ఆనందంగా ఉండడానికి "ఆరు పద్ధతులు".

ఆనందంగా ఉండడానికి ఆరు పద్ధతులు.
x
Highlights

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం…....ఆనందంగా ఉండడానికి "ఆరు పద్ధతులు". ఫ్రెండ్స్! ఆనందం అనేది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? ఆనందం మీరు...

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం…....ఆనందంగా ఉండడానికి "ఆరు పద్ధతులు".

ఫ్రెండ్స్! ఆనందం అనేది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? ఆనందం మీరు కోరుకునే వస్తువులో ఉంటుందా? ఆనందం మీరు తినే రుచికరమైన ఆహారంలో ఉంటుందా? ఆనందం మీరు ఇష్టపడే వ్యక్తిలో ఉంటుందా? లేదా ఆనందం మీరు సాధించే విజయంలో ఉంటుందా? అసలు ఆనందం ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా?

కొద్ది మంది అనుకుంటారు....వారు అనుకున్నది వారు సాధించినప్పుడు వారు ఆనందం పొందుతారని, ఇలా వారు సక్సెస్ అయినప్పుడే మాత్రమే ఆనందం వస్తుంది అని వారు నమ్ముతారు. అయితే నిజంగా ఆనందానికి, మన విజయానికి అసలు దగ్గరి సంబంధం వుందా అని చూస్తే... ఎంతో మంది పెద్దలు చెప్పేది...........అసలు మనం ఆనందంగా ఉండటానికి, మన విజయానికి సంబంధం లేదనే చెపుతారు. ఉదాహరణకి మీరు చిన్న పిల్లలని చూస్తే.. వారు ఎలాంటి కోరికలు, లక్ష్యాలు లేకున్నా కూడా ఆనందంగానే వుంటారు కదా, ఒక బోసినవ్వుల పాపాయిని చూస్తే ఎవరి మోహంలోనైన చిరునవ్వు చిగురించాల్సిందే కాదా! మరి ఆ నవ్వుకి మూలం విజయమా అని ఆలోచిస్తే.... కాదు అనే సమాధానం వస్తుంది కదా!

కాబట్టి మనము ఆనందముగా ఉండటానికి పెద్ద పెద్ద విషయాలు, విజయాలు అవసరం లేదు. అనంతమైన ఆస్తిపాస్తులు అవసరం లేదు. మన చుట్టూ భౌతిక సుఖాలు అంతగా అవసరం లేదు. వాస్తవానికి చాల సార్లు జీవితంలోని, చిన్న చిన్న విషయాలు కూడా ఎన్నో సందర్భాల్లో మనకి ఆనందం ఇస్తాయి. ముఖ్యంగా ప్రకృతికి దగ్గరగా వుండేవారు, ప్రకృతిని ఆరాధిస్తూ వుండేవారు, ప్రకృతి సంబంధించిన ఎరుకతో ఎవరైతే ఉంటారో, వారు చాలావరకు మనకి ఆనందంగా కనబడుతుంటారు. ఎందుకంటే వారికి తెలుసు వారి జీవితం ఒక వరం అని, వారికి తెలుసు ప్రతిరోజు తమ జీవితంలో ఒక మంచి బహుమానం అని, వారికి తెలుసు ప్రతిరోజు మలచుకుంటే ఒక మధురమైన రోజుగా మారుతుంది అని, వారికీ తెలుసు వారి జీవితంలో జరిగే విషయాలకన్నా, దాని గురించిన వీరి ప్రతిస్పందనే ముఖ్యమని... కాబట్టి వారు ప్రతి సందర్భంలోనూ ఆనందాన్ని అందిపుచ్చుకోగలరు. అలా మనం ఆనందం పెంచుకోవాలి అనుకుంటే ఒక ఆరు విషయాలు ముందుగా మనం అర్ధం చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం...

మొదటిది...........బంధాలను పెంచుకోండి: ఒక వ్యక్తి ఒంటరిగా ఉండటానికి, నలుగురితో కలిసిమెలిసి ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరైతే ఒంటరిగా ఉంటారో అలాంటి వాళ్ళు త్వరగా డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుందని చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. అయితే నలుగురితో సులువుగా కలిసిపోయేవారు, నలుగురితో వారి అభిప్రాయాలను పంచుకునే వారు ఎక్కువగా సంతోషంగా ఉన్నట్లు అవే పరిశోధనలలో తెలుస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే.... మనిషి సహజంగానే సంఘజీవి, అలా ఒక వ్యక్తి తన అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవాలని కోరుకుంటాడు, తన ఆలోచనలని, తన ఫీలింగ్స్ ని వినడానికి నలుగురు ఉన్నారు అని ఆ వ్యక్తి ఫీల్ అయినప్పుడు చాల తృప్తిగా వుంటాడు, దానితో పాటు ఆనందంగా కూడా ఉండగలడు, కాబట్టి మన ఒంటరితనాన్ని వదిలి పెట్టి, నలుగురిని పరిచయం చేసుకొని, అందులో కొద్దిమందిని మన మిత్రులుగా మలచుకొంటె మాత్రం... సంతోషం మన సొంతం అవుతుంది.

రెండవది..........ఇవ్వటం నేర్చుకోండి: "గివింగ్... ఈజ్ రిసీవింగ్" అని ఇంగ్లీష్ లో కొద్దిమంది అంటారు. మన రోజువారీ జీవితంలో ఇవ్వటము పుచ్చుకోవడం చాల సహజమే, అయితే మనం పుచ్చుకోవడం మీద ద్రుష్టి పెట్టకుండా ఇతరులకు మన వద్ద ఉన్నదాన్ని ఇవ్వటం గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందం ఎదుటి వారి కళ్ళ నుండి మన రోజువారి జీవితంలోకి కూడా వస్తుంది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది, అది ఏది అయిన....పర్వాలేదు, ఒక స్మైల్ అయినా పర్వాలేదు, ఒక సహాయం అయిన పర్వాలేదు, ఒక ప్రశంశ అయిన పర్వాలేదు...ఇలా మనం ఇతరులకు ఇవ్వగలిగినది ఏదైనా పర్వాలేదు...అది ఇతరులకు ఇవ్వటం ద్వార మీకు గొప్ప సంతోషాన్ని ఇస్తుందని అంటారు. అయితే అలా ఇవ్వడం ద్వారా మీకు సహజంగానే ఇది ఒక అలవాటుగా మారుతుంది...మీ ఆనందాన్ని, ఇతరులతో బంధాన్ని ఇది బలోపేతం చేస్తుంది.

మూడవది..........ప్రశంసించడం ప్రారంభించండి: మీరు ఇతరుల లో ఏ మంచి విషయాన్ని చూసినా కూడా వెంబడే వారిని ప్రశంసించండి. ఎందుకంటే ప్రశంశ సరైన సమయంలో సరైన విధంగా ఇస్తే అది ఎదుటి వ్యక్తికి మీరు ఇచ్చే ఒక మంచి బహుమానం లాంటిది. అలాగే ఒక మంచి పని చేసిన వ్యక్తిని ప్రశంశిచడం వలన ఆ వ్యక్తి అలాంటి పనులు భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, మీ యొక్క ప్రశంస వల్ల, మంచి పనులు ఈ సమాజంలో పెరుగుతాయని గుర్తించండి. అలాగే మీ ప్రశంశ వలన అందరికీ సంతోషాన్ని పంచిన వారు, సంతోషాన్ని పెంచిన వారు మీరు అవుతారు.

నాలుగవది............అంగీకరించడం: మన జీవితంలో లో రకరకాల సందర్భాలు వస్తువుంటాయి, అలానే ఎన్నో సంఘటనలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మనకి నచ్చవచ్చు, మరి కొన్ని మనకి నచ్చకపోవచ్చు. అయితే అందులో కొన్నింటిని మనం మార్చవచ్చు, కొన్నింటిని మార్చలేక పోవచ్చు, ఈ వ్యత్యాసం గుర్తించి, మనం మార్చలేము అనే వాటిని అంగీకరించడం వలన మనలోని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే ఒత్తిడి, అంత సంఘర్షణ తగ్గుతుందో, అప్పుడు మనలో సంతోషంపాలు కూడా మెరుగవుతుంది.

ఐదవది......కృతజ్ఞతతో వుండటం: మన జీవితలో జరిగే అన్ని విషయాలకి కృతజ్ఞతతో వుండటం వలన, మనకి సహాయం చేసిన వ్యక్తులను ఎప్పుడు మరచిపోకపోవడం వలన కూడా మన సంతోషాన్ని కాపాడుకోవచ్చు.

ఆరవది...........ప్రకృతికి దగ్గరగా వుండటం: చివరిగా ఎవరైతే ప్రకృతికి దగ్గరగా ఉంటున్నారో, ఎవరైతే సహజమైన జీవన శైలిని కలిగి ఉంటున్నారో వారు కూడా చాల సంతోషంగా జీవిస్తున్నారని కొన్ని పరిశోధనల్లో తేలింది. కాబట్టి సూర్యోదయం, సూర్యస్తమము, తొలకరి వాన, ఆకుపచ్చని ప్రదేశాల్లో నడవటం ఇలా వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా వుండండి ఆనందాన్ని సొంతం చేసుకోండి.

ఫ్రెండ్స్! ఇప్పటివరకు మనం చర్చించిన అంశాలను మీరు ఆచరణలో పెట్టడం ద్వార మీ సంతోషాన్ని మీరు రెట్టింపు చేసుకోగలరు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories