"ఆస్తుల ద్వార వచ్చే ఆదాయం".

ఆస్తుల ద్వార వచ్చే ఆదాయం.
x
Highlights

ఫ్రండ్స్, ఈ రోజు మనం చర్చించే అంశం... "ఆస్తుల ద్వార వచ్చే ఆదాయం" అతిపెద్ద "ఈ కామర్స్" సంస్థ అనగానే ఇప్పుడు అందరికి గుర్తుకువచ్చేది.......

ఫ్రండ్స్, ఈ రోజు మనం చర్చించే అంశం... "ఆస్తుల ద్వార వచ్చే ఆదాయం"

అతిపెద్ద "ఈ కామర్స్" సంస్థ అనగానే ఇప్పుడు అందరికి గుర్తుకువచ్చేది.... "అమెజాన్". ఒక చిన్న ఇంటి గ్యారేజ్ లో ప్రారంభం అయిన ఒక కంపెనీ ఇది అని, మీకు తెలుసా! ప్రపంచం లోనే అతిపెద్ద కంపెనీలలో అమెజాన్ ఒకటిగా మారడం వెనుక ఒక వ్యక్తి కృషి ఉంది. ఆ వ్యక్తి జెఫ్ బెజోస్. అతను మంచి జీతం, హోదా ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని అమెజాన్ అనే ఒక చిన్న వెబ్ సైట్ పెట్టి పుస్తకాలు అమ్ముకుంటున్నప్పుడు ఇతన్ని చూసి అందరూ పిచ్చివాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో బిల్ గేట్స్ ను దాటి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇలా ప్రపంచంలో ఎందరో డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అయితే డబ్బు సంపాదించడం వేరు, ధనవంతులు అవ్వడం వేరు అంటారు....రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తకరచయిత రాబర్ట్ కియోసాకీ.

సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలను బాగా చదువుకోమని చెప్తారు. మంచి మార్కులు తెచ్చుకోమంటారు. దానివల్లనే మంచి ఉద్యోగం వస్తుందంటారు. ఉద్యోగ జీవితంలో కష్టపడి పనిచేయడం ద్వారా ప్రమోషన్ సంపాదించి సుఖంగా బతకొచ్చు అంటారు. కానీ, ఇలా కష్టపడి చదివి, ఉద్యోగం సంపాదించుకుని, ప్రమోషన్ పొందిన వాళ్లంతా ధనవంతులనే భ్రమలో మాత్రమే వుంటారు. నిజానికి వీరెవరూ ఒక్క ఆరు నెలలు ఉద్యోగం లేకపోతే చాల ఇబ్బంది పడుతారట...ఆర్ధిక కష్టాలు పడుతారట. అలా కాకుండా...ఉద్యోగ జీవితంలో టేబుల్ క్రింద చేయి పెట్టి, అంటే అవినీతి మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి ఆస్తులు కూడబెదితే, దాని ద్వార వచ్చే సమస్యలు, టెన్షన్, కేసులు వేరుగా వుంటాయి. కాబట్టి సంస్థ యొక్క యాజమాన్యం వేతనంగా ఇచ్చిన డబ్బులద్వారా కోటిశ్వర్లవ్వడం అసాధ్యమే అని గుర్తుకు పెట్టుకోవాలి. మరి కోటిశ్వర్లు అవ్వాలంటే ఏమి చెయ్యాలి అనే అనుమానం మీకు రావచ్చు.

దానికోసం ముందుగా అసలు ఈ డబ్బు మన జీవితంలోకి ఎలా వస్తుంది, ఎటు పోతుంది, అలాగే మన ఆస్తులు ఏంటి, మన అప్పులు ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా పేదవారు డబ్బుకోసమే పనిచేస్తారు. కానీ ధనికులు తమకోసం డబ్బు పని చేసేట్టు చేయగలుగుతారు. అలాగే ధనవంతులు డబ్బుకోసం పనిచేయకుండా, నేర్చుకోవడం కోసం పనిచేస్తారు. ఇంకా ధనవంతులు డబ్బుచేత డబ్బును సృష్టించడమెలానో నేర్చుకుంటారు. అలాగే "ధనవంతులు ఆస్తులను కొంటారు. బీదవాళ్లు ఖర్చులు మాత్రం చేస్తారు. మధ్య తరగతి వర్గం అప్పులను కొంటూ, వాటిని 'ఆస్తులని' భ్రమిస్తారని రాబర్ట్ కియోసాకీ అంటారు.

అదెలా అంటే...జీతంగా నెలనెలా సంపాదించేది మన ఆదాయం, లేదా ఒక పని అనే మార్గం ద్వార మన ఆదాయం మన జేబులోకి చేరుతుంది. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, నీటి పన్ను, పాల బిల్లు, మెడికల్ ఖర్చులు, తిండికయ్యే ఖర్చు, బట్టలు ఇతరత్రా మొదలైనవన్నీ ఖర్చు జాబితాలోకి వస్తాయి. ఇలా అనేక మార్గాలద్వారా మన ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నాం. నెల మొదటి రోజున వచ్చే ఆదాయాన్ని ముప్పై రోజులపాటు ఖర్చుపెట్టగా మిగిలిన సొమ్మును మన ఆస్తి లేదా సంపద అని అనుకొంటాము. అయితే ఇప్పడు మన ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు వూడుతాయో..తెలియని పరిస్తితుల్లో ఎక్కువమంది జాబు చేస్తున్నాము. మన నెల ఖర్చులు పోను మన జేబులో మిగిలింది, మన దగ్గర వుండే డబ్బు, కానీ ఈ డబ్బు మన మింకా ఎన్ని రోజులు సుఖంగా బతుకుతామో తెలియజేస్తుంది.

మన ఖర్చులను వీలైనంత తగ్గించుకోవడం, అంటే పొదుపుగా జీవించడంద్వారా, మరికొంత డబ్బును మిగుల్చుకోగలుగుతాం. అలా చెయ్యడం ద్వార కొంత డబ్బు మన దగ్గర పోగు అవుతుంది. అలా పొదుపుచేసి మిగుల్చుకున్న సొమ్ముతో మనం రకరకాల వస్తువులు కొనుక్కుంటాం. ఉదాహరణకు మన కంఫర్ట్ కోసం కొనే మోటార్ సైకిల్, ల్యాప్ టాప్, కారు, సుఖంగా వుండడానికి ఇల్లు లేదా ఇంట్లోకి సామానులు టీవీ, ఫ్రిజ్ వగైరా వీటన్నిటిని మనం ఆస్తులని నమ్ముతాం. రాబర్ట్ కియోసాకీ ప్రకారం..నిజానికివి ఇవి ఆస్తులు కావట. బైక్ కొనడం ఒక వ్యయ మార్గమైతే, దాని మెయింటెనెన్స్, పెట్రోలు అదనపు వ్యయ మార్గాలు. మన జేబులోంచి డబ్బులు బయటకు తీయించేదేదైనా అది ఆస్తి కాదు. అప్పుగానే పరిగణించాలి అంటాడు రాబర్ట్.

మరి మన ఆస్థి ఏంటి అని అంటే...మన వేతనం కాకుండా మరేదైనా ఇతర మార్గాల ద్వారా ఆదాయం చేరేదేదైనా మన ఆస్తి అవుతుంది. మనం కొనే రెండో ఇల్లు అద్దెకిస్తే వచ్చే కిరాయి అదనపు ఆదాయ మార్గం. అంచేత రెండో ఇల్లు మన ఆస్తి, కానీ మనం వుండే ఇల్లు ఆస్థి కాదు. కాబట్టి మన ఆదాయం వీలైనన్ని ఎక్కువ మార్గాల ద్వారా నిరంతరం ఆదాయాన్ని పెంచుతూవుండాలి. అలాగే మనం మన వ్యయాన్ని నియంత్రించాలి. ఇలా ఖర్చు తగ్గించుకొని, వీలైనన్ని ఆదాయ మార్గాలు పెంచుకోవాలి. దీనివల్ల అప్పుల జాబితా క్రమక్రమంగా తగ్గిస్తూ, ఆస్తుల జాబితాను త్వరత్వరగా పెంచగలుగుతాం. అయితే ఈ పద్దతిని ఆచరణలో పెట్టాలి అంటే మన ఆలోచన విధానం మారాలి. ముందుగా డబ్బు గురుంచి మనం ఏమి నమ్ముతున్నాము అనేది ముఖ్యం. కాబట్టి ఆ ధనవంతుల ఆలోచనలు ఏంటో ఇప్పుడు చూద్దాము.

మొదటిది... ధనవంతులు వారి డబ్బుని ఒక సాధనంగా చేసి, దానిని ఉపయోగంలో పెట్టి, దాని ద్వార డబ్బు సంపాదిస్తారు అని గుర్తించాలి. ఇలా డబ్బుని పెట్టుబడిగా పెట్టి వీరు సంపాదించగలరు.

రెండవది... ధనవంతులు నిత్యవిద్యార్తిగా వుంటారు, డబ్బుకి సంబందించిన, వారి వ్యాపారానికి సంబందిన్చిన అన్ని విషయాలు నేర్చుకుంటూ వుంటారు.

మూడవది....ధనవంతులు సమస్య గురించి ఎక్కువ ఆలోచించకుండా, దాని పరష్కారం పైనే ఎక్కువ ద్రుష్టి పెడుతారు. అలా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపెడుతూ డబ్బు సంపాదిస్తారు.

నాలుగవది.... వారి డబ్బు పెట్టుబడి పెట్టిన, లేదా వ్యాపారంలో కూడా దూరద్రుష్టి తో ఆలోచిస్తారు, ఎక్కడ డబ్బు పెడితే ఎక్కువ కాలం, ఎక్కువ డబ్బు లాభం వస్తుందో చూస్తారు.

ఇలా ధనవంతులు వారి ఆస్తులను పెంచుకొని, వాటి ద్వార వారి ఆదాయాన్ని ఎప్పుడు వచ్చేలా చూసుకుంటారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విషయాలను ఆచరణలో పెట్టి మీ ఆస్తులను, ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories