"పట్టుదలతో ఒక పట్టు పట్టాలి"

పట్టుదలతో ఒక పట్టు పట్టాలి
x
Highlights

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం... "పట్టుదలతో ఒక పట్టు పట్టాలి". ఎన్టీఆర్ నటించిన 'అడవిరాముడు' సినిమాలో వేటూరి గారు రాసిన ''మనిషై...

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం... "పట్టుదలతో ఒక పట్టు పట్టాలి".

ఎన్టీఆర్ నటించిన 'అడవిరాముడు' సినిమాలో వేటూరి గారు రాసిన ''మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ...పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి వుంటే మనుషులు ఋషులౌతారు. మహాపురుషులౌతారు..అనే పాట మనిషి పట్టుదల గురుంచి చాలా బాగా చెపుతుంది. అయితే అసలు ఈ పట్టుదల అంటే ఏమిటి అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా ఫ్రెండ్స్!

అలాగే మనకు ఈ పట్టుదల ఎక్కడ కావలి, ఎప్పుడు కావాలి అని ఆలోచిస్తే, 'ఎలాంటి ఆటంకాలూ అపజయాలూ మనకు ఎదురైనా సరే, ఒక లక్ష్యం అనుకున్నప్పుడు, దాన్నే స్థిరంగా అంటిపెట్టుకుని ఉండడం అని అర్ధం అవుతుంది. అలాగే మనం చేస్తున్న ప్రయత్నాన్ని వదులుకోకుండా, మన మనస్సును పూర్తిగా ఆ పని మీదే లగ్నం చేస్తూ, మన కృషిని స్థిరంగా పెంచుతూ... ఎలాంటి స్థితిలోనైన మల్లి మల్లి ప్రయత్నిస్తూ ఉండడం' అని మనకు అర్థం అవుతుంది.

ఈ పట్టుదల అనే మాట ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక దృడనిశ్చయంతో ముందుకు కొనసాగడాన్ని, ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా దృడంగా ఉండడాన్ని సూచిస్తుంది. పట్టుదలలో ముఖ్యమైన విషయమేమిటంటే.. మన విజయ సాధనలో భాగంగా, కొన్ని అనివార్యమైన వైఫల్యాలను కూడా అంగీకరించి, క్లిష్టమైన పరిస్థితులను మన విజయంలో ఒక భాగంగా అంగీకరించి ముందుకు వెళ్ళటమే.

అలాగే పరాజయాలు ఎదురైనప్పుడు పట్టుదల గల వ్యక్తిగా తన ప్రయత్నాలను 'వదిలిపెట్టే' బదులు... పడిలేచే కెరటంలా...లేస్తాడు, అలాగే రెండు రెక్కలతోనే ఆకాశాన్ని జయించే పక్షిలా 'తిరిగి లేవటం.. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ వుంటాడు. తన లక్ష్య సాధనలో ప్రతి అడుగు ముఖ్యమనే నమ్ముతాడు.

కానీ చాలామంది, తమకు ఎదురుకాగల క్లిష్టమైన పరిస్థితులకూ, పరాజయాలకూ మానసికంగా సిద్ధపడరు. ఎప్పుడైతే వారు సిద్దంగా లేరో , ఎ చిన్న కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన, అడ్డంకు వచ్చిన చేస్తున్న పనిలో ఓటమిగా బావిస్తారు. వాళ్ళు ఇలా ఒక పనిని పట్టువిడువకుండా చేయాలన్న కోరికను పెంచుకోనందువల్ల, తమ లక్ష్యాన్ని త్వరగా వదిలిపెట్టేస్తారు. ఎప్పుడైనా తమ ప్రయత్నంలో వారు విఫలం అయితే..తమపై తాము జాలిపడుతూ, అంత తమ కర్మ అని, తాము దేనికి పనికిరామని వారిని వారె నిందించుకుంటారు, లేదా వారి సమస్యలకి కారణం అని ఇతరులను లేదా ప్రతి ఒక్కరినీ నిందిస్తూ, కోపంగా ఉంటారు, అలాగే మెల్లిగా వారి లక్ష్యాన్ని వదులుకుంటారు. వారు వున్నా పరిస్థితుల్లో వారి లక్ష్యం సాదించలేరు అని నిర్ణయించుకుంటారు. ఇలా చెయ్యటం వలన ఎవ్వరు విజేతలు కాలేరు అని మీరు గుర్తించండి. కాబట్టి పట్టుదల పెంచుకోవాలంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్ధము.

ఎలాగైతే ప్రతి సుర్యోదయం ముందు చీకటి రాత్రి ఉంటుందో, అలాగే ప్రతి విజయం ముందు కొన్ని సమస్యలు ఉంటాయని గుర్తించాలి. అలాగే సమస్యలను ఎదుర్కోవడానికి ఒక కారణం ఉంటుంది అని నమ్మాలి, మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మిమ్మలి బలోపేతం చేస్తుంది అని గ్రహించాలి... అలాగే మనం ప్రతికూల పరిస్థితిలో ఉండడానికి కూడా కొంత విలువ ఉంది అన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఏమిటా విలువ అని మనం అలోచిస్తే వైఫల్యం విధి లిఖితమూ కాదు, పరాజయం శాశ్వతమూ కాదు అని మనం గ్రహిస్తాము. ఈ విషయంలో లోతైన అవగాహనను పొందుతాము, ఇంకా మానసికంగా సిద్ధమౌతాము అని తెలుసుకోవాలి.

ఒక్కోసారి పరిస్థితి తిరగబడిన తర్వాత, మళ్ళీ ఆ పనిచేయలనిపిస్తేనే అంత సులభం కాదు అని ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సవాళ్ళు మనం అన్ని విధాలా ప్రయత్నం చేసినా అధిగమించలేమన్నట్లు అనిపించవచ్చు. మనం గమ్యానికి దగ్గరయ్యే బదులు మరింత దూరమవుతున్నట్లు అనిపించవచ్చు. మనం నిస్సహాయులమనీ, చేతకానివాళ్ళమనీ అనిపించవచ్చు, నిరుత్సాహం చెందవచ్చు, చివరికి మానసికంగా కృంగిపోవచ్చు కూడా. అందుకోసమే మనం మన గమ్యంలో పట్టుదలగా ఉండడానికి మొదటి మెట్టు ఏంటంటే, మనకి ఉపయోగపడే, మనకు సరైన, మనం చేరుకోగల లక్ష్యాన్ని మాత్రమే పెట్టుకోవాలి.

మనం ఏ లక్ష్యలను ఎందుకు సాధించాలనుకుంటున్నాం అన్న విషయం మనస్సులో స్పష్టంగా ఉండడం ప్రాముఖ్యం. మన చివరి లక్ష్యం ఏమిటన్నది మన మనస్సులో స్థిరంగా ఉంటే, మనం దాన్ని వదిలిపెట్టడానికి చాలా తక్కువగా మ్రొగ్గు చూపుతాం. కనుక, పరిస్థితులు తిరగబడినప్పుడు, వాటిని అనుకూల దృక్కోణంతో చూస్తూ, ఇలా జరిగినప్పుడు అనుభవాన్ని గడిస్తున్నట్లుగా భావించేందుకు, మన శాయశక్తులా ప్రయత్నించాలి. అలాగే మనం సమస్యగా భావిస్తున్న విషయాన్నీ, అలాగే అప్పటి పరిస్థితిని విశ్లేషించాలి, మెరుగైన దారులు ఏంటో అన్వేషించాలి, మన ఆలోచనలకు ఈ సమయంలోనే పదును పెట్టాలి, అలాగే.. మీరు ఎక్కడ తప్పటడుగు వేశారో గ్రహించి, ఆ తప్పును సరిదిద్దుకోండి, ఆ తప్పు మల్లి జరగకుండా చూసుకోవాలి లేదా ఏదైనా బలహీనతలు వుంటే, ఆ బలహీనతను అధిగమించండి. ఇలా ఒక్కో అడుగు వేస్తూ, మనం చర్చించిన అంశాలని ఆచరణలో పెడుతూ వెళ్ళటం ద్వార మనలో పట్టుదని పెంచుకోవచ్చు. అలా పెంచుకున్న పట్టుదలతో ఎన్నో విజయాలు మీ సొంతం చేసుకోవచ్చు...అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories