Top
logo

మన బాధ్యతే, మన బలం

మన బాధ్యతే, మన బలం
Highlights

దైనందిన విషయాల పట్ల బాధ్యతా తో మెలగడం చాలా ముఖ్యం. మన బాధ్యతలే మన బలం. ఎందుకంటే బాధ్యతలు నెరవేర్చుకునే క్రమంలో మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. బాధ్యతల గురించి వివరించే కథనం ఇది.

ఒక పోలీస్ స్టేషన్ లాకప్ సెల్ లో వున్న తన భర్త హరిచంద్రను కలవడానికి బార్య సావిత్రి వచ్చి... భర్తను భాదపడుతూ అడిగింది.... మిమ్మల్ని ఎందుకు ఈ పోలీసులు అరెస్టు చేశారండి?

అప్పుడు భర్త.... వాళ్ళు నాకు ఒక టెస్టు పెట్టారు.. ఆ టెస్టులో నేను పాసయ్యాను. దానికి నన్నుఅరెస్టు చేశారు అన్నాడు.

భార్య : ఎంత అన్యాయం... టెస్టు పాసైతే అరెస్టు చేశారా?

భర్త: అవును అన్నాడు అమాయకంగా!

భార్య: ఇంతకీ ఏం టెస్టు పెట్టారండి అని అడిగింది.

భర్త: ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అటా అన్నాడు.

అంతే భార్య......శోకం...నుండి షాక్కి గురి అయ్యింది.

ఈ భర్త లాగానే చాలామంది వారి జీవితంలో జరిగే విషయాలకు, ఫలితాలకు లేదా వారి ముఖ్య విషయాలకు కూడా బాధ్యత తీసుకోకుండా, ఎదుటి వ్యక్తి నే ఆ ఫలితానికి భాద్యులను చేసే వారు మన సమాజంలో చాలామంది ఉంటారు. వాళ్ళ జీవితంలో జరిగిన ఏ సంఘటన అయిన...మంచి ఫలితాన్ని ఇచ్చేది అయితే..వారి గొప్పగా, అదే చెడు ఫలితం వస్తే మాత్రం దానికి వారి భాద్యత లేనట్టు, మొత్తం బాద్యత అంత ఇతరులదే అన్నట్టు తప్పించుకు తిరుగుతారు. కాని ఇలాంటి ధోరణి ప్రదర్శించే వాళ్ళు జీవితంలో ఎక్కువ విజయాల్ని పొందలేరు. ఈ విషయాన్నీ ఇప్పుడు ఒక కథ ద్వార అర్ధం చేసుకుందాము.

ఒక రోజు ఒక కంపెనీలో పని చేసే ఉద్యోగులందరూ తమ కార్యాలయానికి చేరుకాగానే.. అక్కడ ఆ ఆఫీసు తలుపు మీద ఒక పెద్ద నోటీసు చూశారు. . .

దానిలో...'నిన్న ఉదయం, ఈ సంస్థలో మీ వృద్ధికి ఆటంకం కలిగిస్తున్న, వ్యక్తి కన్నుమూశారు. మీటింగ్ గదిలో అంత్యక్రియలకు చేయాలని నిర్ణయించాము. మేము మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాము. అని వుంది.

ఉద్యోగులందరు....తమ సహోద్యోగులలో ఒకరు మరణించినందుకు కొంచం విచారంగా మారారు, కాని సమయం తర్వాత, వారు తమ యొక్క, తమ సంస్థ యొక్క పెరుగుదలకు ఆటంకం కలిగించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది. వెంబడే... అందరు ఆ మీటింగ్ గది వైపు వెళ్లారు....

అందరూ మనస్సులో 'నా పురోగతికి ఆటంకం కలిగించే ఈ వ్యక్తి ఎవరు?'

అనుకుంటూ..అక్కడ వున్నా శవపేటికకు దగ్గరయ్యారు, వారు దానిని తెరిచి లోపల చూసినప్పుడు, వారు అకస్మాత్తుగా.... ఎలాంటి మాటలు లేకుండా పోయారు... ఎందుకంటే....శవపేటిక లోపల ఒక అద్దం ఉంది, దాని లోపల చూసే ప్రతి ఒక్కరూ తమను తాము చూడగలిగారు! అద్దం పక్కన ఒక నోటీసు కూడా ఉంది. అందులో ' ఈ ప్రపంచంలో మీ పెరుగుదలకు పరిమితులు నిర్ణయించగల సామర్థ్యం ఉన్న ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు, ఆ వ్యక్తి మీరే!' అని వుంది. ఫ్రెండ్స్... నిజమే కదా..మన జీవితంలోని అన్ని ఫలితాలకి మనం భాద్యత తీసుకున్నప్పుడే మనం విజేతగా నిలుస్తాము. అల్ ది బెస్ట్.
లైవ్ టీవి


Share it
Top