మనోశాంతే మహా ప్రసాదం!

మనోశాంతే మహా ప్రసాదం!
x
Highlights

మనో శాంతి మనకి చాల ముఖ్యము, మనో శాంతి అంటే మానసికంగా, మరియు మన బావవేశాలలో ఒక ప్రశాంత స్థితిని కలిగివుండటం, ఎలాంటి అనవసర ఒత్తిడి తీసుకోకుండా, మన...

మనో శాంతి మనకి చాల ముఖ్యము, మనో శాంతి అంటే మానసికంగా, మరియు మన బావవేశాలలో ఒక ప్రశాంత స్థితిని కలిగివుండటం, ఎలాంటి అనవసర ఒత్తిడి తీసుకోకుండా, మన మనసుని, మన బావాలని ప్రశాంతంగా ఉంచుతూ, మన చేతిలోని పని మీద పూర్తి ఏకాగ్రతతో, సృజనాత్మకతతో చెయగలటం, ఎలాంటి ఆందోళనకి, భయానికి గురికాకుండా మనము కోరుకున్న మానసిక, శారీరక స్తితిని పొందటం.

మీ మనస్సు శాంతితో ఉన్నప్పుడు, మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, అందరు మీ గురించి ఏమి మాట్లాడుకుంటున్నారు అనే దానిపై, చిన్న చిన్న విషయాలపై మీరు అంతగా ప్రభావితం కారు, మీకు సంబదించిన విషయాలలో, మీరు ఒక అబిప్రాయంలో వుండి ప్రశాంతంగా పని చేసుకోగలరు. అలాగే బయటి సంఘటనల కారణంగా, పరిస్తితిల కారణంగా అనవసరంగా ఇబ్బందులుపడరు. అలాగే మనో శాంతిని పెంచుకుంటే మాత్రం అనవసారంగా సహనం కోల్పోము, మరియు మనలో కావాల్సిన సహన శక్తి పెరుగుతుంది, అలాగే మన అంతర్గత బలం అయిన మన అంతర్గత శక్తిను గుర్తించగలం మరియు అంతర్గత ఆనందం కుడా పెరుగుతుంది.

ఎప్పుడైతే మనం మన మనో శాంతి గురించి అలోచిస్తామో, ఎప్పుడైతే దాని గురించి కృషి చేస్తామో, అప్పటి నుండి మనో శాంతి పెరగటం మొదలవుతుంది. అలాగే మన అంతర్గత మనో శాంతి చివరకు, బాహ్య శాంతికి దారితీస్తుంది. మీ లోపలి ప్రపంచంలో శాంతి సృష్టించడం ద్వారా, మీ మనస్సులోని శాంతిని, మీరు మీ బాహ్య ప్రపంచంలోకి మరియు ఇతర వ్యక్తులైన మీ కుటుంభ సబ్యుల, మిత్రుల జీవితాల్లోకి కూడా ప్రశాంతతని, ఆనందాన్ని తీసుకురాగలరు. ఈ ప్రశాంతత మరియు శాంతి స్థితిని సాధించడానికి మనము కొన్ని పనులు చెయ్యవలసి వుంటుంది.

మొదటిది........ అంగీకారం, అంటే మన మనస్సు యొక్క శాంతి కోసం కొన్ని విషయాలని మనము అంగీకరించడము అత్యంత కీలకమైన అంశం.

ముందుగా జీవితములో అనిశ్చితి అనేది ఒక భాగము అర్థం చేసుకోవాలి మరియు మనము దాన్ని అంగీకరించాలి. మనము మన చుట్టుపక్కల జరిగే ఎన్నో విషయాలని నియంత్రించలేము, అలాగే మన జీవితంలో కూడా కొన్ని విషయాలు పూర్తిగా మన చేతులోవుండవు, కాబట్టి ఈ విషయాన్నీ మార్చగలం, ఈ విషయాన్నీ మార్చాలేమో, అలాగే వాటి మధ్య భేదం గుర్తించడం అవసరం. అలా గుర్తించడం వలన మనో శాంతికి మొదటి మెట్టు మనం ఎక్కినట్టే.

రెండవది...... రోజుకి కనీసం ఐదు నిమిషాలైన మెడిటేషన్ లేదా ద్యానం చేసుకోవడం చాల ఉపయోగకరం. మీకు తెలిసిన ఎ ధ్యాన పద్దతిలో నైన కూడా మీరు సాధన చేయవచ్చు. ఒక వేళా మీకు ఇప్పటికి ఎలాంటి ద్యాన పద్దతులు తెలియకుంటే మీ శ్వాస పైన ద్యాస పెట్టడం ద్వార కూడా ఒక రకమైన ప్రశాంతతని మీరు పొందవచ్చు.

మూడవది..... మీ మనో శాంతిని మించిన ఆస్థి, సంపద ఏది లేదని గుర్తించండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా వుంటారో అప్పుడు మీరు చాల సృజనాత్మకంగా ఆలోచించగలరు. అలాగే ఎ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరించగలరు.

నాలుగవది..... మీ హృదయాన్ని వినండి. మీ జీవితంలో ఎన్నో సందర్బాలలో ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో మన లోపలినుండి ఒక ఆలోచనల వస్తుంది. దానిని విని ఆచరించడం వలన కూడా మనం ఏంటో ప్రశాంతతని పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలను ఆచరణలో పెట్టడం ద్వార మనో శాంతిని మీరు పొందవచ్చు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories