ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రోలింగ్.

ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రోలింగ్.
x
Highlights

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రోలింగ్. ఫ్రెండ్స్ ఇంటర్నెట్లో ట్రోలింగ్ అనే పదం మీరు విని ఉండి ఉండొచ్చు....

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రోలింగ్.

ఫ్రెండ్స్ ఇంటర్నెట్లో ట్రోలింగ్ అనే పదం మీరు విని ఉండి ఉండొచ్చు. మీరు ఎక్కువగా ఇంటర్నెట్ వాడే వారు అయితే, ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఆన్లైన్ కమ్యూనిటీలలో బాగా పాల్గొన్న, యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకా ఇంస్టాగ్రామ్ లాంటి వాటిని మీరు వాడె వారైతే ట్రోలింగ్ అనే పదము మీకు బాగానే తెలిసే ఉంటుంది. అయితే ఈ ట్రోలింగ్ అంటే ఏమిటి, అసలు ఈ ట్రోలింగ్ చేసే వారు ఎందుకు చేస్తారు. వారికీ దీని వలన లాభం ఏంటి? ముఖ్యంగా ట్రోలింగ్కి గురి అయ్యేవారు, దీని బాధ నుండి ఎలా భయటపడవచ్చు అనే విషయాలను ఒక్కోటి ఇప్పుడు చూద్దాము.

ట్రోలింగ్ అంటే ఇంటర్నెట్ లో కావాలని ఒక వ్యక్తి ఉద్దేశించి, లేదా ఒక వర్గాన్ని ఉద్దేశించి, తన కామెంట్స్ తో విమర్శిస్తూ, అవమానపరుస్తూ, కించపరుస్తూ రకరకాల పదజాలంతో కామెంట్స్ రాయడం. దీనిని మనం ట్రోలింగ్ అని అంటాము. అయితే ట్రోలింగ్ చేసే వారి ఉద్దేశం, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది గురి అవ్వాలని లేదా అతనితో గొడవకి దిగాలని చేస్తారు, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తారు. లేదా ఇది కొన్నిసార్లు ఒక ప్రత్యేక లాభం కోసం కూడా చేస్తారు. ఇలాంటి ట్రోలింగ్ కొన్నిసార్లు ఒక వికృత ఆనందం పొందటం కోసం కూడా చేయవచ్చు.

ఈరోజు ట్రోలింగ్ పాతకాలంలో కథల్లో చెపుతారు కదా....చీకట్లో దాక్కొని ఆ దారిలో వెళ్లే వాన్ని పట్టుకొని పిశాచాలు వేధిస్తాయని, అలాంటి పిశాచాలతో ఈ ట్రోలింగ్ను పోల్చవచ్చు, అయితే ఈ రోజుల్లో కంప్యూటర్ వెనక దాచుకుని వీరు ఇతరులను వేదిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ట్రోలింగ్ మంచిదే, ఒక వ్యక్తి లేదా ఒక సెలబ్రిటీ ఏదైనా తప్పు చేసినప్పుడు, తప్పు మాట్లాడినప్పుడు, అతనిని ట్రోలింగ్ చేసి, అతని తప్పు ఏంటో అర్ధం చేయించి, అతనిలో మార్పు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ ట్రోలింగ్ ఉపయోగపడింది. కాని చాల సందర్భాల్లో ఇది ఇతరులను ఇబ్బందికే గురి చేసింది అని చెప్పవచ్చు.

ఇంటర్నెట్ అనేది మన సోషల్ లైఫ్ లో ఇప్పుడు ఒక భాగం అవ్వడం వలన ఈ ట్రోలింగ్ ని తెలుసుకొని, దాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతో ఉంది. లేదా చాలామంది ఈ ట్రోలింగ్ వల్ల అనవసరమైన ఇబ్బందులకు గురవుతూ, కొన్నిసందర్భాల్లో భౌతిక దాడులకు కూడా గురి అవుతున్నారు. మరి కొన్ని సందర్భాల్లో ఈ ట్రోలింగ్ని తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు, కాబట్టి ఈ సమస్య నుండి మనం ఎలా బయటపడాలో నేర్చుకోవాలి. వాస్తవానికి ట్రోలింగ్ చేసేవారు ముసుగు వీరులు కాదు, ముసుగు చోరులు అని గుర్తించాలి. వారు మన మన శాంతిని, ప్రశాంతతని చోరి చేస్తారు. అలా వారు చెయ్యడానికి కొన్ని కారణాలు. మొదటిది...వారి నమ్మకాలే ఇతరులు కూడా నమ్మాలని వారు అనుకుంటారు. వారికీ నచ్చనిది ఎవ్వరికి నచ్చవద్దు అన్నట్టు ప్రవర్తిస్తారు. రెండవది వీరికి చాల వరకు ట్రోలింగ్ చేసే వారిపైన ఈర్ష్య ఉంటుదని. ఆ ఈర్శ్యని ఇలా ట్రోలింగ్ ద్వార వ్యక్తం చేసి ఆనంద పడాలని ఆశిస్తారు. మూడవది...వారు అభిమానించే హీరో లేదా హీరొయిన్ కి ఎవరు పోటి అని వీరు నమ్మిన కూడా వారిని ట్రోలింగ్ చేస్తారు. వారు అభిమానించే హీరో మాత్రమే హీరో అనే ఒక గుడ్డి నమ్మకంలో వీరు వుంటారు. నాలుగవది...వీరి జీవితంలో వీరు ఒక ఫెయిల్యూర్ అయి ఉండవచు, ఒక డిప్రెషన్ లో వుంది ఇతరులను ఇలా విమర్శిస్తూ వారి భాదని మరచిపోవాలని కూడా ప్రయత్నిచవచ్చు. అలా ఇతరులను ట్రోలింగ్ చేయడం ద్వార కొంత సమయం బలవంతులుగా ఫీల్ అవ్వవచ్చు. ఐదవది.....కొద్దిమంది ఇంటర్నెట్ పై వారి ముఖం కనపడదు కాబట్టి...వారికీ వచ్చే కోపం, విసుగుని వ్యక్తపరచటానికి కూడా ఈ ట్రోలింగ్ని వాడుకోవచ్చు. ఆరవది... ఈ మద్య కాలంలో ఇతరులకు, కొన్ని సంస్థలకు డబ్బులు ఇచ్చి వారి పోటిదారులను బలహీనపరచటం కోసం కూడా ట్రోలింగ్ని వాడుతున్నారు. ఈ ట్రెండ్ ఈ మద్య బాగా పెరుగుతుంది. ఇలా ఎన్నో కారణాల వలన ఈ ట్రోలింగ్ని వ్యక్తులు చేస్తున్నారు.

అయితే మనం గుర్తువుంచుకోవాల్సింది... ట్రోలింగ్ చేసేవారు మనని సద్విమర్శితున్నారు అని భ్రమ పడవద్దు. వారి ఉద్దేశమే అవమానించడం, విసుగు కలిగించడం, మీ ప్రశంతతని దెబ్బ తీయడం. ఈ ట్రోలింగ్ youtube కామెంట్స్ అయివుండవచ్చు, మీ పేస్ బుక్ ఇలా ఎక్కడైనా అయివుండవచ్చు. వీటిని అధిగమించే పద్ధతి...

ఒకటి.....వాటిని పట్టించుకోకండి: చాల సందర్భాల్లో ఈ కామెంట్స్ కు ఎలాంటి విలువ ఉండవు. ఏదో టైం పాస్ కోసం వారి పెట్టిన కామెంట్స్ లాంటివి ఉంటాయి. కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అవి విమర్శలు కాదు కాబట్టి, అవి మిమ్మల్ని అవమానించడమే వారి ఉద్దేశం కాబట్టి, మిమ్మల్ని అపహాస్యం చేయడమే వారి ఉద్దేశం కాబట్టి పట్టించుకోకండి.

రెండు... మీ సమయాన్ని కేటాయించెంత ముక్యమైనవి కావు ఆ కామెంట్లు కాబట్టి మీ విలుమైన సమయాన్ని వాటిపై వృధా చేసుకోకండి.

మూడు..బ్లాకు చెయ్యండి. ఎలాంటి సోషల్ మీడియా లో నైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిని మీరు బ్లాకు చేసే అవకాశం వుంది కాబట్టి బ్లాకు చేసేయండి.

నాలుగు... శ్రుతి మించితే, దానికి సంబంధిచిన అధికారులకు ఫిర్యాదు చెయ్యండి.

ఐదు... మీ సెన్స్ అఫ్ హుమార్ దానిని కొట్టిపడేయండి.

ఇలా పై విషయాలు మీరు అర్ధం చేసుకోవడం వలన ట్రోలింగ్ సమస్య నుండి భయటపడవచ్చు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories