మీ జీవితమనే బస్సుకి డ్రైవర్ ఎవరు?

మీ జీవితమనే బస్సుకి డ్రైవర్ ఎవరు?
x
Highlights

ఫ్రెండ్స్... మీ జీవితమనే బస్సుకి డ్రైవర్ ఎవరు? "నాకు ఎప్పుడు ఆఫీస్ వెళ్ళటం లేటు అవుతూనే వుంటది, మా ఆవిడా నా లంచ్ బాక్స్ రెడీ...

ఫ్రెండ్స్...

మీ జీవితమనే బస్సుకి డ్రైవర్ ఎవరు?

"నాకు ఎప్పుడు ఆఫీస్ వెళ్ళటం లేటు అవుతూనే వుంటది, మా ఆవిడా నా లంచ్ బాక్స్ రెడీ చెయ్యటానికి ఎప్పుడు లేటే",అంటాడు ప్రసాద్.

రోజు పొద్దున్నే మా అత్త నా మూడ్ డిస్టబ్ చేస్తది, అందువల్ల ఎ పని చేసుకోలేక పోతున్న........అంటుంది స్వాతి.

అసలు నా బాస్ కి నాకు ఒక్క నిమిషం పడట్లేదు...వాడికి కొంచం మెంటల్ అనుకుంటా.... అంటాడు జోసెఫ్.

నా ఫ్రండ్స్ అలవాటు చేసిన ఈ సిగెరట్ నన్ను వదిలేట్టు లేదు, ఎంత మానేద్దాం అనుకున్న మానలేకపోతున్నా...అంటాడు అరవింద్.

ఫ్రండ్స్! వీరందరి మాటలు వినడానికి చాలా సహజంగా అనిపించినా, ఇక్కడ దాదాపు అందరూ ఇతరుల వల్ల బాధితులు గా కనబడుతున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి, జీవితంలో ప్రతి ఫలితానికి, వీరి ఫలితాలకు కూడా ఒక కారణం ఉంటుంది. దీన్నే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాము. ఈ ప్రపంచంలో ఏమి జరగిన, ఎ రిజల్ట్ వచ్చిన దానికి మూలం వుంటుంది. మన ప్రస్తుత స్టితికి ఇతరులను కారణంగా చూపెడుతూ, మనం ఒక విక్టిమ్ గా ఫీల్ అయితే, ఇతరులు మన మీద కొంత జాలి చుపవచ్చేమో కాని, మన లైఫ్ లో మాత్రం పెద్ద మార్పు ఏమి రాదు. అందుకే మన జీవితలములోని ఫలితాలకు, మనం బాద్యత తీసుకోవడం నేర్చుకోవాలి. లేకుంటే ఎప్పటికి భాదితులుగానే ఉండిపోతాం. అందుకే మన జీవితమనే బస్సు యొక్క స్టీరింగ్ మన చేతికి తీసుకొని, మనమే డ్రైవర్ గా మారాలి.

ఇలా డ్రైవర్ సీట్లో కూర్చోవడం వల్ల మనకు కావలసిన ఫలితాలకి అనుగుణంగా, ఎ చర్యలు తీసుకుంటే, మన ఫలితాలకి ఏవి కారణం అవుతాయో వాటిమీదే ద్రుష్టి పెట్టి, వాటికీ సంబంధించిన కొన్ని పనులు చేయవచ్చు. అందువల్ల మన పని కారణం అవుతుంది, మనం కోరుకునే పలితాలు వస్తాయి. ఇలా చెయ్యడానికి ఈ నాలుగు విషయాలు మనము అర్ధం చేసుకోవాలి.

మొదటిది..............నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి అని నమ్మాలి.

కొద్దిమందికి వారి జీవితంలో వారికి ఏం కావాలో వారికే క్లారిటీ ఉండదు. ఒక తెగిన గాలిపటంలా, గాలి ఎటు తీసుకు వెళ్తే అటు వెళ్తూనే ఉంటారు, కానీ అలా వెళ్లినప్పుడు వచ్చే ఫలితాలను మాత్రం చూసి నాకు ఇలా ఎందుకు జరుగుతుంది, అంతా నా కర్మ, లేక మరొకరు కారణం అని బాధ పడతారు. కాని నిజంగా మీరు మీ జీవితంలో ఏదైనా మంచి మార్పు రావాలని కోరుకుంటే మాత్రం, మీరు సాకులు చెప్పడం, ఇతరులు మీ పరిస్థితికి కారణం అని అనడం ఆపివేయాలి. మనలో చాలామంది "బాధితులు" అనే పాత్రలోనే ఉండిపోతారు. ప్రతిదానిని మరియు ప్రతి ఒక్కరినీ నిందారోపణ చేస్తుంటారు. కానీ అలా చేస్తే మన జీవితంలో ఎ గొప్పవిషయం జరగదు.

ఇంకా కొద్ది మంది వారు విజయం సాధించినప్పుడు, దానికి వారు కారణం అని, వారు అపజయం సాధించినప్పుడు మాత్రం దానికి ఇతరులు లేదా పరిస్థితుల కారణంగా చూపెడతారు. ఇలా చెయ్యడం ఆపెయ్యాలి. ఎప్పుడైతే మన విజయానికైన, అపజయనికియనికైనా బాద్యత తీసుకోవటం మొదలు పెడతామో, అప్పటినుండి మన జీవిత బస్సుకు మనమే డ్రైవర్ అని ఒప్పుకున్నట్టు. ఇలా చేయడం ద్వారా మనం మన స్వంత పరిస్థితికి బాధ్యత తీసుకునే సౌకర్యవంతమైన మార్గాన్ని పొందుతాము. అలా కాకుండా మన నేపథ్యం, మన తల్లిదండ్రులు, మన ఉపాధ్యాయులు, మన నాయకులు, మన ఆర్థిక వ్యవస్థ మరియు మన సమాజంని ఒక కారణంగా చూపెడితే మాత్రం, ఎప్పటికి విజయాన్ని అందుకోలేము. అందుకే నా జీవితానికి నేనే భాద్యున్ని అని నమ్మాలి. అలాగే మీరు మీ జీవితంతో ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు అంకితభావంతో ఉండండి.

రెండవది...........నా లక్ష్యాల సాధనకు నేనే మూలకారణం అని నమ్మాలి.

మనకి ఎన్నో కోరికలు ఉండవచ్చు, ఎన్నో ఆశలు ఉండవచ్చు. కాని వాటి గురించి మనము ఏదో ఒక చర్య చేపట్టకుండా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, అన్నట్టు వుంటే మాత్రం... మన పరిస్థితుల్లో ఎలాంటి మార్పురాదు. మన కోరికలను సాదించడానికి కృషి చేయకుండా, ఏవో సాకులు చెపుతూ వెళితే మాత్రం, కోరకలు ఎప్పటికి కోరికల్లాగానే ఉండిపోతాయి. పగటి కలలు మాత్రమే కనే పాపయ్య లా వుండిపోతాము. అలా కాకుండా వుండాలంటే, మన కోరకలను ఒక టైం లిమిట్ లోపల సాదించాలి అంటే, మన కోరికలను లక్ష్యంగా మార్చుకొని, ఆ లక్షాన్ని సాదించడానికి ఒక ప్రణాళిక వేసుకొని, రోజు మనమే ఆ లక్ష్య సాధనలో కృషి చేయాలి. అలా కాకుండా మనకి సహాయం కోసం, మన లక్ష్యాలకి సపోర్ట్ గా, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూస్తూ కూర్చుంటే మాత్రం...కూర్చొని కూర్చొని..కొవ్వు పెరుగుతుంది తప్ప..ఫలితాలు రావు. మనం చెయ్యంది ఏ పని కూడా కాదు అని నమ్మి, మన లక్ష్యం నేరవేరటానికి మనమే మూలా కారణం అని నమ్మి ఒక్కో అడుగు ముందికి వెయ్యాలి. .

మూడవది..........ఫలితాలనిచ్చే కారణాలు ఏంటో వెతకాలి.

ప్రతి ఫలితానికి ఒక కారణం ఉన్నట్టు మనం ముందుగానే అనుకున్నాము. భవిషత్తులో మీకు మామిడి పండ్లు కావాలంటే, మీరు ఈ రోజు మామిడి విత్తనం భూమిలో విత్తనంగా పెడితేనే, ఒక రోజు ఆ మామిడి పండ్లు తినగలరు. ఆపిల్ విత్తనం పెట్టి మామిడి పండ్లు రావాలంటే రావు కదా.. అలాగే మన లక్ష్యాలు సాధించాలి అంటే, ఆ లక్ష్య సాధనలో భాగంగా మనం ఎ చర్యలను విత్తనాలుగా పెట్టాలో ముందుగా మనం గుర్తించాలి. అలా గుర్తించిన తరవాత రోజువారిగా, నెలవారిగా ఎన్నో ఫలితాలు, ఆ లక్షసాధనలో బాగంగా మన పొందాల్సివుంటుంది. ఎలాగైతే మామిడి విత్తనం ఒక రోజు మొక్కగా వస్తుందో, మరోకొన్ని రోజులకి ఆ చెట్టుకు పూత వస్తుందో...అలాగే మన ఈ మద్యలో వచ్చే పలితాలు కూడా. అయితే ఈ ఫలితాలు రావాలంటే ఎ చర్యలను కారణాలుగా తీసుకోవాలో మాత్రం ముందుగా మనం గుర్తించాలి. అప్పడే మనం కోరుకునే ఫలితాలకు సంబందించిన చర్యలు మన చేతిలో వుంటాయి.

నాలుగవది, చివరిది............. ప్రతిరోజు బాధ్యతతో ఒక్కో అడుగు ముందుకు వేయ్యాలి.

"వెయ్యి మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది అంటారు" ! అలా ప్రతి రోజు మన లక్ష్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళాలి. అయితే మన లక్ష్య సాధనలో భాగంగా ఏలాంటి ప్రయోగం చేయ్యడానికైన సిద్దంగా వుండాలి. ఇలా నిరంతర ప్రయోగానికి మీ జీవితమే ప్రయోగశాలగా ఉంటుందని భావించాలి. ఒక్కో నీటి చుక్క, చుక్క కలిస్తేనే ఒక సముద్రమైనట్టు, మీ ఈ రోజువారీ ప్రయాణం విజయాల కోటకి మిమ్మలి చేరుస్తుంది. ఇలా మీ జీవితాన్ని ఎంతో సరదాగా మరియు ఆనందదాయకంగా చేయగల శక్తి మీ లక్ష్యానికి, దాని వైపు వేసే ప్రతి అడుగుకి మాత్రమే వుంది.

ఫ్రండ్స్ ఈ నాలుగు విషయాలు మీరు ఆచరణలో పెట్టడం ద్వార ....భాదితుల లిస్టు నుండి బాద్యత తీసుకునే వారి లిస్టు లోకి మీరు వెళతారు, అంటే మీరు మీ అపజయాలకు సాకులు వెతుక్కోకుండా, మీ విజయాలతో కాసులు వెతుకుతూ..పసిడి పంట పండిచుకోనే స్థితిలో...పరిస్థితిలో..ఉన్నత స్థితిలో ఉంటారని అర్ధం. ఇలా బాద్యత తీసుకోవడం వల్ల ప్రసాద్, స్వాతి మరియు మిగిలిన వారు, తమ జీవిత బస్సుకి, తామే డ్రైవర్లు గా మారి వారికి నచ్చే గమ్యాన్ని చేరారు. కాబట్టి మీరు కూడా మీ గమ్యాన్ని ఇలా చేరవచ్చు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories