Top
logo

మీరు "ట్రై" చేస్తా! అన్నారంటే, మీ ఫలితాలు "క్రై" చేస్తాయి అన్నట్టే!

మీరు ట్రై చేస్తా! అన్నారంటే, మీ ఫలితాలు క్రై చేస్తాయి అన్నట్టే!
Highlights

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం.... మీరు 'ట్రై' చేస్తా! అన్నారంటే, మీ ఫలితాలు 'క్రై' చేస్తాయి ...

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం....

మీరు "ట్రై" చేస్తా! అన్నారంటే, మీ ఫలితాలు "క్రై" చేస్తాయి అన్నట్టే!

శేఖర్ తన ఫ్రెండ్ రఘు తో "సాయంత్రం తప్పక ఇంటికి రారా, నీతో చాల పనివుంది" అని అన్నాడు.

అప్పడు రఘు... ట్రై చేస్తారా అని అన్నాడు.

ట్రై చేస్తా...అని రఘు అన్నాకూడా శేఖర్కి, రఘు తన ఇంటికి వస్తాడని పూర్తి నమ్మకం రాలేదు.

రఘు వాళ్ళ బాస్ తో, "సర్ ఈ సరైన నా సాలరీ పెంచండి" అని అన్నాడు.

అప్పుడు బాస్...ఓ.కే నేను ట్రై చేస్తాను అన్నాడు.

ట్రై చేస్తా అని..బాస్ అన్నాకూడా...రఘుకి ఈ సారి కూడా సాలరీ పెరుగుతుందని నమ్మకం కలుగలేదు.

ఫ్రెండ్స్! అలా ఆ ఇద్దరికీ ఎందుకు పూర్తి నమ్మకం కలగలేదో మీరు ఉహించగలరా!

ఎందుకంటే....మన రోజువారీ పదాలు, మన మానసిక స్థితిపై మరియు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. మనము ఉపయోగించే భాష, మన అంతర్గత ఆలోచనల యొక్క ప్రభావంతో వుంటుంది. మనం ఉపయోగించే పదాలలో, ఎ పదం చాల జాగ్రత్తగా వాడలో మనకు తెలిసి వుండాలి. రఘు మరియు అతని బాస్ "ట్రై చేస్తా" అనే పదాన్నే వాడారు కాబట్టి, నమ్మకాని పొందలేకపోయారు.

ఫ్రెండ్స్ ఒక రోజులో మీరు ఇతర వ్యక్తుల నుండి, "ట్రై చేస్తా" లేదా "ప్రయత్నిస్తాను" అనే పదాన్ని, దాదాపు ఎన్ని సార్లు వింటారో మీకు తెలుసా?

ట్రై అనే పదం వినడానికి బాగానే వుంటుంది...కొంత ఆశని ఇస్తుంది. కాని ట్రై చెయ్యడం అంటూ వాస్తవంలో ఉండదు. మీరు ఇంకా ఒప్పుకోవట్లేదా?

అయితే ఒక చిన్న ప్రయోగం చేద్దాము. అది ఏంటంటే...

మీరు ఇప్పుడు, ఎక్కడ వున్నారో...అక్కడ వీలుగా వుంటే.. నిలబడటానికి "ప్రయత్నించండి." ఇప్పుడే ప్రయత్నించండి...... నిలబడటానికి ప్రయత్నించండి....

నిలబడటానికి ప్రయత్నించారా?...నిలబడటం కాదు. నిలబడటానికి ప్రయత్నించాలి.

ఇప్పటికే మీకు అర్ధం అయివుండవచ్చు... మనం నిలబడగలం లేద నిలబడలేము...కానీ ప్రయత్నించటం అనే ఫలితం ఉండదు.

మనం "నేను ప్రయత్నిస్తాను" అని చెప్పినప్పుడు, మనం నిశ్చయంగా, ఆ పనికి పూర్తిగా సిద్ధంగా లేమని అర్ధం. అందుకే ఇంగ్లీష్ బాషలోని ట్రై అనే మూడు అక్షరాల పదం, చెప్పేవారిని, వినేవారిని, ఇద్దరిని కూడా పూర్తి భ్రమలో ఉంచేస్తుంది. ప్రయత్నిస్తాను అంటే...ఫలితాన్ని ఇస్తాను అని అన్నట్టు కాదు. అసలు ట్రై చేస్తా అన్నారంటే, దాని అర్ధం రెండు విషయాలట. ఒకటి ట్రై చేస్తా అంటే బాద్యతకి భరోసా లేదని! రెండు ట్రై చేస్తా అంటే ఆ పని చెయ్యగలనని నమ్మకం లేదని అర్ధమట!

అందుకే ట్రై చేస్తా అంటే....అదే ఓటమికి రహదారి అని గుర్తించాలి! ట్రై అంటే మనం ఆప్షన్స్ వుంచుకుంటున్నాము అని అర్ధం. ఎవరికైనా ఆప్షన్స్ వున్నప్పుడు చూద్దాంలే అనిపిస్తుంది. ఇది కాకుంటే మరొకటి అనిపిస్తుంది. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తిని సహాయం అడిగినప్పుడు, వారు ట్రై చేస్తా అని అంటే...ఆ వ్యక్తిని మీరు నిజంగా నమ్ముతారా! కొంచెం ఆలోచించించండి.....ఎందుకంటే ఈ ట్రై చేస్తా అనే పదం మన బంధాలకి భరోసా ఇవ్వదు. మనం ఈ ట్రై అనే ట్రాప్ లో పడి "క్రై" చెయ్యకుండా బయటపడాలి, అదెలాగో ఇప్పుడు చూద్దాము.

తమ గోల్స్ సాధించే వ్యక్తులు, విజేతలు "నేను ప్రయత్నిస్తాను" అని అనరు. దానికి బదులుగా, వారు ఎల్లప్పుడూ "నేను చేస్తాను" అని, లేదా "నేను చెయ్యను" అని అంటారు. ఇప్పటి నుండి మీరు ఎప్పుడు ట్రై అనే పధం వాడినా కూడా, ఒక్క క్షణం ఆగి, మీరు ఆ పదం వెనక అంతర్లీనమైన మీనింగ్ ఏంటో గుర్తించండి. ఆ పనిని చేయగలరని నిజంగా మీరు నమ్ముతున్నారా, కమిట్ కావాలని కోరుకుంటున్నారా...ఒక్క సారి చెక్ చేసుకోండి.

ఎందుకంటే ఒక పనిని చెయ్యడం, లేదా చెయ్యకపోవడం వుంటుంది కాని, వాస్తవానికి "ప్రయత్నం" అని ఉండదట. ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా...ఈ రోజు ఉదయం మీ ముఖం కడగడానికి ప్రయత్నించారా? అని అడిగారానుకోండి..మీరు ఏమి సమాధానం చెపుతారు...ఆలోచించండి. అలాగే ఒక కప్పు కాఫీ తాగడానికి ప్రయత్నించారా అని అడిగితే కొంత సిల్లీగా అనిపిస్తుంది కదా! ఇలా చూస్తే మీరు ఒక పనిని చేస్తారు, లేదా చెయ్యరు, అంతే కాని మద్యలో ఏమి ఉండదు. ఈ ట్రై చేస్తా అని అనడానికి మూలా కారణం మన మనసులోనే ఉంటుందట. మన మనస్సుల్లో ఎక్కడో దాగున్న భయం మనని ట్రై అనే మాట అనిపిస్తుందట.

ఉదాహరణకి...జంతువులు తాము చేసే పనులను చేయటానికి ప్రయత్నించవు, అవి ముందుకు సాగి, చేసేస్తాయి. అది ఆ పని చేయకపోతే, జంతువులు ఆ విధంగా ఎలా చేయకూడదో నేర్చుకుంటాయి. కాని మనిషిగా మనం ఒక పనికి పూర్తిగా నిబద్ధత పొందనప్పుడే, ఈ ప్రయత్నిస్తాను అనే మాటని అంటామట. చాలా విషయాలలో మనం ప్రయత్నం అనే పదం వాడటానికి కారణం భయపడుతున్నామని అర్ధం. మనకు తెలియని భయం ఏదైనా ఉండవచ్చు, వైఫల్యం భయం, ఎగతాళి భయం, విజయ భయం కూడా అయివుండవచ్చు.

అయితే ఏ భయం అయిన, మన డ్రీమ్స్ సాధించడానికి, మనం ముందుకు వెళ్ళకుండా ఆపుతుంది. మనకు వున్నా అన్ని భయాలలో ప్రత్యేకమైన భయం ఏంటంటే... ఏదైనా తప్పు జరిగితే, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, తెలియకపోవడం వల్ల వచ్చే భయమట. అయితే మనం బాగా గుర్తుకు వుంచుకోవల్సింది ఏంటంటే " ఓటమిని ధైర్యంగా ఎదుర్కోడానికి సిద్దపడ్డవారికే, ఒక రోజు విజయం "హాయ్" చెప్పి "హాగ్" ఇస్తుంది". అలాంటి వారు మాత్రమే విజయ రాణి స్వయంవరంలో గెలుస్తారు.

ఏదైనా ఒక పనిని మనం సగం మనస్సుతో చేయడం వల్ల, ఫలితాలు సరిగ్గా లేక, ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. అలా చేస్తే "నేను ట్రై చేశాను" అనే ట్రాప్ లో పడిపోతము. కాబట్టి మనం అనుకున్నట్లు ఈ ట్రై నుంచి బయటపడాలి, అలాగే విజయం సాధించాలంటే, ముఖ్యంగా రెండు విషయాలు చాలా అవసరం.

ఒకటి మనం పనికి సంబంధించిన, చర్యని రోజు చెయ్యడం. అంటే మీ దృష్టిని, కృషిని, సమయాన్ని, శక్తిని 100% మీ పనికే ఇచ్చి, దాని కోసం ముందుకు అడుగేస్తునే వుండాలి. ఇలా ముందుకు వెళుతుంటే, ఏదైనా ఇబ్బంది వచ్చిన, అడ్డంకు వచ్చిన, దానిని ఓటమిలా చూడకుండా, ఒక ఫీడ్ బ్యాక్ లా మాత్రమే చూసి, దాని నుండి నేర్చుకోవల్సింది, నేర్చుకొని ముందుకి వెళ్ళగలటం వల్ల, విజేతగా నిలవగలం, అందరి అభినందనలు పొందగలం.

రెండు మన యొక్క 100% కమిట్మెంట్ ఇవ్వడం. వాస్తవానికి మనం ఎన్నో పనులు మొదలు పెట్టి, వాటిని చివరివరకు చెయ్యకపోవడానికి కారణం, జస్ట్ ట్రై చెయ్యడమే, మనకి ఆ పనుల విషయంలో పూర్తి కమిట్మెంట్ లేకపోవడము వల్లే ఆ పనులని మద్యలోనే మాయమయిపోతాయి... అందుకే పోకిరి సినిమాలో మహేష్ బాబు అన్నట్టు..ఒక్కసారి కమిట్ అయితే ...మన మాట మనమే వినకూడదు. అలా ఆ కమిట్మెంట్ తెచ్చే విజయం, మన కటౌటును విజేతగా నిలుపుతుంది, అందరి గుండెల్లో నిలబెడుతుంది.

ఈ రెండు విషయాలు పెంచుకోవటం ద్వారా, ఎప్పుడైతే రఘు మరియు అతని బాస్ ట్రై అనే పదాన్ని వదిలేసారో, ఎన్నో విజయాలు సాదించారు. ఈ రోజు మనం చర్చించిన విషయం, మీరు ఆచరణలో పెట్టడానికి, " ఒక రోజులో మీరు చేయ్యలనుకుంటున్న పనిని, ట్రై చేస్తా అనుకోకుండా, ఈ పని "నేను చేస్తా" అని అనుకోని చూడండి. ఈ ఒక్క మార్పు... మీ రోజుని మరియు దాని ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి. ఇలా చెయ్యడం వల్ల ట్రై అనే పదం మీ డిక్షనరీ నుండి డ్రై అయిపోయి, మిమ్మల్ని అన్ని రంగాలలో విజేతలుగా నిలుపుతుంది. ఆల్ ది బెస్ట్.


లైవ్ టీవి


Share it
Top