మీ విలువని ఎప్పుడు తగ్గించుకోకండి

మీ విలువని ఎప్పుడు తగ్గించుకోకండి
x
Highlights

తన ఇంట్లోకి చొరబడే ప్రయత్నంలో ఉన్న ఒక దొంగని చూసి కాంతమ్మ వాడిని ఒక కట్టే తో చితక్కొట్టేసింది.... ఆపై 100 కి ఫోన్ చేసి పోలీసులను పిలిచింది. ...

తన ఇంట్లోకి చొరబడే ప్రయత్నంలో ఉన్న ఒక దొంగని చూసి కాంతమ్మ వాడిని ఒక కట్టే తో చితక్కొట్టేసింది....

ఆపై 100 కి ఫోన్ చేసి పోలీసులను పిలిచింది.

అప్పుడా పోలీస్ ఆఫీసర్...'వెరీ గుడ్‌ కాంతమ్మ గారు! మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను అని పొగిడాడు.

ఆ తర్వాత అదే ఆఫీసర్ మెల్లిగా..... "కానీ మీరు ఆ దొంగని మరీ అంతలా కొట్టకుండా ఉండాల్సింది" అన్నాడు.

అప్పుడు కాంతమ్మ నింపాదిగా...'అబ్బే నిజంగా అలా కొట్టాలనుకోలేదండీ! "మా గేటు దూకి ఇంట్లోకి వస్తున్న ఆ మనిషిని చూసి, మా ఆయనే అనుకున్నాను. అందుకే నా పద్దతిలో చితక బాధాను" అంటూ సిగ్గు పడింది.

ఇది ఒక జోక్ అయిన కూడా, నిజ జీవితంలోని కొన్ని బంధాలలో ఎదుటి వ్యక్తిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఆ బంధం బార్యభర్తలది అయిఉండవచ్చు, లేదా బాస్ సబార్డినేట్ అయివుండవచ్చు లేదా కొన్ని సందర్బాలలో స్నేహితులు కూడా అయి ఉండవచ్చు. ఇలా మనని ఎవరైనా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటే మాత్రం, మనం మన ఆత్మ గౌరవాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తితో మీకు ఎ విషయం ఓకే, ఎ విషయం ఓకే కాదో స్పష్టంగా చెప్పాలి. అలా మల్లి మల్లి చెప్పి మీ స్పష్టతని ఎదుటి వ్యక్తికి అందించాలి. ఇలాంటి ఒక మెకానిక్ కథే ఇప్పుడు చూద్దాము.

ఒక వ్యక్తి కార్ స్టార్ట్ అవ్వట్లేదు.... చివరకు ఆ కారు యజమాని కార్ రీపైర్ చేసే ఒక మెకానిక్ తీసుకువచ్చారు. అతను ఒక యువకుడు. అతను తన వద్ద ఒక పెద్ద బ్యాగ్ టూల్స్ తీసుకువచ్చినాడు, అతను వెంటనే పని మొదలెట్టాడు. అతను

ఇంజిన్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించాడు, పై నుండి క్రిందికి. అతను ఏమి చేయాలో తనకు తెలుస్తుందని ఆశతో. తన సంచిలోని ఒక సుత్తి బయటకు తీశాడు, ఆ తర్వాత అతను మెల్లగా ఏదో కొట్టాడు. తక్షణమే, ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. ఎంత డబ్బులు అని అడిగాడు కారు యజమాని. ఐదు వందలు అన్నాడు.

"ఏమిటి?" యజమాని ఆశ్చర్యపోయారు. "అతను ఏమీ చేయలేదు కదా... అనుకుంటూ...

"దయచేసి మాకు బిల్లు.దేనికేంతో బిల్లు ఇవ్వండి అన్నడు "

మేకానిక్ ఈ బిల్లును పంపాడు:

సుత్తితో కొట్టినదుకు ...................... రూ . / - 10

ఎక్కడ కొట్టాలో తెలుసుకోవడం ......................... రూ 490

అలా స్పష్టంగా తమ విలువ ఎంతో ఆ మెకానిక్ చెప్పాడు.

మీరు కూడా మీ విలువని, ఆత్మ గౌరవాన్ని ఎప్పుడు తగ్గించుకోకండి. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories