకమే! అలాగే మనం కూడా, మన రోజువారి జీవితంలో, ఇతరుల యొక్క సహాయం తీసుకోవచ్చు, కాని పూర్తి గా ఇతరులనే నమ్ముకుంటే మాత్రం, ఎన్నో సార్లు మనం బాధపడాల్సిన పరిస్థితి రావచ్చు.

కాబట్టి అన్ని సమయాలలోనూ మిమ్మల్ని మీరు, నమ్ముకోవడమే మంచిది. ఇతరులను మీరు నమ్మితే కొన్నిసార్లు మీరు మోసపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు నమ్మితే మాత్రం, ఎన్నో విజయాలు సాధిస్తారు. తనని తను నమ్మిన వ్యక్తి, ఈరోజు కాకున్నా, రేపైనా తప్పక గెలుస్తాడు. అయితే చాలామందికి వారి పై, వారికీ పూర్తి నమ్మకం వుందా? అని మనం పరిశీలిస్తే మాత్రం....వారికీ పూర్తి నమ్మకం లేదనే చెప్పాలి.

వారి నైపుణ్యం మీద, వారి సమర్ధత మీద, వారి కష్టం మీద వారికీ నమ్మకం ఉండదు. కానీ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూస్తూ..నమ్ముతూ వుంటారు. ఉదాహరణకి తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్నట్టు... మనకి జ్వరం వచ్చినప్పుడు పక్కకి అమ్మ వుంటే బాగుండు అనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్న పక్కన వుంటే ధైర్యం అనిపిస్తుంది, భాధలో వున్నప్పుడు ఫ్రెండ్ ప్రక్కన వుంటే బాగుంటుంది, ఆనందంగా వున్నప్పుడు మనం ప్రేమించన వ్యక్తి పక్కన వుంటే భాగావుంటుంది అని అంటాడు. కాని ఫ్రండ్స్ ఈ ప్రతి సందర్భంలోనూ మనకి మనం తోడుగా ఉండటం కూడా ముఖ్యమే కదా! అందుకే మన మీద మనకి నమ్మకం వుండాలి.

చాల మంది తమ యొక్క జీవితానికి తామే నిర్మాతలమని, తమ యొక్క కృషి కి తామే హీరోలమని, తమ యొక్క జీవిత చిత్రానికి తామే దర్శకులమనే విషయాన్నీ గుర్తించరు. అలాగే తమ శ్రమతో, తమ ప్రేమతో, తమ తపనతో, తమ భవిష్యత్తును మలచుకోగలిగే సత్తా వారికీ వుందని నమ్మరు. ఇలా మన సామర్ధాన్ని మనమే అనుమానిస్తే ఎలా చెప్పండి ఫ్రండ్స్!

మనని మనమే నమ్మకుంటే, ఇతరులు మనని ఎలా నమ్ముతారో చెప్పండి. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కూడా సైకిల్ రిపేరింగ్ నుంచి మొదలుపెట్టిన వారే కదా, కానీ వారి మీద వారికి ఉన్న అచంచలమైన నమ్మకం మరియు వారు అనుకున్న విషయం ఈ ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందో స్పష్టత ఉండడం వల్ల వారు సాధించడం సాధ్యమైంది. వారిలా మన పైన మనం నమ్మకం పెంచుకోడం వలన, అనవసర అనుమానాలు, భయాలు తొలగించుకొని, మనం ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుకోని గొప్ప విజయాలు సాదిన్చగలము. దాని కోసం మనం ఈ నాలుగు విషయాలు అర్ధం చేసుకొని, ఆచరిస్తే చాలు.

ఒకటి.....మీ కోరిక సాధ్యమే అని గుర్తించండి.

ఏదైనా ఒక పని మనం చేయగలమని నమ్మడానికి ముందు, అసలు ఆ పని ఈ ప్రపంచంలో సాధ్యమే అని నమ్మడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఏ విషయం అయితే అనుకుంటున్నారో, మీరు ఏ విషయం అయితే కోరుకుంటున్నారో, మీరు ఏ విషయం కోసం అయితే ఆశపడతున్నారో, ఆ విషయం ఈ ప్రపంచంలో సాధ్యం అనే విషయాన్ని ముందుగా గుర్తించాలి. మీరు కోరుకున్న విషయాన్ని ఇతరులెవరైనా ఇప్పటికే సాధిస్తే, వారిని ఒక రోల్ మోడల్ గా మీరు గుర్తించవచ్చు. మీరు కోరుకున్న దానిని ఒకరు చేయగలిగారు అంటే, మీరు చేయగలుగుతారని అర్ధం. మీరు కోరుకునేది ఇతరులు ఎలా సాధించారు, ప్రస్తుతం ఇతరులు ఎలా సాధిస్తున్నారు, ఇతరులు దీనిని ఎలా సాధించబోతున్నారో అర్ధం చేసుకోవాలి. అలాగే మన పరిస్థితుల కన్నా, మన మనో స్థితి అత్యంత శక్తివంతమైనది అని గుర్తించాలి. ఇప్పుడు ఆ మనో స్థితిని ఎలా వాడుకోవోచ్చో తెలుసుకొందాము.

రెండు.. మీ కోరిక యొక్క ఊహాలోకంలో విహరించండి.

ఫ్రెండ్స్! మన ఊహ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన రహస్యాలు వున్నాయి. అందులో ఒకటి, మీరు కోరుకునేదాన్ని ఇప్పటి వరకు సాధించినట్టు మీరు అనుభూతి చెందడము. మీరు కోరుకున్న దాన్ని, ఇప్పటికే సాధించినట్టు ప్రతి రోజూ కొన్ని నిముషాలు ఊహించడం ద్వార, మీ పై మీ కు నమ్మకం రెట్టింపు అవుతుంది. మీకు తెలియకుండానే మీ లక్ష్యం వైపు మీరు అడుగులు వేస్తూనే ఉంటారు. లక్ష్యానికి దగ్గరగా అవుతూనే ఉంటారు. ఒక్కసారి ఎంతో మార్పును మీరు మీలో చూస్తారు. మీ పనిలో సాహసోపేతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీనికోసం మీరు ఒక విజన్ బోర్డ్ డిజైన్ చేసుకొండి. మీ కోరికలకి సంబంధించిన చిత్రాలని ఆ బోర్డు పై అతికించండి. అలాగే ప్రతి రోజు ఆ బోర్డు చూస్తూ వుంటే ఉహించుకోవడం సులభం అవుతుంది.

మూడు... మీరు ఒక విజేతలా నడుచుకోండి.

ఫ్రండ్స్! మీరు మరో 5 సంవత్సరాలలో ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో చెప్పగలరా? మీరు కోరుకున్న పరిస్థితిలో వుండాలంటే మాత్రం, ఒక విజయవంతమైన మైండ్ సెట్ ని ఏర్పాటు చేసుకోవడము చాల అవసరము. ఆ మైండ్ సెట్ తాయారు చేసుకోడానికి అత్యంత శక్తివంతమైన విధానం ఊహించుకోవడం, ఆ తర్వాత మీరు కోరుకుంటున్న జీవితాన్ని సృష్టించుకున్న వ్యక్తిలా ఇప్పుడే వ్యవహరించండి, అలాగే ప్రవర్తించండి, అలాగే మాట్లాడండి, అలాగే ఆలోచించండి.

అందుకోసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండిలా "నేను కోరుకున్న జీవితాన్ని పొందిన వ్యక్తిగా నేను వుంటే, నేను ఎలా వుంటాను?" ఈ ప్రశ్నను మళ్ళీ మళ్ళీ వేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో మీ స్నేహితులు ఎవరు ఉంటారు? మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? మీరు ఇతరులను ఎలా చూస్తారో, వారితో ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించండి... ఇప్పుడే. ఇలా చేయడం వల్ల మీ సబ్ కాన్షస్ మైండ్ సహాయంతో, సృజనాత్మకత విధానంలో, మీ లక్షాన్ని కావలసిన పనులను చేసే సమర్థవంతమైన వ్యక్తిగా మీరు మారుతారు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు.

నాలుగవది......అడుగు అడుగు ముందుకు వేయండి.

ఎన్ని కోరికలు వున్నా, చాలామంది విజయం పొందకుండా ఉండడానికి కారణం, వారు సరైన యాక్షన్ తీసుకోకపోవడమే. కాబట్టి భౌతిక ఫలితం పొందాలంటే, ఒక భౌతిక చర్య చాలా ముఖ్యం. కాబట్టి మనం ప్రతిరోజూ మన లక్ష్యం వైపు కృషి చేస్తూనే వుండాలి. ఒక్కో అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక పని చేయడం ద్వారా మాత్రమే, మనం దానికి సంబంధించిన ఫలితాలను పొందగలుగుతాము. కాబట్టి ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తూనే ఉండండి. అలా ఈ ప్రయాణాన్ని కొనసాగించడం ద్వార, మనం కోరుకున్న ఫలితాన్ని ఒక రోజు పొందగలుగుతాము. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories